సెలవు సఖి

సెలవు సఖి

రచయిత:జి.వి.లక్ష్మి

నేను రాసే తొలిలేఖ

నీకై నేను రాసే లేఖ

మదిలోని భావాలను అక్షరాలను చేస్తున్న

కేవలం అక్షరాలని కొట్టిపారేస్తావో

అక్షరాలలోని ఆశలను గుర్తిస్తావో

కలం కదలనన్నది సఖి నీ ఊహ రానంతవరకు

కాలం నిలువనన్నది చెలి నీ పరిచయం కానంతవరకు

నా చిన్ని ప్రపంచానికి కొత్త రంగులను చేర్చి బృందావనం చేసావు

సీతాకోకవై నా బృందవనానికి మరిన్ని సొగసులు చేర్చవా

బహుదూరపు బాటసారినైనపయనిస్తున్న

చిరకాల స్నేహానివై చేయందించవ

యదసవ్వడివి నీవైనావే

ప్రాణమై బ్రతికించవా

ప్రతి స్పందనలోను నీవే వున్నావు 

వినిపించలేదా చెలి

గుండెలో కొలువైన నీ రూపాన్ని కనులతో కాదు

మనసుతో చూడు

నీవు లేని నేను లేనని అనను

నీవు లేకుండా మాత్రం నేను నేనుగా లేను

పిచ్చిరాతలని కొట్టిపరేస్తావో

చిత్తు కాగితమని

పారవేస్తావో నీదే భారం..!

You May Also Like

One thought on “సెలవు సఖి

Leave a Reply to హసీనాఇల్లూరి Cancel reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!