నీకై

నీకై

అంశం : నిన్ను దాటి పోగలనా

కల్లో కూడా ఆపద రాకుండా కాచే చెయ్యి
మనసులో పదిలంగా ఉన్న నీ రూపం
ఎందుకో మనసుకి తెలియకుంది ఈ వేళ..

ఎల్లప్పుడూ పక్కనే ఉండే నీ స్పర్శ
కంటికి రెప్పలా కాచుకునే నీ ప్రేమ
కానరాకుంది నాకు ఈ వేళ…

మదిలో ప్రశ్నలు ఉప్పొంగే
జవాబు మాత్రం తెలియకుంది.
అలిగిన నా మీద ఏమైనా…

నీ కోపంలో నీ అల్లరిలో
నీ ప్రేమే కనిపిస్తోంది నాకు
అదేమీ చిత్రమో

నువ్వు నాకు దూరం ఉన్న
నా మనసు నిన్ను దాటి పోగలదా
నేను నిన్ను దాటి పోగలనా?

ఏం చేసినా నీ ఊహలు
నన్ను వీడి పోగలవా?
త్వరగా నన్ను కరుణించి
నిన్ను చేరే మార్గం చూపు ప్రియ..

రచయిత ::   కొఠారు నాగ సాయి అనూష

You May Also Like

2 thoughts on “నీకై

Leave a Reply to హసీనాఇల్లూరి Cancel reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!