తాళి (కవితా సమీక్ష)

తాళి (కవితా సమీక్ష)

సమీక్ష: యామిని కోళ్లూరు

కవితా శీర్షిక: తాళి
రచన: శ్రీమతి నెల్లుట్ల సునీత గారు

జీవితం అంటే రంగు రంగుల ఇంద్రధనస్సు లా నిత్యం ఆనందాలు సంతోషాలు కాదు కష్టాలు కన్నీళ్ళు బాధలు సమ్మేళనం అంటే ఓ ఉగాది పచ్చడిలా. ఉండాలి అంటారు కవయిత్రి.
ఉన్నట్లుండి ఏదో తెలియని అలజడి ఆశలు ముక్కలై కలలు చెల్లాచెదురై మాటలు జలజల రాలిపోవటం సముద్రం లో ఉవ్వెత్తుగా ఎగసి పడే కడలి కెరటంలా అభద్రతా అనే రక్షణలో సంసారం సాగరం సమస్యల సుడిగుండంలా మునిగి పోతున్న పడవలా కూరుకుపోతున్నా పెళ్ళి అనే బంధం తో భర్త కాలయముడుగా బలిగొనటం ఏంటి ఈ బానిసత్వం.అంటూ ఆధునిక సమాజంలో ఇలాంటి సమస్యలపై తన కలాన్ని ఎక్కుపెట్టారు.

ఎగిరే పక్షులకి సీతాకోక చిలుకలకి స్వేచ్ఛ వుంది.కాని స్ర్తీ జన్మకి లేదా ఆ స్వేచ్ఛ పరాశక్తి శక్తి స్వరూపిణి అంటూ స్ర్తీ కి స్ర్తీ శత్రువుల ఆడపడుచుల ప్రతీకారం భర్త అవమానాలు అనుమానాలకు ఆహుతి కావాల్సిందేనా.

అన్ని రంగాలలో రాణిస్తున్న మహిళలకు సమానత్వం లేదు అని ఇంకా వివక్ష కొనసాగుతూనే ఉందని వాపోయారు.

హక్కుల పేరుతో స్వతంత్ర్యం లేకపోగా పశువుల గొట్టం లో కాస్తంత విశ్రాంతి తీసుకొనే  మూగజీవులు నయం ఆ గొడ్డుకి మల్లే ఎంత చాకిరి చేసినా మహిళకి లేదు ఓ గుర్తింపు.

నిరంతాయంగా  విశ్రాంతి లేకుండా ఇంటి బాధ్యతలను వృత్తిని ప్రవృత్తిని గౌరవిస్తూ అలుపెరుగని శ్రమలో సమస్యలను దాటుకుంటూ సమర్థవంతంగా ఆత్మవిశ్వాసంతో నిర్వహిస్తున్న మహిళలకు గుర్తింపు లేదని సమాజానికి చెప్పే ప్రయత్నం చేశారు.

ఇష్టాఇష్టాలతో ఏ మాత్రం పట్టించుకోకుండా అధికారంతో శాసించటం ఇంటి చుట్టూ కంచెలా మూడుముళ్ళు అక్షింతలతో ఇల్లాలిని లొంగివుండమనటం .

మహిళకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వగలగాలి ఆమె ఇష్టాఇష్టాలను గౌరవించాలని హితవు పలికారు. మాటలతో స్వేచ్ఛను హరించ వద్దని  ఇచ్చారు తన కవితలో. పశువులకి బాగలేకపోతే వైద్య శాలకి తీససుకుపోవటం కాని మానవజన్మ పవిత్రమైనది అంటు రోగం వచ్చిన పట్టించుకోకపోవటం బానిసలా చూడటం పవిత్రబంధానికి సాక్షి తాళి ని ఉరితాడులా కట్టేయటం. పెళ్ళి పేరుతో ముఖానికి ముసుగు వేయటం ఆ ముసుగు ఒకప్పుడు పెద్ద వారు ఇంటికి వచ్చిన ఎదురుపడిన మర్యాద పూర్వకంగా కప్పుకొనే ముసుగు నేడు అర్థమే మారిపోయింది ఆమె మనసున్న నారీమణి ప్రతి ఇంట గృహలక్ష్మి.

పెళ్లి పేరుతో స్వేచ్ఛ ను హరించే హక్కు ఎవరికీ లేదని ఇల్లాలిగా మహిళ అందరూ గౌరవించాలంటే సందేశాత్మకంగా వివరించారు. ఎక్కువ తక్కువ తేడాలు చూపక లింగ వివక్ష పేరుతో సంస్కృతి కి పెట్టింది పేరు తాళి అనే ఆ పవిత్ర పదాన్ని ఎగతాళి చేయరాదు.

ఇవన్నీ ఇవ్వగలిగిన సమాజ సంస్కృతీ అనే బంధానికి గొప్ప విలువ ఉంటుందని సాంప్రదాయకంగా చెప్పారు.

******************

కవిత శీర్షిక: తాళి
రచన: శ్రీమతి నెల్లుట్ల సునీత గారు 

ఆశలు ముక్కలై కలలు చెల్లాచెదరై
మాటలు జారిపోతున్నాయి

కడలి కెరటంలా తిరిగి వెనక్కి పోవాల్సిందేనా…
అభద్రత రక్షణలో సంసారం

సమస్యల సుడిగుండాలలో నిండా మునిగి కూరుకు పోతున్న
కాపాడే భర్తే కాలయముడుగా ప్రాణాలను బలిగొన్న బానిసత్వం

స్వేచ్ఛ ఎరుగని నేను నలిగిపోవడమేనా
అత్తమామల అధికారం ఆడపడుచుల ప్రతీకారం
భర్త అనుమానాల అవమానాలకు ఆహుతి కావాల్సిందేనా

ఆర్థిక  స్వతంత్రత లేని నాకు  మహిళా హక్కులు  మాత్రం ఎక్కడ
పొద్దస్తమానం గొడ్డు చాకిరి చేసినా ఏ గుర్తింపు లేని  మహిళను

ఆంక్షలతో ముళ్లకంచెలు వేసి బంధించిన వివాహబంధాన్ని
నా ఇష్టా ఇష్టాలతో పనిలేదు ఎవరికీ
శాసించే అధికారమే అందరికీ
మూడు ముళ్ల బంధానికి లొంగిన ఇల్లాలిని కదా..

రోగం వచ్చినా నలత చెందిన ఎవరూ పట్టించుకోని పవిత్ర బంధాన్ని
తాళి అనే తాడుతో ఆశలను వురి తీస్తూ
కట్టు బానిసగా కట్టేసినా ..
భవ బంధాలను తెంచు కోలేని నీరస నారి మణిని
సంప్రదాయ పెళ్లి అనే ముసుగులో బందీనైన గృహలక్ష్మినీ

లింగ వివక్ష సమాజ
సంస్కృతులలో తాళి అవ్వద్దు ఎగతాళి

******************

You May Also Like

One thought on “తాళి (కవితా సమీక్ష)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!