అబద్ధాల్లో ఎన్ని అందాలో

అంశం: అందమైన అబద్దం

అబద్ధాల్లో ఎన్ని అందాలో
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: బాలపద్మం

చందమామను చూపి
గురుముద్దలు పెట్టే అమ్మది
గాడిద చాకిరీ చేయిస్తూ
ఉద్యోగికి అధికారి చెప్పేది
సమసమాజం స్థాపిస్తాం
ప్రతిభకు పట్టం కడతాం
అనే రాజకీయ నాయకులది
అన్నీ నమ్మే జేజేలు కొడుతున్నాం
మిము అందల మెక్కిస్తున్నాం
అంటూ చెప్పే ఓటరుది
కొండమీది కోతిని తెస్తా నీకోసం
ఏదైనా చేస్తాననే ప్రేమికులది
అందరిదీ అవసరానికి
చెప్పే అందమైన అబద్దం
కొన్ని అబద్ధాలు మాత్రం
ప్రేమ పెంచి ఆనందం ఇస్తాయి

You May Also Like

6 thoughts on “అబద్ధాల్లో ఎన్ని అందాలో

Leave a Reply to V.S.Bala prabha Cancel reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!