అంతరంగ తరంగాలు

(అంశం:”అంతరంగం ప్రశ్నిస్తే’)

అంతరంగ తరంగాలు

రచన: విస్సాప్రగడ పద్మావతి

నా అంతరంగాన
తరంగాలెన్నో
ఒడి దుడుకుల మధ్య
సాగే జీవన పోరాటం
విలయ తాండవంలో మమేకం
ఎన్ని చింతనలు దాగియున్నా
ఏదో సాధించాలన్న తపన వదలదు.
బాధ్యతల నడుమ ఊగిసలాడే
బతుకు బండి జట్కా బండైనా
ఏం సాధించావని
అంతరంగాన్ని ప్రశ్నిస్తే
సాధించిన ప్రతిభ
తెలియని ఆత్మసంతృప్తినీ,
వివేకాన్నిస్తుంది
మనిషి మనుగడ ప్రశ్నార్థకమైనా
ప్రశ్న తోనే జీవనం ప్రారంభమవుతుంది
నిరంతరం ఆత్మవిమర్శ చేసుకుంటే
బతుకు అందలం ఎక్కిస్తుంది
సప్తస్వరాలను మీటి
బతుకు బాట బంగారు బాట చేస్తుంది

You May Also Like

One thought on “అంతరంగ తరంగాలు

Leave a Reply to వేంకటేష్ Cancel reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!