స్నేహం

స్నేహం

రచన:-జయకుమారి

ఎరా జయ ఎక్కడ ఉన్నావ్. నీ కోసం ఎదురుచూస్తున్న, త్వరగా రా.!
సరే అక్క బస్ ఎక్కాను ఇప్పుడే గంటలో నీ దగ్గర ఉంటా అని ఫోన్ పెట్టేసి సాంగ్స్ వింటూ, నీరు అక్క రక్తసంబంధం కాదు, చుట్టరికం కాదు కానీ ఏ బంధం లేదు కానీ అన్ని బంధాలకు మించిన ప్రేమ ఆ కొద్ది సమయములో నే  కనిపించింది.  అమ్మ పంచే ఆప్యాతను పంచుతుంది. స్నేహితురాలు లా  అన్నిటా తోడు ఉంటూ నా మనస్సు ను పంచుకునే నా ప్రియనేస్తం అయ్యింది.

నిజమే ఆ దేవుడు ఎవ్వరిని ఎక్కడ కలుపుతాడో తెలియదు. కొన్ని బంధాలు మెరుపులా వచ్చి మాయం అవుతాయి. కొన్ని బంధాలు మాత్రం మనస్సుతో ముడిపడి జీవితాతం మనకి తోడు ఉంటూ అనురాగలు కురిపించే ఆత్మీయ బంధం అవుతుంది. అలాంటి బంధమే నాది ,నీరజ అక్కది.మా ఇద్దరినిి ఒక ప్రయాణం కలిపిన ఆత్మీయ ప్రేమ బంధం,దేవుడు కలిపిన అక్కచెల్లిల్ల బంధం. అంటూ తన పరిచయం  ఒక అద్భుతమైన  అనుభవం

విజయవాడ బస్ స్టేషన్  సాయంత్రం 6.30 అవుతుంది. భీమవరం బస్ కోసం ఎదురుచూస్తూ ఏదో ఆలోచిస్తు ఏదో లోకంలో ఉన్న తనకు జయ అని పిలుపు విని, హా చెప్పు అలా ఉన్నావ్ ఏమిటి,ఏమి లేదు శ్రీ ఎపుడు ఒక్కదాన్నే అంత దూరం ప్రయాణం చెయ్యలేదు అందులో నైట్ టైం  అక్కడ నుంచి పాలకొల్లు వెళ్ళాలి అంటే ఏమి ఉండవు,ఫోన్ కూడా చేతిలో లేదు.
అరే బయపడకు నేను బస్ డ్రైవర్ తో చెబుతా.
సరే బస్ లో ఎవరిదైన ఫోన్ తీసుకొని అన్నకి కి చెప్పు .! హ్మ్మ్ సరే.
బస్ బయలుదేరింది ఇళయరాజా మెలోడీ సాంగ్స్ నాకు చాలా ఇష్టం ఆ పాటలు వింటుంటే భయం లేదు ఏమి లేదు ఏమి గుర్తుకు రావు మనస్సు ఎక్కడికో వెళ్ళిపోతుంది. కొంచెం దూరం వెళ్ళాక  పోడవుగా చంద్రబింబం వంటి ఫేస్,చక్కని నవ్వు చూడగానే అబ్బా అనిపించే అందం వచ్చి నా పక్క సీట్ లో కుర్చున్నారు ఇక అంతే అప్పటి దాకా సాంగ్స్ వింటూ కూని రాగాలు తీస్తూ ఉన్న నేను సైలెంట్ గా కూర్చున్న ,ఈ లోపు తను నా వైపు చూసి నవ్వింది, నేను కూడా నవ్వాను  మళ్ళీ మాములుగా కూర్చున్న, నా లా తనకి కూడా సాంగ్స్ అంటే ఇష్టం అనుకుంటా తను పాడుకుంటుంది. మళ్ళీ నా వైపు తిరిగి నవ్వింది
నేను నవ్వి మీకు కూడా సాంగ్స్ అంటే ఇష్టమా అండి అడిగా అవును అని మాట కలిపింది.
నెమ్మదిగా సాంగ్స్ దగ్గర నుంచి తన గురించి చెప్పారు నేను నా గురించి చెప్పా, ఏదో వుంది  తన మాటలో, నవ్వులో ఇట్టే కలిసిపోయారు.
మీరు డాక్టర్ నా అడిగా,నవ్వి కాదు అమ్మ రైటర్ అని చెప్పి తను రాసిన కవితలు చూపించారు ఒక  దానికి ఒకటి అన్ని చాలా బాగున్నాయి.
తన కవితలు,తన మాటలు ఆత్మవిశ్వాసం అన్ని చాలా బా నచ్చాయి.
ఏవండి అంటువుంటే అలా కాదు అక్క అని పిలవు అని అన్నారు.
తర్వాత తన ఫోన్ లోంచి మా వారికి కాల్ చేసి నేను ఎక్కడివరకు వచ్చానో చెప్పారు.
తను మధ్యలో దిగుతూ డ్రైవర్ కి నా గురించి చెప్పి భీమవరంలో దిగిన తరువాత పాలకొల్లు బస్ ఎక్కించండి సర్ తనకు కొత్త అని రిక్వెస్ట్ చేసి, నాకు జాగ్రత్తలు చెప్పి, తను దిగిపోయింది.
కానీ నేను ఇంటికి చేరుకొనేవరకు మా వారికి కాల్ చేస్తూనే ఉంది అంట. నేను ఇంటికి వెళ్ళే సరికి అద్దరాత్రి ఒంటిగంట అయ్యింది.
నేను ఆ టైం లో కాల్ చేసి తనని డిస్టర్బ్ చెయ్యడం బాగోదు అని చెయ్యలేదు.
ఉదయం మా వారు స్కూలుకి వెళ్లిపోవడం తో నేను కాల్ చెయ్యలేకపోయాను.కానీ మా నీరజ అక్క ఉదయం ఆయన సెల్ కి కాల్ చేసి ఏ టైం అయ్యింది వచ్చేసరికి అని రెండు సార్లు చేశారు అంట.
ఎవరో తెలియని నా కోసం అంత జాగ్రత్త తీసుకున్నారు అంటే ఆమె మంచి మనస్సు అర్థం చేసుకోవొచ్చు. ఒక అమ్మ లా ఇప్పటికి నన్ను చూసుకుంటారు. నేను అమ్మతో చెప్పుకోలేని విషయాలు కూడా అక్కమ్మ తో పంచుకుంటా.

అమ్మ లా ప్రేమను పంచుతుంది. నాన్న లా బాధ్యత తీసుకుంటుంది. అక్క లా జాగ్రత్తలు చెబుతుంది. స్నేహితురాలు లా మనస్సును అర్ధం చేసుకుంటుంది. ఇంకేమి కావాలి ఏ స్నేహం లో అయినా,నాలో ఊపిరి ఉన్నంత కాలం నీ ప్రేమ,స్నేహం వధులుకొను అక్క. నాకు ఎక్కువుగా మాట్లాడటం రాదు అక్క,నేను తెలిసి తెలియక ఏదైనా పొరపాటు చేస్తే అమ్మ లా మన్నించండి.
ఇదే ఒక  ప్రయాణం కలిపిన ప్రాణమైన బంధం.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!