కాంతమ్మ పండుగలు

కాంతమ్మ పండుగలు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: నారుమంచి వాణి ప్రభాకరి

పుష్య మాసం అంటేనే మంచు పువ్వులు ఆకుల పై పువ్వులా పై చక్కగా ముత్యాల్లా ముత్యాల పువ్వులా ఏర్పడి ఉంటాయి. చలి బాగా ఉండి స్వెట్టర్ రగ్గులు వాడకం తప్పనిసరి, ఇదే ఢిల్లీ ఐతే విద్యుత్ దుప్పట్లు రోజు వాడకం తప్పని సరి అయినా సరె మనుష్యులు పొట్ట చేత పట్టుకుని రుకలు ఎక్కడ ఉంటే నూకలు అక్కడని పరుగులు పెడుతున్నారు. మరి కొందరు విదేశీ పరుగు గల్ఫ్ పరుగులో ఉన్నారు. ఎవరిని ప్రశ్నించినా ఒకటే అర్థిక స్తోమత పెంచుకోవడానికి ఉన్న వాళ్ళు ఇంకా సంపాదనకు లేని వాళ్ళు కుటుంబం పెంచుకోవడానికి, ఇదే సమాధానం ఏ ఒక్కరూ కూడా అవకాశం వస్తె వదులు కోరు రూపాయి కోసం ఇండియా లో పరుగు పెడితే ఆ దేశం  డబ్బు కోసం మిగిలిన వాళ్ళు పరుగు ఆ పరుగులో కొందరు విజయం కొందరు సామాన్యమైన విధానము.
మన దేశంలో  కార్తిక, మార్గశిర పుష్య, మాఘ మాసములలో చలితో భయపడుతూ ఉంటాము. ఈ కొద్ది చలికే ఇంత హడావిడిగా ఉన్నారు మరి విదేశాల్లోని వారు ఇంకెంత చలి తట్టుకోవాలి వాళ్ళకి అక్కడే జీవితం కనుక జీతం ఉన్నది కనుక తప్పదు సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ స్ట్రగుల్ ఫర్  ఎక్సిస్తన్స్ కదా డార్విన్ పరిణామ సిద్ధాంతం ఇక్కడ వర్తిస్తుంది. కూడా కాంతమ్మ తెల్ల వార గట్ల లేచి గోశాలకు  ఇంటి ఆవరణ లో వెనకకు వెళ్లి పాలు పితికి తెస్తుంది. పాలేరు వచ్చి గోశాల శుభ్రపరచి ఆవు పేడ ముద్దలు చేసి పెడతాడు. కొంత మంది పిల్లలు రోజు వచ్చి గొబ్బి పూజకు పేడ పట్టుకెడతారు ప్రేమగా పిల్లల్ని పిలిచి కొన్ని నిత్యమల్లి గొబ్బి బంతి, మందార పూలు కవర్లో వేసి కాంతమ్మ ఎంతో ప్రేమగా ఇస్తుంది.
పెద్ద కొడుకు రెండో కొడుకు విదేశాల్లో ఉన్నారు కూతురు బెంగుళూర్ లో ఉంటుంది. దానితో రోజు ఒకసారి అక్కడి విషయాలు అడుగుతూ ఉంటుంది కాంతమ్మ కూతురికి  రమణి కి ఇద్దరు కూతుళ్లు కొడుకులకి ఒక కూతురు ఒక కొడుకు ఉన్నారు అందర్నీ తలుచుకుని, తన ఇంట్లో కూడా గొబ్బి పేరంటం చేస్తే ఎంత బాగుంటుంది అనుకుంటుంది
అందరూ ఆవిడని పిలుస్తారు గొబ్బి పాటలు బాగా పడుతుంది ఎవరి ఇంట్లో పేరంటం అన్నా పువ్వులు కోసి ఎదో ఒక స్వీట్ పట్టుకుని వెడుతుంది. పిల్లలు గొప్ప వాళ్ళు అవ్వాలని పరంధామయ్య గారు చదువు బాగా చెప్పించారు, దానితో వారు ఇండియా లో జీతం నచ్చక అవకాశం వచ్చింది కనుక రెక్కలు పట్టుకుని వెళ్లి పోయారు.
అందుకే ఆడ పిల్లకి విదేశాలకు వెళ్ళనన్న సంబంధం చూసి చేశారు. పండుగ వారం ఉంది అనగా బెంగూళ్ళు రు నుంచి వచ్చి బొమ్మలు కొలువు పెట్టే , గోబ్బి ళ్ళ పేరంటం పిల్లల చేత పెట్టిస్తుంది . ఆ వీధి కాక తెలుసున్న వారు అందరినీ పిలుస్తుంది. ఘనంగా పాటలు పాడీ చక్కని పేరంటం చేస్తారు ఎదో ఒక గిఫ్ట్ ఐటమ్ పంచి పెడతారు.
ఆవిడ కే మిటి చాలా డబ్బు ఉన్నది అందుకే అంత మంచి పేరంటం సేనగలతో పాటు స్వీట్ హాట్ పాకెట్స్ పంచి పెడతారు. ఇంకా తెల్ల వార గట్ల రంగు ముగ్గులు వేయడం ఇష్టం, అదే సమయంలో హరిదాసు, శ్రీ అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తనలు పాడుతూ వెడతారు. గంగి రెద్దు దీవెనలు ఇవన్నీ చక్కగా  ఆచార సంప్రదాయం ప్రకారం అన్ని పిల్లలు కి నేర్పమని కూతురుకి చెపుతున్నది. వాళ్ళు కూడా విని అన్ని జాగ్రత్తగా పాటిస్తారు.
బోగి ఉదయం పిల్లలు పెద్దలు అభ్యంగనస్నానం చేసి కొత్త బట్టలు కట్టుకుని దేముడి నీ పూజించి , భోగి పిడకల మంట పై పరమాన్నం చెరకు ముక్కతో కలుపుతూ చక్కగా వండుతారు ఇది ఎంతో రుచిగా ఉంటుంది శ్రీ కృష్ణుడికి భోగిపళ్ళు పోసి బొమ్మల కొలువు పెట్టీ పేరంటం చేస్తారు. చంటి పిల్లలు లేరు కనుక శ్రీ కృష్ణ విగ్రహానికి పోస్తారు కొందరు ఒక పళ్ళెంలో వినాయకుడు శ్రీ వేంకటేశ్వర స్వామి లక్ష్మి దేవి శివ కుటుంబం శ్రీ సత్యనారాయణ స్వామి పటము పెట్టీ కూడా భోగి పళ్ళు పోసి పేరంటం చేస్తారు. సంక్రాంతికి వచ్చిన బంధువులు అంతా కలిసి పెద్దల పూజ అరిసి జంతికలు తప్ప కుండా చేసి కలగాయ పులుసు చేసి, పిండివంటలతో  పాయసం పూర్ణం బూరెలు, పులిహోర బొబ్బట్లుభుజిస్తారు కొత్త బట్టలు కట్టు కుంటారు. ఇంకా కనుమ రోజు మినప గారెలు వండి బెల్లం గారెలు అల్లం గారెలు పెరుగు గారెలు కూడా ఉల్లి మిర్చి గారెలు కూడా పిల్లల ఇష్టం ప్రకారం చేసి గ్రామ దేవతలకు కనపా నైవేద్యం పెడతారు ఇల పండుగ చేసుకుని పాలేరు వాళ్ళకి బట్టలు పెట్టీ గోపూజ ఎద్దుల కి అలకారం చేస్తారు. ముగ్గుల పోటీలు విచిత్ర వేష ధారణ స్వచ్చంధ సంస్థలు వారు చేసే టప్పుడు కాంతమ్మను పిలుస్తారు కొన్ని బహుమతులు కాంతమ్మ ఇస్తుంది కూడా ఆవిడ కేమిటీ పిల్లలు విదేశాలు లో ఉన్నారు. ఇది ఒక ప్రశంసా ఉన్నది కొందరు అయితే ఉంటే ఇస్తారా  ఆవిడకు దాతృత్వం ఉన్నది అంటారు. నిజమే కదా కొడుకు సొమ్ము అవదరా మేమిటి పరంధామయ్య గారు హెడ్ మాస్టారు చేసి రిటైర్ అయ్యారు అంటారు. కొందరు ఏది ఏమైనా చెయ్యి పెద్దది అందుకే అంతా బాగా పండుగ చేస్తారు అంటారు ఊరంతా సంక్రాంతి అని చెప్పాలి కూడా ఆవిడ లేకుండా ఏ పోటీ జరుగదు. ముక్కనుమ నాడు రథం ప్రక్క ఇంటికి పంపుతారు. ఆ మరుసటి రోజు ఊళ్లకి వెళ్ళేవారు వెడతారు. ఇదండీ కాంతమ్మ గారి ఇంట సంక్రాంతి పండుగ మనమల సెలవలు అయ్యాక పిల్లని రైలు టికెట్స్ కోని రైలు ఎక్కిస్తారు. అల్లుడు పండుగ నాటికి వస్తాడు పెద్ద వాళ్ళు అయిన అత్తా మామని అల్లుడు కొడుకుల మాదిరి చూస్తాడు. ఒక్క ఫోన్ కాల్ కి వచ్చి చూసి వెడతాడు అది అతని గొప్ప తనము అని చెప్పాలి కొడుకులు విదేశీ పరుగు అయినా అల్లుడు అభిరామ్ చాలా మంచివాడు ఒక్క కొడుకు అయినా తల్లి తండ్రి అత్త మామ అందరిని కూడా ప్రేమగా అనే కంటే భాధ్యత గా చూస్తాడు. అది కాంతమ్మ అదృష్టము . ఈ సంవత్సరం చలి ఎక్కువ ఉన్నా సరే అన్ని శాస్త్రోక్తంగా చక్కగా చేశారు పండుగలు భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు నెలవు  మరీ పల్లెటూరు కాక పోయినా ఇంకా ఇలాంటి చిన్న పట్నం లో కూడా అన్ని బాగా చేస్తారు.
సంక్రాంతికి శ్రీ అన్నమయ్య, శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తనలు పోటీ కి కూడా కాంతమ్మ జడ్జ్ గా అహ్వానింపబడుతుంది. కొందరు పిండివంటలు ముగ్గులు కూడా పెట్టించి పిలుస్తారు. ఆవిడ రానిదే పోటీ జరగదు అందుకు ముందుగానే ప్లాన్ గా అంతా చెప్పి పీలుస్తారు. ఇంట్లో కూడా అన్ని పద్దతి గా చేస్తుంది పండుగ నాడు కాకుండా ముందే అన్ని పోటీలు పెడతారు. కనుక కాంతమ్మ గారు తప్ప ఇంకెవ్వరూ సరిగా నిర్ణయం చెయ్యలేరు , అని మంచి పేరు ఆమెకి  అందుకే కాంతమ్మ విడియోలు కొడుకులు విదేశాల్లో వాళ్ళ స్నేహితులకి చూపించి ఆనందం పొందుతు అమ్మ గొప్ప తనానికు విదేశీ కీర్తి ఎన్ని సార్లు రమ్మన్నా విసా పాస్పోర్ట్ వచ్చిన సరే నేను నా ఇల్లు దాటి ఎక్కడికి వెళ్లాలి అన్నా ఇష్టం లేదు అంటుంది. కాంతమ్మ మాట భర్తకి  బంగారు బాట , వేదమే అంటాడు మంచి భర్త కదా అందరికి వీరు ఆదర్శం ఆదేశము కదా  అందుకే సర్వేజనా సుఖినో భవంతు శాంతి శుభము.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!