నమ్మలేని నిజం

(అంశం : మది దాటని ప్రేమ)

నమ్మలేని నిజం

రచయిత : జీ వీ నాయుడు

ఇది పాతికేళ్లనాటి యాదార్ధ గాధ. నెల్లూరు నగరంలో రాము అనే ఓ పాతికేళ్ల యువకుడు ఓ ప్రవేటు పాఠశాలలో టీచర్ ఉద్యోగం చేసుకొని కాలం గడిపే వారు… అంతలో ఓ విద్యార్థిని తండ్రి తో ఆ మాస్టారు కు స్నేహం ఏర్పడింది..అతను పేరు ఈశ్వర్.. రామును ఈ ఈశ్వర్ పంతులు అని సంబోధించేవారు. ఆయన వేషభాషలను బట్టి రాము ఓ బ్రాహ్మణుల అబ్బాయి అనుకున్నాడు. రాము మాత్రం నేను టీచర్ ను కనుక పంతులు అని పిలుస్తున్నాడు అనుకునే వాడు.. ఒక ఆదివారం రోజు ఇరువురు నెల్లూరు లో ఓ సినిమా కు వెళ్లారు… మాటల్లో ” పంతులూ నీకు ఓ అమ్మాయి ని చూస్తాను. పెళ్లి చేసుకుంటావా ” అని అడిగాడు.. ఆ అయినా ఇప్పుడే పెళ్లేందుకు లే… ఇంకా ఉంది కదా… టైం.. చూద్దాం లే అని సరి పెట్టు కున్నారు రాము.
మొత్తానికి రాము కు ఎలా అయినా పెళ్ళి చేయాలనే సంకల్పం ఈశ్వర్ లో అధికం అయింది.
ఈశ్వర్ కు స్వామీ అనే ప్రాణ స్నేహితుడు ఉన్నాడు. వారిద్దరి మాటల్లో రాము పెళ్ళి వివాహం ప్రస్థాపన వచ్చింది. మా ప్రెండ్ రాము కు మంచి అమ్మాయి కావాలి అని స్వామీ కి చెప్పాడు ఈశ్వర్… ఆ అబ్బాయి గుణగణాలు చెప్పడంతో స్వామి ఆలోచనల్లో పడ్డాడు.. ఒక రోజు స్వామీ ఈశ్వర్ ను కలుస్తాను ఎక్కడ ఉన్నారు అని అడిగే సరికి, ఈశ్వర్ ఆనందం పట్టలేక నేనే వస్తున్నా అని స్వామి ఇంటికి వెళ్ళాడు.. ” రాణీ…అంకుల్ కి మజ్జిగ కాస్త ఇవ్వు పాపం ఎండలో వచ్చాడు ” అంటూ కూతురు రాణీని సైగ చేసాడు తండ్రి స్వామీ. మజ్జిగ తెచ్చిన రాణీ అందచందాలు, ఆమె నడవడిక, మాట తీరు, గౌరవ మర్యాదలు ఈశ్వర్ ను కట్టిపడేసాయి.. అంతలోనే కల్పించుకుంటూ ఈశ్వర్, రాణితో మాటలు కలిపాడు.”నేను మీ డాడీ బెస్ట్ ఫ్రెండ్స్… నిన్ను ఎప్పుడో చూసా.. ఏంటి జాబ్.. ఎక్కడ వర్క్, ఎలా ఉంది జాబ్ ” ఇలా ప్రశ్నల వర్షం కురిపించి వివరాలు రాబట్టాడు ఈశ్వర్. స్వామి కలుగ జేసుకొంటూ పాపకు పెళ్ళి చెయ్యాలోయ్… మరి మేనకోడలు పెళ్ళి కోసం మేనమామ ఏమి చేస్తాడో అంటూ ఈశ్వర్ ఆంతరంగం రాబట్టాడు స్వామి వరసలు కలుపుతూ.
స్వామి “బంగారు లాంటి అల్లుడు రెడీ.. నీదే ఆలస్యం ” అన్నాడు ఈశ్వర్.
ఓ పది రోజులు గడిచాయి.

ఈశ్వర్, నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ లో తన బావను హైదరాబాద్ వెళ్లేందుకు కారులో డ్రాప్ చేసాడు.తిరిగి వెళ్ళన్న సమయం లో రాణీ, స్వామి కనిపించారు..” ఏంటి సడన్ విజిట్. కనీసం చెప్పలేదు.” అంటూ ఈశ్వర్ ఆప్యాయంగా వారికి స్వాగతం పలికాడు.
“” ఏమిలేదు ఈశ్వర్ పాపకు అర్జెంట్ మీటింగ్ ఉంటే వచ్చాము ” అయిపోగానే వెళ్తాము అన్నాడు ఈశ్వర్.
ఐతే ఒక పని చేద్దాము మీ మీటింగ్ కు చాలా టైమ్ ఉంది. పాప ఎలాగూ ఇక్కడ కి వచ్చింది, కనుక నేను మా ఫ్రెండ్ ని తీసుకొని వస్తాను.. అబ్బాయి, అమ్మాయి ఇష్టపడ్డారు అంటే పెళ్ళి పనులు చూసుకోవచ్చు అంటూ సలహా ఇచ్చారు ఈశ్వర్. మరి అబ్బాయి వివరాలు ఏమి చెప్పలేదు అన్నాడు స్వామీ…
” ఒకే సారి అల్లుడుని చూసుకో.. నచ్చితే వివరాలు తెలుసుకో ” అంటూ ఈశ్వర్ బదులిచ్చాడు.. సరే పక్కనే ఉండే ఓ హోటల్ లో రూం బుక్ చేస్తాను. రండి.. ”పాప రెడీ అయ్యేలోపు, ఆ అబ్బాయిని ఇక్కడ కే తీసుకొని వస్తాను “” అంటూ బయలు దేరాదు ఈశ్వర్.
రామూ.. మనం ఓ ఫంక్షన్ వరకు వెళ్ళివద్దాము, కొంచం పని ఉంది..మంచిగానే తయారైయ్యు రా.. అంటూ అసలు విషయం చెప్పకుండానే ఈశ్వర్ కారులో రామూని వెంటపెట్టుకొని హోటల్ కి చేరుకున్నారు.

స్వామి ఈ అబ్బాయి, పేరు రాము. నిజంగా పేరుకు తగ్గవాడే. ఈమె పేరు రాణీ. స్వామీ గారి ముద్దుల కుమార్తె. నాకు మేనకోడలు అవుతుంది. ప్రభుత్వ ఉద్యోగం”. అంటూ ఈశ్వర్ పరిచయం చేశారు.. సరే.. స్వామి మనం ఈ ఫ్లాస్క్ తీసుకొని కిందకు వెళ్లి కాఫీ తీసుకొద్దాం. రండీ.. ఈ లోపు రామూ, రాణి ఏదో మాట్లాడు కుంటారు అంటూ ఇద్దరినీ ఎకాంతంగా వదిలి కింద కు వెళ్లారు ఈశ్వర్, స్వామి.

రామూ పేరు చాలా బాగుంది అంటూ మాటలు మొదలు పెట్టింది రాణీ. చాలా సేపు రాణీ అతన్నే కన్నార్పకుండా చూస్తున్నా రాము అలాగే ఆమెను చూస్తుండిపోయాడే కానీ ఏమీ మాట్లాడలేదు. అందుకే సిటీ పిల్ల కావడంతో రాణి చొరవ చూపింది.. ఉద్యోగం, చదువు, కుటుంబం స్వగ్రామం తదితర విషయాలు అడిగి తెలుసుకుంది రాణీ.మొత్తం మీద రాణి మనసు లో రాము పాకా వేసాడు. మీరు నియోగుల, వైదీకులా అని అడిగింది రామూను రాణీ ముచ్చట పడి చూస్తూ. అర్ధం కాలేదు అన్నాడు రాము.. అదేమిటి అలా.. అంటారు.. మీరు బ్రాహ్మీన్స్ కాదా.. అని ఆశ్చర్యంగా అడిగింది.. రాము ముఖం లో తెలియని ఆందోళన.
ఇంతలోనే స్వామీ, ఈశ్వర్ కాఫీ తో వచ్చారు.. అందరు కాఫీ తాగారు. స్వామీ నీ సైగ చేసి బయట వరండోలికి పిలిచింది రాణీ. స్వామీ తో పాటే ఈశ్వర్ కూడా వచ్చాడు.. అంకుల్ ఆ అబ్బాయి బ్రాహ్మిన్స్ కాదట కదా అని చెప్పే సరికి స్వామి, ఈశ్వర్ కంగు తిన్నారు. నేను పంతులు అని పిలుస్తుంటే పలుకుతున్నాడు అనే లోపే రాణీ కలుగ జేసుకుంది.. డాడీ.. అంకుల్.. ఆ అబ్బాయి చౌదరి.. నాకు బాగా నచ్చాడు. రాము పేరు అక్షరాలా సార్ధకం. కులాలు మతాలదేముంది డాడీ. మంచి మనస, మనసునిండా ప్రేమ ఉండాలి. మనిషిని గౌరవించగలగడం మానవత్వం అంటూ రాణీ తనలో అతని పట్ల ఉన్న భావన వ్యక్తం చేసింది. అందరు కలిసి రూమ్ లోకి వచ్చి రాముతో మాటలు కలిపారు.. రాణీ వాళ్ళు బ్రాహ్మిన్స్.. మీరు కూడా అదే అనుకున్నా.. అయినా పర్వాలేదు. మా అమ్మాయి మాకు ప్రాణం. ఆమె చెప్పిందే వేదం.. చౌదరి అయినా ఓకే. అంటుంది రాణీ.. మరి నీ ఇష్టం ఏమిటి అంటూ ఈశ్వర్ రాముని అడిగాడు.. అంకుల్ మాది పల్లెటూరు. బ్రాహ్మణులు అంటే మాకు దేవతలతో సమానం.నేను ఆలోచించి చెబుతాను అంటూ రాము రాణి వైపు చూశాడు.ఆమె ముఖం లో ఏమిటో తెలియని బాధ కనిపించింది..అందరు వెళ్లారు. కొద్దీ రోజులు గడిచాయి.. ఆ అబ్బాయి కి సంబంధం చూసి చౌదరి అమ్మాయి తో వివాహం చేశారు. ఈ విషయం తెలుసుకున్న రాణి అసలు నాకు పెళ్లి వద్దు అంటూ అలానే ఉండిపోయింది.. తల్లిదండ్రులు ఎంత ఒత్తిడి చేసినా ససేమిరా అంటుంది. ”మనసు దాటని ప్రేమ ” చాలా గొప్పది.. ఆ అబ్బాయి కి ఇవ్వాలి అనుకున్నా తీసు కోలేక పోయారు.. వేరే వాళ్లకు ఇవ్వలేను.. అంటూ ఆ ప్రేమ దేవత అవివాహితగానే మిగిలిపోయింది. ప్రేమ ఒకరికి మాత్రమే సొంతం అంటుంది రాణీ..

You May Also Like

One thought on “నమ్మలేని నిజం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!