చెంచులక్ష్మి (చిత్రసమీక్ష)

చెంచులక్ష్మి
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

సమీక్షకులు: యాంబాకం

చిత్రం: చెంచులక్ష్మి

వైకుంఠము లోని శ్రీమహావిష్ణువు కి శ్రీమహాలక్ష్మి, కు సముద్రరాజు దంపతులు కలసి సకలదేవతల సమక్షంలో ఘనంగా వివాహం జరిపిస్తూ ఉండగా! “దుర్వస మహాముని వివాహ స్థలం వద్దకు వస్తూఉండటం  నారదుడు” ముందుగా గమనించిన వాడై విష్ణుమాయ ప్రభావంతో దుర్వస మహాముని ముందుగా పలకరించిన వాడు గా ఓహో దుర్వాసమునీంద్రు లకు ప్రణామాలు తమరు పెళ్లి కి ఆలస్యం గావచ్చారు, పెళ్ళి ఆహ్వానం ఆలస్యం గా అందినదా! మునీంద్ర అని అట్టహాసంగా చమత్కరించగా అనగానే. దుర్వసముని ఆ.. అంటూ ఆగ్రహంతో మహావిష్ణువు  అల్లుడు అయినాడన్న గర్వంతో మరచి పోయాడు. ఈ సముద్రరాజు అనగా ఇంతలో దేవేంద్రుడు సర్ది చెప్పబోతుండగా దుర్వసముని ఆగ్రహం లో  ఇంద్రా నీవు ఊరుకో అంటూ వారిస్తాడు. దుర్వసముని ఇంతలో మరల నారదముని కలుగ చేసుకొని సముద్ర రాజు తెలిసిన చేసిన ఆపరాదం కాదు మునివర్యా అని కాస్త రగిలిస్తాడు. ఇంతలో మహా కోపిష్టి గా మారిన “దుర్వాస ముని అపచారమా మహాఅపచారం ఈ సముద్రడు మా పట్ల కిరాతక బుద్ది తో ప్రవత్నించాడు. అందుకుభూలోకం లో కిరాతకులుగా మీ దంపతులు జన్మించండి. అని శపించగా పెళ్ళి పీఠలపై కూర్చుని ఉన్న మహాలక్ష్మి లేచి వచ్చి తన తల్లిదండ్రులు తెలిసి చేసిన తప్పు కాదు అని  సకల విధాలుగా వేడుకొనగా దుర్వస మహాముని కాస్త శాతించి, నా శాపం వృధాకాదు సముద్రరాజు  భూలోకం మహాలక్ష్మి యే కూతురు, మహావిష్ణువు యే అల్లుడు కాగలరు. ఈ విషయం తెలియగానే మీకు శాపవిమోచనం కాగలదు. అని దీవించి. మరలిపోతాడు దుర్వసమహాముని.
సముద్రరాజు దంపతులు కిరితాకులు గా జన్మిస్తారు. భూలోకం లో అప్పటికే హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు, జన్మంచి దుర్మార్గులు గా భూలోకం హింసాకాండ మొదలు పెట్టి చండాలుడు గా దారునాలు చేస్తుంటారు. హిరణ్యయాక్షుడు భూమాతనే అపహరించి సముద్రం లో పడవేయాలని ప్రయత్నించ పోతుండగా భూమాత ఆర్తనాదం వైకుంఠం లోని లక్ష్మినారాయణ లకు వినపడగా లక్ష్మిదేవి స్వామి తో ఏమిటి స్వామీ ఆ ఆర్తనాదాలు అని అడుగుతుంది. “హిరణ్యాక్షుడి దుష్ట ప్రవర్తన భూమాత వరకు వచ్చింది వెంటనే కలుగ చేసుకోవలసి తరుణం వచ్చింది దేవి అంటూనే భూలోకం లో వరాహ అవతారం ఎత్తి భూమాత ను కాపాడి హిరణ్యాక్షుని సంహరించి మోక్షం ప్రసాదిస్తాడు. తన తమ్ముడు మరణించాడన్న బాధ అది విష్ణు చేత చంపబడినాడని. తెలుసుకొన్న హిరణ్యకశిపుడు మిక్కిలి దుఖితుడై ఆగ్రహంతో  వైకుంఠం పై దండెత్తి తానే స్వయంగా సైన్యంతో పోబోతుండగా దైత్యరాజు గురు శుక్రాచార్యుడు, హిరణ్యకశిపుడని వారించి మహావిష్ణువు తో యుద్ధం అంటే సామాన్యమైన పని కాదు. అని హితబోధ చేయగా హిరణ్యకశిపుడు. అయితే మన ప్రతీకారం ఎలా చెల్లించాలని అని ప్రశ్నించగా తపస్సు చేయమని బ్రహ్మదేవుడు ని ఉద్దేశించి తపస్సు చేసి అడగవలసి వరం కూడ చెవిలో చెప్పి తపస్సు కు పంపుతాడు. రాజగురువు శుకారచార్యుడు. హిరణ్యకశిపుడు తపస్సు లో ఉంటాడు. ఇది గమనించిన దేవేంద్రుడు హిరణ్యకశిపుడు భార్య అయిన లీలావతి ని చేప్పటి దేవలోకం నికి కొనిపోతుండగా మార్గమధ్యంలో నారదుడు దేవేంద్రుడి కి హితవు బోధించి లీలావతి తన ఆశ్రమంలో ఉంచుతాడు. అప్పుడు “శ్రీమహావిష్ణువు భక్తి బోధనలు లీలావతికి నారదుడు నేర్పుచుండగా మధ్యలో లీలావతి నిద్రపోతుంది.” కానీ లీలావతి కడుపులో ఉన్న శిశువు ఊకొడుతూ ఇంటూ ఉంటాడు అది గమనించిన నారదుడు శిశువు కు తారక మంత్రం అయిన “ఓంనమో నారాయణనాయ” అని నేర్పగా తల్లి గర్భంలో నే నారాయణ భక్తుతుడు గా విష్ణు అంశ గా మారి పోతాడు. హిరణ్యకశిపుడి తపస్సు గోర తపస్సు గా మారి ఆత్మ భగ భగ మండే జ్వలగా మారి అది భక్తి జ్వలగా మారి బ్రహ్మలోకం లో దహించ గా అదిగమనించిన బ్రహ్మ పరుగు పరుగు న భూలోకం లో హిరణ్యకశిపుడు తపస్సు స్థలం చేరి హిరణ్యకశిపుడి అనుగ్రహించి తపస్సు మెచ్చి ఏమి వరం కావాలో కోరుకొమంటాడు. బ్రహ్మ దేవుడు. హిరణ్యకశిపుడు తన గురువు చెప్పినట్లు గానే “సరస్వతి వల్లభ అని సంభోధించి పగలు గాని, రాత్రి గాని ఇంటిలో గాని వెలుపల గాని భూమి మీద గాని గాలిలో గాని మృగంముల వలన గాని మృగేంద్రీయల వలన గాని అండజ, పిండజ, ములచే గాని సమస్త ఆయుధముల వలన గాని మానవుల చేతగాని దానవులచే గాని దేవతలచేత గాని పంచభూతముల. చేతగాని నాకు మరణం ఉండకూడదు. అని కోరగా బ్రహ్మ ఇలాంటి వరము మునుపు ఎవరు అడగలేదు నీవు కోరినట్లు వరము ప్రసాదించాను. వివేకవంతుడై వర్ధిల్లు అని మాయమైపోతాడు. వరములు పొందిన హిరణ్యకశిపుడు నేరుగా రాజధానికి రాగా వారికి నారదుడు అతని తో వెంట లీలావతి రాక గమనించిన హిరణ్యకశిపుడు రాజధాని లో ఉండవలసిన పట్టపు రాని బయట నుండి రావడం ఎమిటనగా నారదడు దేవేంద్రుడు లీలావతిని చెరపట్టిన తీరును, నారదుడు వివరింపగా మండిపడి దేవలో కానికి పోయి దేవతలను నవగ్రహ లను హిరణ్యకశిపుడు  జయించి దేవలోకాన్ని ఆక్రమించి సంతోష సమయంలో ఒక అసురుడు మరి హరిని అని అనగానే వైకుంఠము పై దండెత్తిపోవు లోపు వైకుంఠం లో ని శ్రీమహావిష్ణువు లక్ష్మి సమేతుడై వైకుంఠం వీడి భూలోకం లో తన వాహనం అయిన. గరుత్మంతుడు నివాసం చేరి అచ్చట ఏమి చేయాలో అలోచిస్తూ ఉండగా మహాలక్ష్మి స్వామి సకల దేవతలను కాపాడే మీరు ఇలా భూలోకం లో దాగుట అని అడుగుతుంది ప్రస్తుతం బ్రహ్మ ఇచ్చిన  వరమహిమ చేత హిరణ్యకశిపుడు ని ఏమిచేయలే మననీ నీవు నేనుకూడ దాచోహిం అనాలసిందే యోగం పట్టినప్పుడు ఎవరైనా లక్ష్మి అక్కడ ఉండ వలసినదే నీవు నేను ప్రస్తుతం హిరణ్యకశిపుడి కొలువు చేయవలసినది అని అంటాడు విష్ణు అటూ నావిష్ణు హీ పృధ్వీ పతిహి అయితే నా మంగళ కరమైన నా కళతో సేవించాల అని ప్రశ్నించగా దానికి అందుకే సురక్షిత ప్రదేశం అయిన ఈ గరుత్మంతుడు మన నమ్మిన బంటు అవక్షుడు అందుకే ఇక్కడ కి తీసుకొని వచ్చాను ఇక్కడ నీ కళని దాచి పెట్టి కళలేని నీవు హిరణ్యకశిపుడి కొలువు చేయవచ్చు అని లక్ష్మీ కళని ఒక మామిడి పండ్లు గామార్చి చెట్టు కొమ్మకు వేలాడ దీయగా ఇది ఏవరి కంఠ పడితే అని లక్ష్మిదేవి అడుగుగా ఇది దుర్మార్గులకు కాకరాదు అని అక్కడ నుంచి హిరణ్యకశిపుడు నివాసంలో చేరుతారు. ఇది అంతా నారదుడు చాటునుంచి చూసి.  నాకు కనిపిస్తుంది.నేను దుర్మార్గుడను కాదు గా! అని తరువాత నారదుడు నేర్పిన హిరణ్యకశిపుడు కుమారుడైన ప్రహ్లాదుడు పసిపాప నుంచి వచ్చిన ఓంనమో నారాయణాయ అనే ఉచ్చారణ తో హిరణ్యకశిపుడు బాధ పడుతూ ఉంటాడు ప్రహ్లాదుడు పెరిగే కొద్ది నారాయణ మంత్రం ఎక్కువ కాగా చదువుతోనై మారుతాడేమో ఆయని విద్యా బుద్దులు నెర్పమని రాజ గురువుల దగ్గర
పంపగా అక్కడా నారాయణ భక్తి బోధనలతో ఉన్న తోటి విద్యార్థుల కు కూడా నారాయణ భక్తిబోధనలు చేస్తూ ఉంటాడు. ఇక్కడ కిరాతకు లుగా పుట్టి సముద్ర రాజు దంపతులు చెంచుగూడానికి నాయకుడై అయిన పరిపాలిస్తూ ఉంటారు. ఒక రోజుచెంచుగూడెపు వారు నారదుడు కనపడగా మా నాయకుడికి సంతానం లేదు మీరే ఎదైన చేసి వారి సంతానం కలగే ఉపాయం చెప్పమనగా నారదుడు సరే అని గూడెంకు వచ్చి వారి కి లక్ష్మీ కళ ఉన్న పండును దక్కే లా చేస్తాడు.

దాని ఫలితంగా వారికి లక్ష్మీదేవి కళ తో ఒక ఆడపిల్ల పుట్టగా చాలా గారాబంగా చాకుతూ ఉంటారు. అలా ఒకరోజు నారదుడు వచ్చి చూసి ఈమెకు ఎమని పేరు పెట్టారు అని అడుగుతారు చెంచిత అని పేరు పెట్టుకొన్నాము అని చెంచు నాయకుడు చెప్పగా చెంచిత కాదు ఆమె కు “చెంచులక్ష్మి” అనే పేరు సరిపోతుందని చెప్పగా నాయకుడు సంతోసించి చాల బాగుంది అని ఆరోజు నుంచి “చెంచులక్ష్మి”అని పేరుపెట్టుతారు. ఇది “చెంచులక్ష్మి కథ”

సమీక్ష:- ఇందులో  అక్కినేని నాగేశ్వరరావు గారు శ్రీ మహా విష్ణువు గా తరువాత ఉగ్రనరసింహుడు గా చెంచులక్ష్మి తో చెంచులా చాల అభ్యతనటన అందమైన తేజస్సు తో మాటల్లో చెప్పలెనంత గా కనిపిస్తారు.
నారదుడు గా రేలంగి తనదైన నటన తో మైమరపించి నవ్వస్తాడు. ఇక అంజలి దేవి ఆమె అపూర్వ నటన డాన్స్ లు   రెండు పాత్రల్లో ఒక పాత్రలో వైకుంఠ లక్ష్మిదేవి గా మరో పాత్ర చెంచు గూడెం పడుచు పిల్లగా అప్పట్లో యువకుల గుండెల్లో చేరిందా అన్నట్లు ఉంటుంది నటన క్లైమాక్స్ లో రెండు పాత్రల్లో ఒక అమాయక పాత్ర ఇంకోటి దైర్యం గల తన భర్త ను దక్కంచుకోనే గట్టువైన పాత్ర లో చక్కగా జీవించారు. యస్.వి రంగారావు ఇక చెప్పనక్కరలేదు. అలాంటి పాత్రలుపోషించచుటలో ఇంకె ఎవరికీ సాధ్యం కాదు అంత పరిపూర్ణత గల నటన కనబడుతుంది. ఇలా ప్రతి పాత్ర లో జీవం ఉంటూ కథ భక్తిప్రధాననం తో ముక్తి మార్గంలో డైరక్టర్ బి. ఎ. సుబ్బారావు గారు అంత ఊహ ఆరోజులో దేవుడు,దేవతలు,రాక్షసులు,ఇలా ఉంటారని 1958నుండి 2021దాక కూడ అలాంటి మూవీ రాలేదంటే వారు నిజమైన బ్రహ్మ అనే చెప్పకోవాలి. సంగీతం అందించిన యస్. రాజేశ్వరరావు గారు పాటలు విన్న వింటున్న కొద్ది భక్తి భావంతో కంటిలో భక్తి కన్నీళ్ళు రాలి పోవాలసిందే “ప్రహ్లాదుడు”
పాడే “పాలకడలి పై”అనేపాట ఇప్పటికీ ప్రతి భక్తుల హృదయం లో చేరి జీవం పోస్తుంది. మరోపాట” అదిగో కనలేరా” ఇలా ప్రతి మాట మాట భక్తి తో తనువు పులకరించి పోతుంది.
కథ:- అనువదించిన వెంపటి సదాశివబ్రహ్మం చెప్పటంకన్న రెండు చేతులు జోడించి నమస్కారం అది కూడా సరిపోదేమో అన్నట్టు “చెంచులక్ష్మి”కథ వ్రాసారు. చివరిలో హిరణ్యకశిపుడు స్థంభం పగలకొట్టగా అందులో నుండి ఉగ్రనరసింహుడు వచ్చి హిరణ్యకశిపుడు ని మోక్షం వసంగి ఆ ఆగ్రహంతో తన భక్తుడైన ప్రహ్లాదుడు నిమొర దేవతల మొర నారదుని మొర చివరికి బ్రహ్మ శివుల మొర ఆలకించక “లక్ష్మికళ తో పుట్టిన చెంచులక్ష్మి” స్పర్శ తో ఉగ్రనరసింహడు శాంతించే కథ ఇప్పటికీ ఎవరికి రాని అలోచన  చెంచులక్ష్మి 1958 తీసిన ఈ సినిమా  ఇప్పటికి పండుగ రోజులలో ముఖ్యం గా ముక్కోటి రోజు చూసి తరించే భక్తులు ఉన్నారంటే ఈ సినిమా గొప్పతనం.ఇందులో నటించిన ప్రతి పాత్ర దారులు కు చేతులెత్తి సమస్కరిస్తున్నా.
ఇక డైలాగ్ తన్.జై యన్. రమణయ్య అవి మాటలు కావు ముత్యాలు ఒక్కొక్క డైలాగ్ ఎంత మూర్ఖడైనా ఒక్క క్షణం మారిపోవాలిసిందే. ఉగ్రనరసింహుడి నటన సినిమా చూసు వారు ఆ నరసింహడు వారిని తాకినట్లు గా నటన అడవి లోని మృగాలు సైతం సింహం తనపై పంజ విసిరిందా అన్నట్లుగా పారిపోతాయి,చల్లచెదురు అయిపోతాయి చివరికి నారదుడు దైర్యం చెసుకొని ఉగ్రనరసింహుడను చెంచుగూడెం వైపు మళ్ళించగా, లక్ష్మీ కళ ఉన్న చెంచులక్ష్మి తో ప్రేమలో పడిన స్వామి నారదుడు సహాయం తో పెళ్ళి ఆడగా మరలా నారదుడు ఆడిన నాటకం తో లక్ష్మిదేవి చెంచులక్ష్మి లను ఇరువురిని తారస పడేటట్టు చేయగా జరిగిన నిజం ఉగ్రరూపం లో ఉన్న స్వామి ని శాంతింప జేయుటకు అడిన నాటకం గా నిరూపణ కాగా నిజంతెలియగానే సముద్రరాజు దంపతులకు శాపం తీరుపొతుంది చెంచులక్ష్మి ని మహాలక్ష్మి ఆవాహనం చేసుకోగా విష్ణు మూర్తి లక్ష్మీ దేవి వైకుంఠం తరలి పోగా కథ ముగుస్తుంది.
“ఈ సినిమా కథను చూసి తరించండి.”

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!