నే మనలేనురా

నే మనలేనురా

అంశం :: నిన్ను దాటి పోగలనా 

గ్రీష్మతాపంతో రగిలే హృదయాన
మబ్బుతునకవై చేరి
ప్రేమజల్లు కురిపించావు…!!!

మోడువారిన జీవితాన
చిరునవ్వులు పూయించావు
నూరేళ్ల జీవితాన్ని కానుకగా అందించావు…!!!

ఎదురుగ నువ్వుంటే పండు వెన్నెల
లేకుంటే చీకటి హేల
ప్రేమంటే రెండుదేహాల పెనవేత కాదన్నావు
ఇరు హృదయాల కలబోత అన్నావు…!!!

ఎన్నో చెప్పాలని ఇంకెన్నో అడగాలని
ఎన్నెన్నో ఊహలు ఇంకెన్నో భాషలూ
అన్నీ మరచి
మౌన యోగినినై నిలిచాను…!!!

నిన్ను దాటి పోగలనా
నే క్షణమైనా
నిను వీడి మనగలనా
ఈ జీవితాన…!!!

రచయిత :: కమల ‘శ్రీ’

You May Also Like

One thought on “నే మనలేనురా

Leave a Reply to Nandakishore pogu Cancel reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!