స్త్రీ తత్వం

స్త్రీ తత్వం

పరస్పర విరుద్ధ తత్వాలు కలిగినవి పంచభూతాలు!!

ఆ పంచభూతల సమతుల్యతే స్త్రీ తత్వం
ఆమె అణుఅణువు ప్రకృతిలో భాగమే.!!

ఆమె నయన తేజమే అగ్ని నేత్రమై.
ఆమె మనోనిశ్చియం గంగపొంగులై.!!

ఆమె శ్వాశ చలనమే వాయువై!
ఆమె సహనతత్వమే అవనిజవై!
ఆమె ఆకాశమంత ప్రేమ అమృతకలశమై!!

ఆమె ప్రేమ, జాలి,దయ, సహనం,రౌద్రం లోను,
అమ్మ గా,అక్క గా, ఆలి గా మారి!!

ప్రకుతిలో భాగమై మానవాళిని నడిపించే స్త్రీమూర్తి.!!

తన ఆశల ముంగిట ఊహల ముగ్గులు వేస్తూ..
తన ఉనికే మరిచి, దిక్కులు తెలియక.!!

అంతా తెలిసిన ,ఏమి తెలియని అంతు చిక్కని శూన్యం లా మిగిలిన ఓ స్త్రీ మూర్తి.!!

నీ చిరునామా ధైర్యంగా…మోముపై చిరునవ్వు గా మలుచుకొని !
సాగిపో.. ముందుకు సాగి పో.!!

రచయిత::జయ కుమారి

You May Also Like

3 thoughts on “స్త్రీ తత్వం

Leave a Reply to జయ Cancel reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!