దివికెగసిన స్నేహం

దివికెగసిన స్నేహం

రచయిత: సత్య కామఋషి ‘రుద్ర’

గుండె ధైర్యమే మెండైన గుండె ఒకటి..
అయినవారి ఆదరణ కరువై అలసిపోయింది..
అడుగడుగున ఓడిపోయి అవిసిపోయింది..!

విశ్రాంతిని కోరి, తెలవారని తీరని నిద్రలోకి
మెల్లగ జారిపోయింది, తిరిగిరాని తీరాలు చేరి
కలల అలలా కరిగి, కనుమరుగైపోయింది..!

ఎందరి బరువులనో మోసి, ఒడ్డుకు చేర్చి..
ఎందరికో సేవ చేసి, మరువలేని మేలుజేసి
అరమరికలు లేని, చెలిమిని పంచిన ఓ చేయి,

చితికి చతికిలబడి, కోరిన చేయూత కరువై
ఒంటరిదై మిగిలింది..ఓర్వలేక కుమిలింది
అడగలేక..అడుగిడి మనుగడ సాగించలేక
రిక్తమై మిగిలి..నిస్సహాయంగా అనంతమైన
శూన్యంలోకి చూస్తూ..నిర్జీవమై నేలకొరిగింది..!

కడదాకా తోడుంటానని చేసిన బాసలు మరచింది..
ఆత్మీయతను అల్లుకున్న స్నేహ బంధాన్ని వీడింది..
బంధాలు అనుబంధాల పైన మమకారం నశించి..
విసిగి వేసారి విరక్తినొంది..విగతజీవిగా మిగిలింది.!

తన అవసరమే లేనిచోట, తన ఉనికి ఎందుకని.,
తనకై తల్లడిల్లువారిని కానలేక..కనుగొనలేక
పొరబడి..త్వరబడి..కన్నీటినే తన ఙ్ఞాపకాలుగా
మిగిల్చి..గాలిలోన గాలిలాగా కలిసిపోయింది.!
ఓ తార నేలకు రాలింది..ఆ నింగినంటుకుంది..!

You May Also Like

4 thoughts on “దివికెగసిన స్నేహం

  1. ప్రస్తుత పరిస్థితుల్లో నిన్న ఉన్నవారు నేడు కనుమరుగుతున్నారు…ఎప్పటికి మారునో ..ఈ బాధ , భయం ఎన్నడు తీరునో…

Leave a Reply to విజయ మలవతు Cancel reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!