మా “జనా” కొట్టు

 మా “జనా” కొట్టు

రచయిత: రోజా రమణి ఓరుగంటి

       ఇదుగో కీర్తి ఇటు రా అని పిలిచింది పొద్దున్నే 6 గంటలకి అమ్మ. అమ్మా ఉండు వస్తాను.. పళ్ళు తోముకుంటున్నాను.. అంది 12 ఏళ్ల కీర్తి. ఇందాకటి నుంచి చూస్తున్నాను సరిగ్గా 15నిముషాలు అయ్యింది పళ్ళు తోమటం మొదలు పెట్టి.. తొందరగా వస్తావేమో. “జనా” కొట్టుకు వెళ్ళడానికి అని చూస్తున్నా.. ఒక పట్టాన నీ పళ్ళు తోముకునే కార్యక్రమం పూర్తి అయ్యేట్టు కనిపించటం లేదు.. సరే ఇంక నేను ఆ రమేష్ గాడ్ని పంపిస్తాలే.. నువ్వు నింపాదిగా పళ్ళు అరగబాముకో.. అని వెటకారాన్ని.. వెక్కిరింతని కలిపి చమత్కారం గా అంటూ “అమ్మ” లోపలికి వెళ్లిపోయింది. కీర్తీ కి జనా కొట్టుకు వెళ్లడం అంటే రెండే లగువులు.. తను ఆలస్యం చేస్తే ఎక్కడ రమేష్ ను పంపించెస్తుందో.. అని తొందరగా పళ్ళు తోమే.. కార్యక్రమం ముగించుకుని.. అమ్మ.. రమేష్ వద్దులే నేనే వెళ్తాను డబ్బులు ఇవ్వు అని ఇంటి లోపలికి పరుగుతీసింది కీర్తి.
కీర్తి అంటోంది.. ” మీకు ఒక విషయం చెప్పనా.. జనా కొట్టు.. సరిగ్గా మా వీధికి చివరలో ఉంటుంది. మేము స్కూల్ కి వెళ్ళాలి అంటే ఆ చిల్లర కొట్టు దాటుకుని వెళ్ళాలి. ఇందాకటి నుంచి జనా.. కొట్టు, జనా.. కొట్టు అంటానే.. గాని అతని అసలు పేరు చెప్పలేదు కదా.. అతని అసలు పేరు “జనార్ధన”చూడటానికి చాలా నల్లగా,పొట్టిగా, పెద్ద బాణ పొట్టేసుకుని.. ఒంటి మీద చొక్కా కూడా లేకుండా కొట్లో కూర్చుంటాడు మా “జనా”…. చిన్న లేదు పెద్ద లేదు అందరికి కూడా “జనా”.. నే.. శరీర ఛాయ నల్ల గా ఉన్నప్పటికీ.. చూడ చక్కని రూపం మా “జనా” ది. అతని కొట్లో.. 5పైసలు వస్తువు దగ్గరనుంచి.. 50 రూపాయలు..చేసే వస్తువులు కూడా దొరికేవి. పప్పులు, ఉప్పులూ, నూనెను.. పిండిలు.. వీటన్నిటితో పాటు పిల్లలకు నచ్చే తినుబండారాలు చాలా దొరికేవి. నాకు ఎందుకు ఇష్టమంటే.. నేను మా జనా కొట్టుకు వెళ్తే.. నాకు ఎదో ఒక “తాయిలం.”. కొసరు ఇచ్చేవాడు.. అందుకే జనా కొట్టు అంటే నాకు చాలా ఇష్టం. మీకు ఒక రహస్యం చెప్పనా.. నేను కొసరు కాకుండా ప్రతి రోజు చాకలెట్స్.. కొనుక్కునే దాన్ని. రోజుకు అర్దరూపాయి.. మా అమ్మ కి, నాన్న గారికి అసలు చెప్పేవాడు కాదు. కానీ నాకు మాత్రం రోజు తినకు పళ్ళు పాడై పోతాయి అని ఎంతో ప్రేమ గా చెప్పేవాడు. పావలా బెల్లం, అర్దరూపాయి నూనె.. రూపాయి.. కారం.. ఇలా ఎదడిగిన.. మా జనా కొట్లో దొరికేవి.
మా ఊళ్ళో పేద వాళ్ళు కు “జనా”అంటే చాలా ఇష్టం. ఆఖరికి 10 పైసలు పెట్టి అడిగిన ఎంతో కొంత ఇచ్చే వాడే గాని లేదని ఎప్పుడూ అనలేదు మా “జనా” ఒక్క రోజు “జనా” కొట్టు తెరువక పోతే ఇంక అంతే.. జనాలు రావడం, చూడడం, వెళ్లడం. ఎప్పుడు తెరుస్తాడా.. అని ఎదురుచూసేవారు.. కొట్టు తెరిస్తే చాలు తీర్ధ ప్రజ. వచ్చిన బేరాలాన్ని.. రూపాయి, అర్ధ బేరాలే.. జనాలు ఒకరి మీద ఒకరు పడి అడుగుతూ ఉన్న.. విసుక్కోకుండా.. కోపగించుకోకుండా.. ఎవరి వస్తువు వాళ్లకి సరిగ్గా ఇవ్వడం మా” జనా ” కొట్టు ప్రత్యేకత. ఇంక స్కూల్ ఇంటర్వెల్ సమయం లో “జనా” కొట్టు మా స్కూల్ కి దగ్గర లో ఉండడం వలన స్కూల్ పిల్లలు అందరు.. “జనా” కొట్టు చుట్టూ తేనె టీగలలా.. ముసురుకునే వారు.. మా జనా ఏ మాత్రం విసుక్కోకుండా..అందరికి.. ఎవరికీ ఏమి కావాలి అడిగి ఇచ్చేవాడు.
అంతే కాదండోయ్.. మా “జనా” కొట్లో అవసరార్థం.. జండూబామ్, పారాసెటమోల్, ఇలా చిన్న చిన్న మాత్రలు కూడా ఉండేవి. మరి మాది పల్లె కదండీ.. చీకటి పడ్డాక ఎవరికైనా అవసరమైతే.. మా “జనా” ఆపద్బంధవుడి లా కనిపించే వాడు.
అలా ఊరందరితో ఎంతో మంచితనం గా ఉంటూ.. అందరి తలలో నాలుక లాగా మారిపోయాడు మా “జనా”.. అంటూ.. జనా కొట్టుకు వెళ్తే ఎదో ఒకటి చిరుతిండి కొసరు తెచ్చువొచ్చు అని కీర్తి వాళ్ళ అమ్మ దగ్గర డబ్బులు తీసుకుని కొట్టుకు పరిగెత్తిన్ది. “జనా”ఇచ్చిన కొసరు కొబ్బరుండ తో ఆనందం తో వెలుగుతున్న ముఖము తో ఇంటికి చేరింది కీర్తి. ఇదండి “మా జనా కొట్టు “.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!