రాధేశ్యామ్

రాధేశ్యామ్

రచన: పి. వి. యన్. కృష్ణవేణి

అన్ని మానవ సంబంధాలు, ఆర్ధిక సంబంధాలే అన్నారు. అరిస్టాటిల్.

అనురాగం , ఆప్యాయత అంతా ఒక భూటకమ్,,, అన్నారు ఒక  కవి.

ఇవి రెండూ నేను తప్పు అనను. కానీ, మనం ఇంకా మన జీవితాలలో  అనుబందం కలిగే ఉన్నాము. ఆ అనుబంధాలు లేకపోతే, ప్రపంచం ఇలా కూడ ఉండదు.

ఒక భార్యభర్త, ప్రేమికులు, అన్నాచెల్లి, స్నేహితులు వీళ్ల మధ్య ప్రేమ, అనుబందం, అనురాగం అనేవి లేవంటారా?

అమ్మా, అమ్మా లంచ్ బాక్స్ రెడీ అయిందా? అంటూ హడావిడి గా వచ్చింది తస్విక.

హ, అయిపోయిందమ్మ. అంటూ తనకి బాక్స్ అందించాను.

అలాగే, చింటూ ని కూడా స్కూల్ లో డ్రాప్ చేసిరావాలి.అనుకుంటూ రెడీ అవుతున్నాను. శ్యాం ఇవాళ తొందరగా వెళ్ళి పోయారు ఆఫీస్ కి.

శ్యామ్ అంటే మా వారు. మాకు ఇద్దరు పిల్లలు. తస్వీక, ఇంటర్ చదువుతోంది. చింటూ, అదే తనీష్ ఎయిత్ క్లాస్ చదువుతున్నాడు.

తనీష్  రెడీ అయ్యాడు. వాడి స్కూల్ చాలా దూరం. అందుకే మార్నింగ్ మేమే డ్రాప్ చేస్తాం. నా స్కూటీ లో తీసుకువెళ్ళాను.

వచ్చేటప్పుడు రోజు లాగ ఆటోలో వచ్చేయి అని చెప్పాను.

తిరిగి బయలుదేరాను. సూపర్ మార్కెట్ లో సరుకులు తీసుకుని, మళ్లీ బయలుదేరాను. అలా వస్తూ ఉండగా, ఎదురుకుండా, ఒక లారీ, నా స్కూటీ బ్రేకు పడలేదు. బరువుకు ఆపలేక కింద  పడిపొయాను.

మెలుకువ వచ్చే సరికి హాస్పిటల్ బెడ్ పైన ఉన్నాను. కళ్ళు తెరిచేసరికి ఎదురుకుండా మా వారు. ఇప్పుడు ఎలా ఉంది అని అడిగారు. నేను కళ్ళ తోనే పరవాలేదు అని చెప్పాను.

పక్కనే, తస్విక  నా కోసం జ్యూస్ తీస్తోంది. తనీష్ నా పక్కనే కూర్చుని, నా దెబ్బలకి ఆయింట్మెంట్ రాస్తున్నాడు.నాకు మొదటిసారి నా పిల్లలు పెద్ద వాళ్ళు ఆయ్యారు అనిపించింది. ఇంట్లో ఆయితే అన్నం కూడా నేనే టినిపించాలి మరి.

ఇంకా పెద్ద విషయం ఏమిటంటే, మా అపార్టుమెంటులో ఎవరితో మాట్లాడకుండా,  ఎదురు పడితే ముఖం చిట్లించుకునే, మా ఎదురు ప్లాట్ లో ఉండే గోపాల్ నన్ను హాస్పిటల్ లో  చేర్చారు.

పొద్దున, నేను రోడ్ పైన పడిపోగానే, నన్ను గోపాల్ అంబులెన్సు ఎక్కించటం నాకు లీలగా గుర్తుంది.

అంతే కాకుండా, ఇప్పుడు కూడా నా బెడ్ దగ్గరే నుంచుని ఉన్నాడు.  శ్యామ్ తో మాట్లాడుతూన్నాడు.

సాయంత్రం నన్ను ఇంటికి పంపించేశారు.

నాకు పూర్తిగా తగ్గేసరికి వారం పట్టింది. ఈ వారం రోజులు నన్ను కాలు కింద పెట్టనివ్వలేదు మా వాళ్ళు ముగ్గురు. పిల్లలు వాళ్లే రెడీ అయ్యెవాల్లు. శ్యాం వంట చేసి, నాకు డైనింగ్  టేబులు మీద పెట్టి, తను ఆఫీస్ కి వెళ్ళేవాడు.

గోపాల్ రోజూ వచ్చి పలకరించి వేళ్ళేవాడు. అంతే కాదు, వాళ్ల ఇంట్లో వండిన వంటలు, కూరలు, వాళ్ళ ఆవిడ తెచ్చి పెట్టేది.

మా పక్క ప్లాట్ లో ఉండే, రేణుక ఆంటీ, పిల్లలు రాగానే వాళ్ళ కు పాలు, నాకు టీ ఇచ్చేది. రాధ,  రాధ ఎమైనా కావాలా, అంటూ,  ఎక్కువ నాతోనే గడిపేది.

వీళ్ళకు నేను ఇచ్చేది ఏముంది, అది వాళ్ళ మంచితనం. ఇంకా ఆ రోజు నుంచి, మా కుటుంబాలు అన్నీ,  ఒకే కుటుంబం లాగా మారిపొయినాయి.

అనుబందం అంటే, భార్యాభర్తలు, ఒక కుటుంబం మధ్యే కాదు, స్నేహితుల మధ్య కూడా ఉండవచ్చని తెలిసినది. అదే ఈ రాధేశ్యాం భంధం. అదే స్నేహ బంధం. ఎంత గొప్పదో కదా, ఈ అనుబందం.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!