అమ్మ -నా గుండె చెమ్మ
రచయిత :: డా. అడిగొప్పుల సదయ్య
అమ్మంటే ప్రణవనాదం
అమ్మంటే సుస్వరవేదం
అమ్మంటే ఆదిగురువు
అమ్మంటే పచ్చని తరువు
అమ్మంటే అక్షయ పాత్ర
అమ్మంటే ఆరోగ్య మాత్ర
అమ్మంటే కమ్మని భావన
అమ్మంటే చల్లని దీవెన
అమ్మంటే కరమున దీపిక
అమ్మంటే వసుమతి ఓపిక
అమ్మంటే శ్రీహరి సన్నిధి
అమ్ముంటే తరగని పెన్నిధి
అమ్మంటే మనలో కణము
అమ్మంటే తీర్చని ఋణము
అమ్మంటే అమ్మే!
మన గుండె చెమ్మే!!
చాలా బాగుందండీ అమ్మపై కమ్మని ప్రాసతో కూడిన
కవిత👌👌👌💐💐💐