సువర్ణ 

సువర్ణ 

 రచన: నారుమంచి వాణి ప్రభాకరి

  సువర్ణ నాలుగేళ్ల చిన్న పిల్ల తెల్లగా అందంగా బూ రీ బుగ్గలతో ముద్దు కలిగిస్తూ అందర్నీ ముద్దు ముద్దు మాటలతో అందరిని ఆకర్షిస్తూ ఉంటుంది. దానికి తోడు మంచి గౌనులు వేసుకుని బార్బీ బొమ్మల వలే ఉంటుంది  

అయితే సువర్ణకు బొమ్మలంటే ఇష్టము రక రకాల బొమ్మలు కొని తెస్తారు .. అంతే కాదు ఊళ్ళో తీర్థాల్లో అప్పుడు కూడా బొమ్మలు కొనే వారు

తాత అమ్మమ్మ తీర్థ యాత్రలకు వెళ్లి వచ్చినప్పుడు కూడా చాలా బొమ్మలు తెస్తారు పెద్ద తిరుపతి, చిన్న తిరుపతి, శ్రీకాళహస్తి, శ్రీశైలం,అన్నవరం, విజయవాడ లాంటి చోట బొమ్మలు సెట్టులు గా అమ్ముతారు పెళ్లి సంబరాలు ,పల్లే బొమ్మలు ఇలా ఎన్నో రకాలు బొమ్మలు తెచ్చి దాచి ఉంచుతారు. 

ఎప్పటికప్పుడు అందంగా అమర్చేలా చక్కని. అల్మారాలో పెడతారు బొమ్మల కొలువు సంక్రాంతికి మరియు దసరాకి పెట్టి పేరంటం చేస్తారు .

అందుకే సువర్ణ చాలా గారంగా పెరుగుతోంది తండ్రి పక్క ఊళ్ళో బ్యాంకులో పనిచేస్తాడు . బామ్మ తాత బాబాయ్ పిన్ని అందరూ ప్రేమగా చూస్తారు.
ముఖ్యంగా బొమ్మలు అంటే ఇష్టపడే సువర్ణకి ఆ బొమ్మల ద్వారా కథలు చెప్పేవారు 
దాని ద్వారా చరిత్ర అంశాలు
రాజుల కాలం నాటి కధలు
చెప్పేవారు. దానివల్ల. తేలికగా
అవగాహన అయ్యేది అంతే కాదు బొమ్మలు ఉన్న పుస్తకాలు
కొని తెచ్చేవారు. ఆ బొమ్మల కింద కథ చూపించి వివరించే వారు అలా బొమ్మలను కథలను చూడటం వల్ల సృజన పెరిగింది. 

దానికి తోడు డ్రాయింగ్ బొమ్మల పుస్తకాలు తెచ్చి రంగు పెన్సిల్స్ తెచ్చి నేర్పే రంగులు వేయించే వారు ఆ తర్వాత రంగులు కొనిచ్చి అందంగా రంగుల వెయ్యడం సువర్ణ తల్లి నేర్పేది. 

సువర్ణ తల్లికి కళలు ఇష్టం అమే బాగా బొమ్మలు వేసేది. సువర్ణ తల్లికి సువర్ణను మంచి చిత్రకారిణిని చెయ్యాలని కోరిక
అలా అనుకుంటే కాదు తగిన కృషి చెయ్యాలి కుటుంబంలో అటువంటి పరిస్థితులు కల్పించాలి.
సువర్ణ తల్లి సైన్స్ లో బోటనీ బి.ఎస్సి చదివింది అమే చిన్న తనంలో కుటుంబంలో కళ ప్రోత్సహించేలా ఉండేవారు కాదు, ఆ ఆడపిల్లకి చదువు ఎందుకు ఈ బొమ్మలు చదువుకుంటే 
చాలు అనేవారు కానీ పట్టుదలగా సైన్స్ సబ్జెక్ట్ ద్వారా తన కళ ను పెంచుకుని కలలను సాకారం చేసుకుంది తన కూతురు సువర్ణ కి తన అండ ద్వారా కళాకారిణి గా పెంచాలనే కోరికతో చక్కని కోచింగ్ ఇస్తోంది.

కళల యందు జిజ్ఞాస చిన్నప్పటి నుంచే వస్తాయి పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లు ఉంది సువర్ణ బొమ్మలు అలంకరించడం కూడా ఇష్టం తాటాకు బొమ్మలకు బట్టలు కట్టుకుని నగలు పెట్టి అడేది 
ఆ తర్వాత రబ్బరు బొమ్మలు కొనిచ్చి బట్టలు కట్టడం నేర్పింది
అలా చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉన్న అంశము పై పెద్దలు బాగా ఉన్నతంగా తీర్చి దిద్దడానికి ప్రయత్నించాలి. పిల్లలను విసుక్కో కూడదు. 
కళలు అందరికీ అంత తొందరగా రావు. పిల్లలను ఎంకరేజ్ చెయ్యాలి
అప్పుడే గొప్పవారిగా ఎదగడానికి ప్రపంచ ఖ్యాతి పొందడానికి అవకాశం ఉంటుంది ఎంత తెలివి ఉన్న ఇంటి నుండి ప్రోత్సాహం మరియు అవకాశం రావాలి, తల్లిదండ్రులు విసుక్కుంటూ ఉంటే పిల్లలు మానసికంగా ఎదగలేరు ఒక మంచి మాట ఆత్మీయత వారికి
కావలసిన వస్తువులు కొని ఇచ్చి దగ్గర ఉండి నేర్పిస్తే లేక టీచర్ ద్వారా నేర్పిస్తే ఎదుగుతారు. నచ్చిన విద్యలో ప్రావీణ్యం వస్తే ఆ ఆనందంతో మిగిలిన చదువు బాగా చదువుతారు. 
సువర్ణ ఆ విధంగా తల్లి ప్రోత్సాహంతో ఎదిగింది. 

కోనసీమ ఆర్ట్ పోటీకు వెల్ టూర్ చిత్ర కళ పోటీలకు ఆమే పెయింటింగ్స్ పంపింది బహుమతులు వచ్చాయి .

అతరువాత జాతీయ గ్రంధాల పోటీల్లో పాల్గొని బహుమతి పొందడమే గాక. ఏక చిత్ర కారిణి
ప్రదర్శన ఏర్పాటు చేసి ఎంతో మెచ్చుకున్నారు.

ఇలా సువర్ణ చక్కని చిత్రకారిణి అయ్యింది. 
ఎదిగే కొద్దీ మరిన్ని పోటీల్లో బంగారు పతకాలు కూడా సాధిస్తోంది. మరి పిల్లల్ని ప్రోత్సహించడం పెద్దల బాధ్యత అని మరువద్దు.
నేటి బాలలే రేపటి కళాకారులు

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!