ఛీ – ఛీ కొంప కొల్లేరు!

ఛీ – ఛీ కొంప కొల్లేరు!

రచన :: దాస్యం కవిత

ఒక బ్రాహ్మణుడు బహు నిష్టా పరాయణుడు మడి, ఆచారాలు ఎక్కువ. మడిలో ఉన్నప్పుడు భార్యా, పిల్లలను కూడా తాకడు ముందు రోజు ఉపవాసం ఉండటంతో ఆకలి దంచేస్తుంది. ఏమైంది వంట అవుతుందా… ఒక్కసారిగా వాళ్ళ ఆవిడ మీద గావు కేక, అలాగే అండి ఒక అరగంట లో ముగించేసి వడ్డించేస్తాను అంది ఆమె. వంటగదిలో కొబ్బరిముక్కను నములుతుండగా వదినమ్మ అని కేక పక్కింటావిడ పెరుగు తోడుకై వచ్చింది. ఆ నమిలిన మిగిలిన సగం కొబ్బరి ముక్క గూట్లో పెట్టి వెళ్తుంది శాస్త్రి గారు తిన్నగా వంట ఎంతవరకు వచ్చిందో చూద్దామని వంటగదిలోకి వెళ్లి ఆకలిగా ఉన్నా అతనికి కొబ్బరి ముక్క కనబడడంతో నోట్లో వేసుకుంటాడు. పెరుగు తోడు ఇచ్చి వచ్చిన ఆమెకి గూట్లో పెట్టిన కొబ్బరి ముక్క కనబడలేదు. ఏమైంది అంటూ లోపలికి వచ్చి ఏం వెతుకుతున్నావు అంటే నేను గూట్లో పెట్టిన కొబ్బరి ముక్క ఎలుక ఏమైనా తీసుకెళ్ళిందా అంటూ అనగా ఛీ నువ్వు ఎంగిలి చేసిందా… నేను తిన్నది ఎంత అపచారం అంటుండగా ఏంటండీ మనం భార్యాభర్తలమే కదా అంటే, మడిలో ఉన్నప్పుడు కాదు. నా పాపానికి నిష్కృతి లేదు, వెంటనే పండితుడిని కలిసి తన గోడు వెళ్లబోసుకున్నాడు. అతడు దీనికి ప్రాయశ్చిత్తంగా పతివ్రత అయిన ఇల్లాలు వంట తింటే పాపం తుడిచిపెట్టుకుపోతుందని సలహా ఇస్తాడు. ఆ పతివ్రత ఎవరో కూడా మీరే సెలవియ్యండి అంటే శ్యామలా దేవి అనే పేరు చెప్తాడు. తిన్నగా ఆమె ఇంటికి వెళ్లి జరిగిందంతా చెప్పాడు. దానికేం భాగ్యం నాయనా భోజనానికి అన్నీ సిద్ధం చేసి పిలుస్తాను అంది భోజనం వడ్డిస్తుండగా ఆమె కోడలు వచ్చి పాయసం తెచ్చి ఒక్కసారిగా కుమ్మరిస్తుంది. వెంటనే కోడల్ని పక్కకు లాక్కెళ్లి మొత్తం అంతా అతనికి పోస్తే నీకు, నీ కొడుకుకి, నా కొడుకు కి ఎలా అనగా పొద్దున కుక్క సగం తాగింది అత్తయ్య ఆ సగం ఎందుకని పోసాను అనగా ఆ బ్రాహ్మణుడు చాటుగా విని వెంటనే బయటకి వెళ్లి 2 వ్రేళ్ళు నోట్లో పెట్టుకొని కక్కుతాడు ఛీ-ఛీఇలా జరిగిందని ఒక ఇంటి అరుగుపై కూర్చుని అమ్మ లోపల ఎవరైనా ఉన్నారా ఉంటే నా దగ్గర సున్నం – ఆకుఉన్నాయి ఒక వక్క ఉంటే తెచ్చి ఇవ్వరా అంటే అదేం భాగ్యమని వక్క ఇస్తుంది. వెంటనే పరపరా నమిలేస్తాడు ఆ ఇంటి గృహిణి ఆశ్చర్యంగా చూస్తూ రాయిలాంటి వక్క ని పరపరా నమిలేసావు పళ్ళు బండరాయి కంటే పదునైనవిలా ఉన్నాయి అంటే ఎందుకు అలా అంటున్నారు అనగా నేను నమిలితే కాలేదు, మా అమ్మాయి, మా అల్లుడు గారు, మా పక్కింటి అతను ఇలా ఎంతమంది వల్ల కానిది మీరెలా నమిలి మింగేశారు… అని చూస్తున్నా అంటే ఇంతమంది నోట్లో నానిన వక్క నేను తినేసానా తూ-తూ అంటూ మళ్లీ కడుపులోదంతా కక్కి నీళ్లకై చూడగా ఒక ఇంటిముందు కుండలో నీళ్లు కనబడ్డాయి ఆవురావురని నీళ్లు తాగేశాడు. ఆ ఇంట్లో నుంచి ఒక ఆవిడ వచ్చి పందికని పెట్టిన నీళ్లు అలా తాగకపోతే అడిగితే ఇస్తానుగా అంటుంది. ఇక అంతే మళ్లీ వాంతి చేసుకుంటాడు.
ఒంట్లో శక్తి లేక భార్య ఎంగిలి కాదని, ఇంత దూరం ఇలా వచ్చినందుకు తగిన శాస్తి జరిగింది.
ఏం జీవితం రా ఛీ – ఛీ, ఏం బతుకు రా అని ఇంటిదారి పడతాడు. “ఎవరు చేసుకున్న కర్మ వారనుభవించక తప్పదు” అన్న చందంగా ఉంది నా బతుకు అని లో లో మదన పడతాడు!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!