పెళ్లి చూపులలో మొదలైన ప్రేమ

(అంశం::” ప్రేమ”)

పెళ్లి చూపులలో మొదలైన ప్రేమ

రచయిత :: పావని చిలువేరు

డాబా మీద చదువు కొంటున్న పావని కోసం వాళ్ల  అమ్మ నాన్న  వచ్చారు.
పావని తో వాళ్ల నాన్న రేపు కాలేజీకి  వెళ్లాలా చిట్టి  అని అడిగారు.
వెళ్లాలి నాన్న అంది పావని.
రేపు వద్ధులే అమ్మ  నిన్ను చూడడానికి అబ్బాయి వాళ్లు వస్తున్నారు అని అన్నారు.
అప్పటి వరికి పెళ్లి గురించి యెప్పుడు కూడా ఇంటిలో ప్రస్తావన రాలేదు.  పెళ్లి కూడా ఇంత త్వరగా చెయ్యాలి అనే ఆలోచన కూడా లేదు పావని వాళ్ల అమ్మ నాన్నకి.

అలా ఒక్కసారి ఆ మాట వినగానే పావని చాలా ఆశ్చర్యంగా అదేమిటి నాన్న నాకూ పెళ్లిచూపుల , నేను ఇంకా డిగ్రీ లో ఉన్నాను, ఇంకా చదువుకుంటాడు అంది.
వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు అయినా పావని నాన్న,పెళ్లి అయినా కూడా చదువుకోవచ్చు అమ్మ,  అయినా ఒక్కసారికే పెళ్లి సంబంధాలు కుదురుతాయఅన్నారు.
హు సరే అన్నట్టుగా తలవూపింది  పావని .

ఇంకామొదలైంది పావని వాళ్ల అమ్మకి కొంచెం టెన్షన్ . యింట్లో పెద్ధ అమ్మాయి , మరియు మొదటిసారి పెళ్లిచూపులు ,అస్సలు యిప్పుడే పెళ్లి చేస్తాము అనుకోలేదు వాళ్లు.

కానీ కల్యాణం వచ్చిన కక్కు వచ్చిన ఆగదు అంటారు కదా అలా జరిగింది పావని పెళ్లి.

టెన్షన్ లో ఉన్న పావని వాళ్ళ అమ్మ  , అబ్బా యేమీటoడి మీరు ముందు చెప్పరా రేపేనా అమ్మాయికి  పెళ్లిచూపులు అని రుసరుసలాడిoది ఒక్క చీర కూడా లేదు, మీకు అంత తొందరే అని అరిచింది.
యేమీ కాదులే వాళ్లే కావాలి అని వస్తున్నారు.రేపే వస్తాము అని  చెప్పారు అన్నారు పావని వాళ్ల నాన్న.
లంగా వోని కాని, పంజాబి డ్రస్ కాని  వేసుకొంటుదిలే అన్నారు .
అప్పుడు వాళ్ల అమ్మ, మీకు యేమీ తెలుసు చిన్నపిల్లలా కనిపిస్తారు  డ్రస్ లో ,నేను యేదో ఒకటి చేస్తాలే అని డాబా దిగి కిందికి వెళ్లింది.

అప్పుడు పావని వాళ్ల నాన్న చూడమ్మ రేపు వాళ్ల ముందు బాగా మాట్లాడకు అడిగిందానికే సమాధానం చెప్పు అని చెప్పి కిందికి వెళ్లిపోయారు.
అంతె ఇంకా మొదలు పావని మనుసులో  రకరకాల ఆలోచనలు .పెళ్ళిచూపులు  అనే పదం స్నేహితులు అంటే వినడమే కాని తనకి పెళ్ళిచూపుల అనుభవం ముందులేదు.
చదువు పక్కన పెట్టి డాబా దిగి కిందికి వచ్చింది.

కిందికి రాగానే పావని వాళ్ల అమ్మ చాలా హడావిడి చూసి యేమీటి అమ్మ, యేమీ చేస్తున్నావు అని అడిగింది. అప్పుడు పావని వాళ్ళ అమ్మ రేపు నీకు యే చీర బాగుంటుందని చూస్తున్న. నువ్వేమొ బక్కగా , నేనేమొ కొంచెం లావుగా ఉన్నాను,  నా బ్లౌజ్ నువ్వు యేల వేసుకుంటావు .
మీ నాన్న  యిప్పుడు చెబితే ఇంత రాత్రి నేను, నిన్ను పట్టుకొని యెక్కడ కి వెళ్లాలి కుట్లు  పెట్టించడానికి , నేనే చేయితో పక్కలకు కుట్లు వేస్తునులే అంది చిన్నగా నవ్వుతూ.

అప్పుడు పావని వాళ్ల నాన్న….. అమ్మ చిట్టి రేపు వాళ్లు వస్తారు కదా, నువ్వు యిక్కడ కూర్చో,  అబ్బాయి నీకు యెదురుగానే కూర్చుoటాడు అని చెపుతూ ,నీకు తెలుసా ఆ అబ్బాయి కూడా  మీ కాలేజీనే  డిగ్రీ పూర్తి చేశాడు అని అన్నారు.

ఓహ్ అవునా సరే నాన్న అంది పావని.

తెల్లవారుజామున సోమవారం పొద్దునే  అబ్బాయి వాళ్లు వచ్చారు. పావని వచ్చి వాళ్ల నాన్న చెప్పినట్టుగా అక్కడే అదే కూర్చోలో కూర్చుంది. అందరూ వచ్చారు యెక్కడి వాళ్లు అక్కడ కూర్చున్నారు.ఇంకా రాలేదా అబ్బాయి అని తన యెదురు కాలిగా ఉన్న కుర్చీని చూస్తూ అందుకుంది పావని . తన పక్కన కూర్చున్న వాళ్లు యెన్నో ప్రశ్నలు అడుగుతున్నారు ,సమాధానం  చెప్పిoది కాని తన మనసు అంత ఇంకా అబ్బాయి రాలేదు యేమిటో, అబ్బాయి బిజీగా ఉంది రాలేదా, బిజీగా  ఉంటే చెప్పచ్చు  కదా అని అనుకుంది మనుసులో .

అంతలోనే అబ్బాయి వాళ్ల తాత, నేను అబ్బాయి కి తాత ని అని , అబ్బాయి వాళ్ల మామ నేను అబ్బాయి కి మామను, మీ నాన్న కి స్నేహితుడిని, నేను కూడా ఉపాధ్యాయ వృత్తి లో ఉన్నాను అని చెప్పి, నేనేనమ్మ  ఈ సంబంధం గురించి మీ నాన్న కి చెప్పాను అని చెప్పారు.
అందరూ పరిచయం చేసుకున్నారు. కాని అబ్బాయి మాత్రం ఇంకా  యెదురుగా ఉన్న కుర్చీలోకి వచ్చి కూర్చోలేదు. ఇంకా  వచ్చిన వాళ్లు పావని ని యే కాలేజీ ,యేమీ చదువుతున్నారు అని అన్ని అడిగారు ఓహ్ మా అబ్బాయి కూడా అదే కాలేజీ లో డిగ్రీ పూర్తిచేశాడు అన్నారు అబ్బాయి వాళ్ల నాన్నగారు. అందరూ అడిగే ప్రశ్నలకు అన్నింటికీ సమాధానం చెప్పుతూనే అబ్బాయి యెక్కడా అని తన ముందు ఉన్న కుర్చీ వైపు చూస్తూ ఉంది పావని. ఫోన్ మాట్లాడుతూ ఇంకా బయటనే నిలబడ్డారా  మరి ఇంకా ఎంతసేపటికీ  లోపలికి వస్తారో అని తన మనసులో తానే అనుకుంది పావని.
అప్పుడు  వాళ్ల నాన్న,  అమ్మ చిట్టి వాళ్ళకి స్వీట్  యివ్వమ్మ అన్నారు.
సరే అని లేచి స్వీట్ కూడా యిచ్చిoది, ఇంకా అబ్బాయి కనిపించలేదు, బయట ఉంటే  యింతసేప రావడానికి, యేమో  యెప్పుడూ వస్తాడో అనుకుంది.
కొంతసేపు అయ్యాక పావని వాళ్ల నాన్న, చిట్టి లోపలికి వెళ్లమ్మ అన్నారు.
అయ్యో ఇంకా అబ్బాయి రాలేదు కదా నన్ను వెళ్ల మంటున్నారు యెంటి అని బిక్కమొహం పెట్టుకుని లోపలికి వెళ్లిపోయింది.
లోపలికి వెళ్లగానే పావని వాళ్ల పెద్దమ్మ, అమ్మ యిద్దరు, చిట్టి అబ్బాయి  యేల ఉన్నాడు అని అడుగగానే ఒక్కసారిగా
అయ్యో అబ్బాయి వచ్చాడా యెక్కడా నేను చూడలేదు కదా అనుకుని , అబ్బాయా  యెక్కడా నేను చూడలేదు అంది.

ఇంతసేపు అక్కడే కూర్చున్నావు చూడలేదు అని అంటే యేలనే అంది స్నేహ వాళ్ల అమ్మ.
అప్పుడు పావని అలా యేల చూస్తాను, నా యెదురుగానే కూర్చుoటాడు  అన్నారు కదా , నేను నా ముందు  యింకా యెవ్వరు రాలేదే అనుకున్నాను ,మరి యెవరిని  సరిగా చూడలేదు అని చెప్పి, యింతకి యెక్కువ కూర్చున్నాడు అని అడిగింది స్నేహ.

అబ్బాయి వాళ్ల అమ్మ పక్కన కూర్చున్నాడు , ఆ డార్క్ బ్లూ కలర్ షర్ట్ వేసుకొని, చాలా బాగున్నాడు నీ రంగు కాదు తెలుపు రంగు అన్నారు.
అవును కొంచెం రంగు తక్కువగా ఉన్న వాళ్లకి తెలుపు రంగు వాళ్లే దొరుకుతారు అన్నది పావని వాళ్ల పెద్దమ్మ .

పాపం మరి పావని కి ఎంత గుర్తు చేసుకున్న ఆ బ్లూ కలర్ షర్ట్ అబ్బాయి గుర్తు రావడం లేదు.

సందు దొరికితే చాలు అబ్బాయిని చూదాo అని బెడ్ రూమ్ పరదా సందులో నుంచి చూస్తోంది.కాని అబ్బాయి  వాళ్లు పరదాకి అవతలి పక్కన కూర్చున్నారుఅసలు కనిపించడం లేదు అయ్యో అని తెగ బాధ పడుతోంది.

అందరూ యెన్నో ప్రశ్నలు అడిగారు కదా  మరి ఆ అబ్బాయి నన్నుయేమైనా అడిగారా ,యెవరేవరు యేమీ ప్రశ్నలు అడిగారు అని వాళ్ల మొహం యేల ఉంది అని గుర్తు చేసుకుంటూ ఆలోచిస్తూ ఉంది పావని. పాపం అసలు గుర్తు రావడం లేదు.
పావని వాళ్ల అమ్మమొ చిట్టి ఇంకా నువ్వు చీర మార్చుకో అంటుంది.
అయ్యో పాపం పావని మనుసులో యేదో కలవరింత,  దేవుడా ఒక్కసారిచూస్తాను ఇంకా కనిపించడం లేదు యేల చూడాలి అనుకుంటు మళ్లీ పరదా సందులో నుంచి తెగ ఆరాటపడి  చూస్తోంది.

అప్పుడు పావని వాళ్ల పెద్ధనాన్న యిల్లు  చూదాoరా అని అబ్బాయిని అలా తీసుకుని వస్తున్నారు .
అరే అమ్మ  చెప్పిన డార్క్ బ్లూ షర్ట్ అబ్బాయి వెళుతున్నారు, అయ్యో మళ్లీ ఛాన్స్ మిస్ అయ్యాను అని తెగ బాధ పడింది పాపం పావని వెనుక  నుంచి మాత్రమే చూసింది. అయ్యో యేల చూడాలి ఈ అబ్బాయిని అని తెగ ఆరాటపడింది  మరి ఇంత కష్టమా అందుకుంది.

కొంచెం సమయం  తర్వాత అబ్బాయి వాళ్లు  వెళ్లి పోయారు.
అదే గంట వ్యవధిలో అమ్మాయి నచ్చింది అని ఫోన్ చేసి చెప్పారు.
అప్పుడు పావని వాళ్ల నాన్న తో
అలా యేల నాన్న అబ్బాయి వచ్చాడు అని నాకూ చెప్పలేదు, నేను చూడలేదు అబ్బాయిని అని చెప్పింది,  అరే అంత సేపు అక్కడే కూర్చున్నావు అబ్బాయిని చూడకపోవటం  యేమిటి  అని అంటే,
మీరే కదా నాన్న అబ్బాయి వచ్చి నాకూ యెదురుగా కూర్చుoటాడు అన్నారు.
నేను ఎంత సేపు ఇంకా అబ్బాయి రావడం లేదు యెంటి అనుకున్న,
మీరే కదా అబ్బాయి మాట్లాడుతా అంటే పక్క రూమ్ లోకి వెళ్లి మాట్లాడు అన్నారు,  నేను అనుకున్న అబ్బాయి ఇంకా రాలేదు అని ..అని చెప్పింది.

అప్పుడు అమ్మాయి వాళ్ల నాన్న ఇంకా యిప్పటి నుంచి వూరికే యేదో ఒక సందర్భంలో  లో కలుస్తుంటాములే అమ్మ అని చెప్పి వెళ్లిపోయారు .
తాను అబ్బాయిని చూడలేదు  కాని తనని నచ్చిన అబ్బాయికి తన మనుసులో పెళ్లికి ముందే గుండి కట్టుకుoది  పావని.

ఇంకా పెళ్లికి 3 నేలల 10 రోజుల సమయం అంటే 100 రోజులు యేల గడపాలో తెలియనంతగా ప్రేమలో కూరుకుపోయింది . ఆ  3 నెలల వ్యవధిలో లో యెన్నో సందర్భంలో అబ్బాయి వాళ్ల అమ్మ, నాన్న  యితర బంధువులు వచ్చారు కాని ఒక్కసారి కూడా అబ్బాయిని తీసుకురాలేదు . యెదురు చూస్తూ ఒక్క నెల గడిపిoది .

ఒక నెలలో నిశ్చితార్థం చేశారు,
అబ్బా నేను మొదటి సారిగా నన్ను నచ్చిన,  మేచ్చిన అబ్బాయి చూస్తున్నాను అని ఎంతగానో మురిసి పోయింది పావని.

ఆ రోజు రానే వచ్చింది,
అబ్బా ఎంత సంతోషంగా ఉందో అబ్బాయి చూస్తూ తనలో తానే ఎంతగానో మురిసిపోతూ పావని.
పూలదండలు మార్చుకున్న సమయంలో ఆ అబ్బాయి మొహం  చూసి  ఎంతగానో  ఆశ్చర్య పోయింది, అతని మొహం లో చిరు దరహాసం చూసి ఇంకా ప్రేమలో కూరుకుపోయిoది.
పక్క పక్కనే కూర్చున్నారు కాని అబ్బాయి యేమీ యెక్కువ మాట్లాడడం లేదు. అప్పుడు తెలిసింది అబ్బాయి చాలా బుద్ధిమంతుడు అని,
అయితే  మాత్రం నాతో యిలా ఉంటాడా అని కొంచెం మూతి ముడుచుకుంది పావని.
యేదో మాటా మాటా కలిసే సమయంలో పావని వాళ్ల కాలేజీ స్నేహితులు మరియు కాలేజీ సార్లు కూడా వచ్చారు.
అంతె అబ్బాయి గారికి సిగ్గు వచ్చేసింది. పావని వాళ్ల సార్లు అబ్బాయి కి కూడా రెండు సంవత్సరాల ముందు కాలేజీ సార్లు అంటా.
చాలా సిగ్గు పడ్డాడు అబ్బాయి  అసలే చదువు  పూర్తికాకుండానే కొంచెం చిన్న వయసులోనే  మంచి సంబంధం అని పెళ్లి కుదిరించారు అబ్బాయి వాళ్ల తల్లిదండ్రులు,

సరేలే ఇంతగా చెప్తున్నారు కదా ముందు అయితే నిశ్చితార్థం అవ్వనివ్వు  పెళ్లికి టైమ్ తీసుకుoదాo అనుకున్నా అబ్బాయికి పప్పులు యేమీ వుడాలేదు .
2 నెలల లో పెళ్లి కూడా పెట్టేశారు యెన్నో అవకాశాలు వచ్చాయి మళ్లీ చూడడానికి కాని యెప్పుడు రాలేదు.

తనని చూడాలి అన్న తపన తో పూర్తి గా పెళ్లికి ముందే ప్రేమ లో పడింది పావని.
ఫోన్ లో తప్ప పెళ్లికి ముందు యెప్పుడూ కలవలేదు అనే కోరిక తీయలేదు పావని కి

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!