పరమార్థం
రచయిత:చంద్రకళ. దీకొండ
అందమైన అనుభూతులతో…
స్నేహానుబంధాలతో…
ఆస్వాదించాల్సిన అందమైన జీవితాన్ని…
అరిషడ్వర్గాలకు లొంగి…
పలు వ్యసనాలకు లోనై…
వ్యాధుల బారిన పడి…
అడవి గాచిన వెన్నెల కానీకు…!
పదే పదే చింతకు లోనవక…
ప్రశాంత చిత్తము కలిగి…
ఆరోగ్య స్పృహతో, ఉన్నత
వ్యక్తిత్వముతో మసలుతూ…
ఉన్నంతలో సంతృప్తి సంతోషాలతో…
“పరోపకారార్థమిదం శరీరం”
అని ఎరిగి…
పరిపూర్ణ జీవితము గడుపు…!!!
Good message Chandra kala garu
జీవితంలో సంతృప్తి ఎంత ముఖ్యమొ.బాగ చెప్పారు