సమేతల చాతుర్యం

అంశం: సస్పెన్స్/హాస్యం

సమేతల చాతుర్యం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: ఎల్. నిర్మలరామ్

ఒక హాస్యప్రదమైన శీర్షిక రాద్దామని ఉత్సహంతో గంట నుండి ఆలోచిస్తున్నాను అన్న చోరువే గానీ అక్షరపు చొరవ లేదాయే” ఇదేమిటి? “ఆదిలోనే హంసపాదు” అనుకున్నాను. ఆలస్యం అమృతం విషం అనుకున్నాను వెంటనే కలం తీశాను.
కానీ నిదానమే ప్రధానము అని నిర్ణయించుకుని ఆలోచించా, కానీ ఎం రాయలోతెలియట్లేదు. ముందు రచనకు కథ కు పేరు పెడదామనుకున్నా
ఆలు లేదు చూలు లేదు అల్లుడి పేరు సోమలింగం అన్నట్లు ఇప్పుడు పేరేమిటి అని ఊరుకున్నా! వెధవలకు పదవులు ఇస్తేగాడిదకు కొమ్ములు వచ్చాయట అన్నట్లు శీర్షిక కుదిరితే కథ రాయడానికి కలం తీస్తే శీర్షిక కాదు కదా, కనీసం ఉపోద్ఘాతం కూడా రావట్లేదు అయితే ఎలా? అని ఆలోచించా. జాగడం ఎందుకే జంగమయా అంటే బిచ్చం వేయవ్వే ఓ బొచ్చు మూండ అన్నాదంటా  వెనకటికి ఎవరో, అన్నట్లు ఎదుటి వారిని చూసి నాకు రాయాలి అనిపించింది.”ఉట్టికెక్క లెనమ్మ స్వర్గానికి ఎక్కున! అని నా కలం బెల్లం కొట్టిన రాయిలా కూర్చుంది. మనసు నిండా కొత్త ఆలోచనలు ఒక ఆలోచన మరొక ఆలోచనను మయం చేస్తుంది. దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వనట్లు రాయాలి అని కోరిక ఉన్న అంత చాతుర్యం ఉండకూడదు! అనుకోని.. మరల ఆలోచనలు ఎటి వరదలా వస్తూనే ఉన్నాయి.
“కృషితో నాస్తి దుర్భిక్షం”  అన్నట్లు ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాను. “చింత ఉడికిన ఇంకా పులుపు పొనట్లు” ఎది లేకున్నా ఓపిక మాత్రం అలాగే ఉంది. ఆలోచనలు వస్తూనే ఉన్నాయి.
ఇంతలోనే నా మనసు ఎందుకు నాకు గ్రూప్ సభ్యులు రాస్తున్నారు అని నేను రాయాలి అనుకోవడం ఎంత వరకు సమంజసం. శీర్షిక అంటే మాటలా! “పిల్లకాకికేం తెలుసు ఉండేలు దెబ్బ”అన్నట్లు రాయడం మానేయమని నా మనసు హెచ్చరించింది. ఇల్లులకగానే పండుగ కాదు కదా” కలం పట్టుకోగానే రాయలేనని ఊరుకున్నా, కానీ. మొగుడు కొట్టినందుకు కాదు ఆడపడుచు చూసినందుకు అన్నట్లు నేను రాయకపోయి నందుకు బాధ లేదు కానీ మనోహరం గ్రూప్ సభ్యులు అందరూ రాస్తున్నారు అన్న బాధ పక్కలో బల్లెంలా తయారైంది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!