ఓ రాధ విరహ వేదన

అంశం: ప్రేమలేఖ

ఓ రాధ విరహ వేదన
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: చెరుకు శైలజ

నా ప్రియతమా
నిన్ను తలచుకొని రోజు లేదు.
నా ప్రతి కదలికలో నువ్వు వున్నావు.
నీ జ్ఞాపకలతో నేను యుగాలను నిమిషాలుగా గడిపేస్తున్నాను.
నీ కోసం వేచి వేచి అలసి పోయాను.
మనం కలుసుకున్న మొదటి రోజు ఎంత మధురమైనది.
ఆ రోజుని ఇప్పటికి మరచి పోలేనిది.
అప్పుడు తెలియదు నీవే నా ప్రాణమని.. నేను నీ లోకమని.
అన్ని తెలిసి ప్రేమ కుదిరాక,
ఇద్దరి దారులు వేరు అయ్యాయి
నిన్ను కలుసుకునే సమయమే దొరకడం లేదు.
నిన్ను చూడక ఎన్నో రోజులు గడిచిపోయాయి.
ఎప్పుడో ఒక కవి చెప్పాడు..
కలువకు చంద్రుడు ఎంతో దూరం
కమలానికి సూర్యుడు మరి దూరం
దూరం అయిన కొలది పెరుగును అనురాగం
విరహంలోనే వున్నది ఆనందం.. ఆ పాట మన ప్రేమను జ్ఞప్తికి తెస్తుంది కదా!
ఈ సమయాన నువు ఏమి చేస్తూ ఉంటావో
అని మరి మరి తలుచుకుంటేనే వుంటాను
అలా నీ గురించి తలుచుకుంటు
కలలు కంటున్న నాకు
కాలం ఎలా పరిగెడుతుందో తెలియడం లేదు..
నేను నేనుగా వున్న నాలో నేను లేను.
నాలోన నువ్వే నిండి పోయావు
నన్ను నేను వెతుక్కునే అంతగా
ప్రేమ ఎంత వింతో కదా
మనిషిని మార్చేస్తుంది
మనసుని మాయ చేస్తుంది
మన ఈ ప్రేమ పది కాలాలు పదిలంగా వుండాలని
నీ మనసు నిండా నేనే నిండాలని
ఆ నింగి.. ఈ నేల.. ఉన్నంత వరకు
మన ప్రేమ ప్రతి ఒకరికి ఆదర్శ ప్రేమ కావాలని
ప్రేమ జంట అంటే మనమే గుర్తుకు రావాలని
ఎన్నో అమర ప్రేమలకు మనమే సాక్ష్యం కావాలని
ముందు జన్మలోనైన
మనం ఇద్దరం ఒకరితో ఒకరం కలిసి
జీవన పయనం చేయాలని
మనం కన్న కలలు ఆ జన్మలోనైన పండాలని
నా ప్రియ మాధవా
నా మనసు నిండా నీ మురళీ గానమే
నీ రాధ నీ కోసం చేసే ఆలాపన
నీవే నా హృదయ స్పందన
అందుకో నా ప్రేమ మల్లికల అభినందన
రాధ కృష్ణుల ప్రేమ ఎన్ని యుగాలు అయిన
మారని మమతల గీతిక
మనమే ఆ రాధ కృష్ణులుగా ఊహించుకుంటు
నేను నీ రాధను అయి
నీవే నా మాధవుడిగా
మన ప్రేమ రాధాకృష్ణుల ప్రేమగా ఉండిపోవాలని..

నీ ప్రాణ సఖీ
రాధ

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!