రూపాయి విలువ
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన:రాధ ఓడూరి
రూపాయి…
ఒకప్పుడు తన విలువను పెంచుకుంటూ
బికారిని లక్షాధికారి చేసి
సమస్త మానవాళికీ
బంధుత్వం అర్థం తెలిపింది
మరి ఇప్పుడు…!!
తన విలువను తగ్గించుకుంటూ
రొప్పుతూ సన్నగిల్లి
సామాన్యుడిని సైతం బికారిని చేసి
సమస్త వస్తు సౌకర్యాలను అలవాటు చేసి
గుండెల్లో గుబులు పుట్టిస్తూ
కుప్పిగంతులు వేయిస్తూ
చివరకు తన హోదానే కాకుండా
సమస్త మానవాళికీ
బంధుత్వాల మధ్య చిచ్చు పెట్టింది
రూపాయి నిజంగానే శల్యమైనది
సాపేక్షమైనది
రూపాయి గురించి చక్కగా చెప్పారు. బాగుంది