తాళపత్ర నిధి (పుస్తక సమీక్ష)

తాళపత్ర నిధి (పుస్తక సమీక్ష)
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

సమీక్షకురాలు: కొత్త ప్రియాంక (భానుప్రియ)

రూపకర్త: మైథిలీ వెంకటేశ్వర రావు గారు

నా సమీక్ష  “తాళపత్ర నిధి”మహ పుస్తకం పైన పేరులో నిధి  మాదిరిగానే సందేహాలను నివృత్తి చేసి, సమాచార సమాహర అద్భుత భాండాగారమే ఈ తాళపత్రనిధి గ్రంథం. ఈ గ్రంథం రూపకర్త “మైథిలీ వెంకటేశ్వరరావు గారు” నేటి ఆధునికతరం లో సంస్కృతి, సాంప్రదాయాన్ని పాటించాలని, చెప్పిన పద్ధతి ప్రకారం చేయాలని చెప్పిన నేటితరం ఎందుకు? అలా చేస్తే ఏం లాభం? అని ప్రశ్నలను సంధిస్తున్నారు. అలాంటివారికే కాకుండా ఎంతోమందికి తెలియని సాధారణ విషయాలు సాంప్రదాయపద్ధతి తో పాటు, శాస్త్రీయ నిరూపణ తో అర్థమయ్యేటట్టు విడమరిచి చెప్పడం ఈ గ్రంథ ప్రత్యేకత, దాదాపుగా 650 అంశాలను క్లుప్తంగా విడమరిచి చెప్పడం జరిగింది. ప్రతి అంశానికి సాంప్రదాయబద్దంగాను, నేటి తరానికి అర్థమయ్యేటట్టు గా సాంకేతిక పరంగానూ సవివరంగా పొందుపరిచారు రచయిత ఒక అంశాన్ని రెండు కోణాల్లో పరిశోధించి దాని ఫలితాన్ని కూడా  పొందుపరచడం చదివేవారికి ఆసక్తితో పాటు రోజువారి ఎన్నో విషయాల గూర్చి తెలుసుకోవటం చాలా ఉత్సాహంగా వుంటుంది.
ఈ గ్రంథం పఠనం చేస్తుంటే ఇంకా కొత్త విషయాలు తెలుసుకోవాలనే జిజ్ఞాస పెరుగుతుంది ప్రతి ఒక్కరిలో ఉదాహరణకు ఈ గ్రంథంలోని ఒక అంశాన్ని తీసుకుంటే అమావాస్య పౌర్ణమి రోజుల్లో రోగం తిరగబెడుతుందా? “రోగాలే కాదు పిచ్చి కూడా ముదురుతుంది అంటారు. చంద్రుడు జల కారకుడు. పౌర్ణమి నాడు సూర్య చంద్రుడు భూమికి రెండు వైపులా ఒకే స్థాయి ఆకర్షణ కలిగి ఉంటారు. అలాగే శక్తి బలహీనం చంద్రుని లో ఆ రెండు రోజులు ఉంటాయి మన శరీరంలో కూడా నీరు ఉంటుంది. చంద్రుడు కారకుడు కావున విపరీతంగా ఆకర్షిస్తాడు అందువల్ల వ్యాధిగ్రస్తులు ఒకింత ఎక్కువ వేదనకు గురి అవుతారు”. ఈ సందేహానికి శాస్త్రీయంగా చాలా చక్కగా వివరించారు.ఎన్నో అపోహలు, సందేహాలను చాలా సులభంగా నివృత్తి గావించారు.
ఎన్నో గ్రంథాలను, గురువులను అనుభవజ్ఞులైన పెద్దల నుంచి సేకరించి రచయిత గారు ఒక చక్కని గ్రంథాన్ని సమాజానికి అందించారు. ప్రతి ఒక్కరూ చదవవలసిన తెలుసుకోవలసిన మహాగ్రంథం ఈ “తాళపత్రనిధి గ్రంథం”.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!