బానిస జాతి

(అంశం:”బానిససంకెళ్లు”)

బానిస జాతి

రచన: నిమ్మగడ్డ కార్తిక్

బానిస చరిత్ర సంకెళ్లు పోలేదు
బానిస కుటుంబ సంకెళ్లు పోలేదు
బానిస కుల కుంపట్ల ఆలోచనలు పోలేదు
బానిస మత మౌఢ్యం సంకెళ్లు పోలేదు
బానిస ప్రాంత హద్దులు మూర్ఖత్వం పోలేదు
బానిస భాష బానిసత్వం పోలేదు
బానిస పాలన ఆలోచనలు పోలేదు
బానిస రాజకీయ కుళ్ళు పోలేదు
బానిస ఆలోచనల అంతరాలు పోలేదు
బానిస స్వార్థ ప్రయోజనాల సంకెళ్లు పోలేదు
బానిస వెన్నుపోటు గాయాల సంకెళ్లు పోలేదు
బానిస మూర్ఖుల మాటల గారడీ సంకెళ్లు పోలేదు
బానిస మాయగాళ్ళ మోసాల సంకెళ్లు పోలేదు
కంటికి కనిపించని బానిస జాతికి బానిస వారసులం
బానిస సిద్ధాంతాల, బానిస ఆలోచనల సంకెళ్లుకు బంధీలుగా మిగిలిన వారసులం.

You May Also Like

4 thoughts on “బానిస జాతి

  1. చిన్నప్పటి నుంచి నూరి పోసిన బానిస బుద్ధులు ఎలా పోతాయి… చదువుకున్న వాళ్ళు కూడా కులం,మతం అంటూ కొట్టుకుంటూ రాజకీయ కుట్రలకు వంత పాడుతుంటే బానిస సంకెళ్లు తెగిపోయేది ఏనాడో…

  2. చాలా చాలా బాగుంది సర్,ఎంత అభివృద్ది చెందుతున్న ఆ బానిససంకెళ్లు ఆనవాళ్లు మటికి అలానే ఉన్నాయి సర్👌👌👏🏻👏🏻👏🏻👏🏻💐

Leave a Reply to Haseena illuri Cancel reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!