ఓ కవి నీకొక సలహా

ఓ కవి నీకొక సలహా

రచన: ఎన్. రాజేష్

ఓ అభ్యుదయ కవీ
ఈ సభ్య సమాజంలో
తలదించక నిలబడాలంటే
కావాల్సింది డబ్బు
అటుపైనే కీర్తి..
అందుకే మొదట డబ్బు సంపాదించుకో,
ఆ పిదప కీర్తినాపాదించుకో!

నీ కవితలు అగ్ని కణములుగా ఉన్నా
మలయ సమీరంలా ఉన్నా..
అక్షరాల అచ్చు వేయించుకుంటే?
లక్షల కవితలు వ్రాసినా
అవి నిర్లక్షానికి గురియై
నిరర్థకం అవుతాయి..
నీట గలిసి పోతాయి..!

ఈ కాలం గతంలో వలే కాదు
కవితలు ఆదరించువారే కరువు..
ఆస్వాదించు వారే కొరత!

అందుకే ఈ వ్యసనానికి బానిస కాకు..
బరువు బాధ్యతలు
మరిచి పోకు…
దీనినే వృత్తిగా భావించకు.!
ప్రవృత్తిగానే స్వీకరించు..!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!