నువ్వు లేక నేనుండగలనా

నువ్వు లేక నేనుండగలనా..!!

అంశం: నిన్నుదాటి పోగలనా

ఎదుట నీవుంటావు…
మదిలోన దాగుంటావు!!

కనులు నావైనా..
కలలలో నీవున్నావు!!

హృదయమే నాదైనా…
చేసే సడి నీవేగా!!

నీ చూపు తాకగానే…
అలజడి రేగే నాలోనే!!

నీ మాట వినగానే..
చిగురించెను ఆశ మదిలోనే!!

నీ స్పర్శ తగలగానే…
ప్రేమ విరబూసింది లోలోనే!!

నీ కౌగిలి కంటే…
భద్రత ఏముంటుంది!!

నువ్వు ప్రేమ కాదన్నా…
నాప్రాణమే నిలవగలదా!!

నువ్వు నన్ను పొమ్మన్నా…
నిన్ను దాటి నే పోగలనా!!
నువ్వు నాతో లేక…
ఊపిరితో నేనుండగలనా!!

రచయిత :: సిరి

 

You May Also Like

11 thoughts on “నువ్వు లేక నేనుండగలనా

  1. చాలా చాలా బాగుంది మా మంచి గా కవితలు కూడా రాస్తున్నావ్

  2. సూపర్ అక్క.. మదిలో ని భావాల్ని తెలపగనే తెలుపుతుంది ఈ కవిత…

Leave a Reply to Kiranmayi nanduru Cancel reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!