ప్రేమ

(అంశం::” ప్రేమ”)

ప్రేమ

రచయిత :: జయకుమారి

జీవించాలని ఉంది నాకొసమే జీవించాలి ఉంది.
ఇప్పటిది కాదు ఈ కోరిక ఊహ తెలిసిన దగ్గర నాటి నుండి నాకొసమే నేను నా సంతోషం కోసం నేను
ఆడపిల్ల అనే పదపంజరం నుంచి స్వేచ్ఛగా ఎగిరిపోవాలని ఉంది. నా ఊహాలకి ఆశల రెక్కలు తొడిగి హాయిగా ఆకాశాన్ని అందుకోవాలని ఉంది.
ప్రకృతి ఒడిలో చంటిపాపనై అల్లరి చెయ్యాలని ఉంది.
శుక్లపక్షంలో పండు వెన్నలై వెలిగిపోవాలని ఉంది.
జారే జలపాతం లా ఉప్పొంగి పోవాలని ఉంది.
వసంతంలో ఆమనిపాడే కోయిలనై నా ఎదలో భావాలు అన్ని ముల్లోకాలు వినిపించేలా ఆలపించాలని ఉంది.
బృందవనంలో పురివిప్పిన  మయూరమై నర్తించాలని  ఉంది.
ప్రేమ అనే సామ్రాజ్యానికి యువరాణినై సృష్టిలో అణువణువునా ప్రేమని నింపేసి ప్రేమ ఇదం,ప్రేమే జగత్ అని ప్రేమ జగతిని స్థాపించాలని ఉంది.
అందరికి ప్రేమనే పంచి,ప్రేమనే పొందాలని ఉంది.
ఆ ప్రేమదేశంలోనా యువరాజు తో
హాయిగా మైమరిచిపోవలాని ఉంది.
ఓయ్  ఏంటి ఆ అరుపులు పిల్ల.!
హా.. నా ఇష్టం నేను అరుస్తా నీకేంటోయ్ ఇబ్బంది.
ఆహా..!
అవును ఇది నా ప్రపంచం ,నా కలల  ప్రపంచం ఇది.
చిన్నపిల్లలు చేసినట్టు అల్లరి చేస్తా,డాన్స్ చేస్తా,గెంతుతా.
ఈ ఎత్తైన కొండలు,జారే జలపాతం,నిను తాకుతూ నన్ను చేరే సన్నగా వీచే ఈ చిరుగాలి,పక్షుల కిలకిలా రావాలు,నా పక్కన నువ్వు ఎంత బాగుందో ఈ హాయి.
ఆహా.. అవునా పిల్లా..
ఇలా చూసి ఒక మాట చెప్పు.
ఏందుకోయ్ నేను చూడను.
ఆహా..అంటూ వెనుక నుంచి హత్తుకొని. మెడ అంచుల్లో తియ్యటి గాయలును కానుకగా ఇస్తూ.
ఓయ్ నిన్నే పిల్ల ఏంటి ఇది అంతా సిగ్గే.
ఆ సిగ్గులోలికే బుగ్గలు.
ఆ తేనెలూరు పెదవులు..
ఆ సోంపైన మెడ..
వయ్యారాలు ఒలికించు ఆ నడుమును చూడ
ఉవిల్లు ఊరుతున్న నా వయస్సుకు నచ్చచెప్పలేక పోతున్నా నే.
ఎన్ని రోజులు ఇలా చాటు మాటుగా కలవడం మనకి పెళ్లి అయ్యింది.
తప్పనిసరి పరిస్థుల్లో ఎవరికి చెప్పకుండా పెళ్ళి చేసుకున్నాం.
ఇప్పుడైనా చెబుదాము అంటే టైమ్ ఉంది అంటావ్,ఒక పక్క సంబంధాలు చూస్తున్నారు అంటావ్, ఎలా నే  ఇలా పిచ్చిఎక్కిస్తావ్.
అది కాదు పిల్లొడా !
ఈ లవ్,గివ్వు అంటే ఇష్టం ఉండదు ఇంట్లో అందుకే ఆలోచిస్తున్నా.
మరి ఏమిచేద్దాం అదే ఆలోచిస్తున్నా.
రేపు అమ్మమ్మ వల్ల ఊరికి వెళుతున్న, మా తాత గారు చాలా ఫ్రెండ్లీ గా ఉంటారు, చెబితే అర్ధం చేసుకుంటారు.
ఆయన తో మన ప్రేమ గురించి చెబుతా,ఆయనే నాన్నతో మాట్లాడతారు.
అవునా ఎప్పుడు వెళ్తావ్.!
రేపే వెళుతున్న.!
మరి నేను.!
నువ్వుఎందుకోయ్.!
నువ్వు లేకుండా నిన్ను చుడకుండా ఎక్కువ సేపు ఉండలేను పిల్ల.!
హ్మ్మ్ అది కాదు రా!మన కోసమే గా వెళ్ళేది.
అవును కానీ నాకు నువ్వు తిరిగి వచ్చే వరకు నీ గుర్తుగా ఒకటి ఇవ్వు పిల్ల.!
ఆహా! రా రా ఇస్తా ఒకటి అని గట్టిగా చెవి మెలిపెట్టి.. నెత్తి మీద ఒకటి వేసి
నిన్నూ సిగ్గులేదు రా నీకు.!
మొఖం అలా పెట్టకు, ఇస్తా అని దగ్గరకు తీసుకొని నుదిటిపై ఒక ముద్దు పెట్టి,సరే ఇక వెళ్లని, ఓయ్ ఏంటి అలా చూస్తున్నావ్.
నాకు సరిపోలే,
ఏంటి సరిపోలేదు.!
మొద్దు ముద్దు నే.!
ఆహా… పిచ్చి వేషాలు వెయ్యకు.
అంటూ బయలు దేరుతున్న .
వద్దు పిల్ల అని చెయ్యి పట్టుకొని దగ్గరకు లాక్కొని పెదవులను అందుకొని ముడివేసి ఊపిరిలో ఊపిరి నింపి ఒకరి పెదవుల మధువులు ఒకరు అందించుకుంటూ ప్రేమ లోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ లోకాన్ని మర్చిపోయి పరవశించి కౌగిలిలో ఉన్న తన ప్రాణాన్ని
పిల్లా.!
హ్మ్మ్ ఏంటి పిల్లొడా.!
ఏనాడో రాసివున్నది .
ఈ ముద్దు నా మేనునన్నది ఈ పొద్దు.
అందాలే దాసోహం అన్నది .
మందారం విరబూసే నీ పెదవులు.
మధువులే చవిచూడమన్నది.
పరువాలే..ప్రణయాలై..
స్వర్గంలో శృంగారలీలాలు..
కన్నుల్లో రంగేలి అద్దెను..
హ్మ్మ్….ఓయ్ పిల్లొడా ఏమైంది రా.!

ఏమి అవ్వలేదు పిల్లా.!
మన ప్రేమ మొదలు అయ్యింది మొదలు నీవే నా లోకం అయ్యిపోయావ్ .
నువ్వు దూరం అయితే నేను ప్రాణాలతో ఉండను అది గుర్తు పెట్టుకో.
ఓయ్ ఏంటి ఆ మాటలు.
నేను ఎలా అయినా అందరిని ఒప్పిస్తా.
నువ్వు ధైర్యంగా ఉండు.
అత్తయ్య కు చెప్పాను అన్నావ్ కదా.!
హ్మ్మ్..
నేను శుభవార్తతో వస్తా.
నవ్వుతూ పంపు ,నువ్వు అలా డల్ గా ఉంటే నేను నిను వదిలి వెళ్లలేను.!
హ్మ్మ్ సరే వేళ్ళు.
నేను అన్నది మాత్రం గుర్తుపెట్టుకో చాలు.
హ్మ్మ్ సరే.
బై…
***********
వారం అయ్యింది వెళ్ళి ఒక ఫోన్ లేదు ఏమి లేదు.!
భోజనం చేద్దువు రారా.!
నాకేమి వద్దు అమ్మ.
ఏమైంది రా అంటూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ అడుగుతున్న అమ్మ ను.
ఇక ఆపు అమ్మ .!
నేను ఏడుస్తుంటే నవ్వుతావ్.
సరే లే రా!
ఇంటి కి చుట్టాలు వస్తున్నారు రెడీ అవ్వు.
నేను ఆడపిల్లనా పో అమ్మ ఎవరు వస్తే నాకేంటి అని రూమ్ లోకి వెళ్లి మంచం పై బోల్తా పడుకొని పిల్ల ఏమైపోయివే..
అంటూ కూని రాగాలు తీస్తు అమ్మ ఆగు నీకు ఆటలు ఎక్కువ అయ్యాయి. కితకితలు పెడుతున్నావ్ ఆగు వద్దు అని కోపము గా లేచి చూసి ఒకే సారి లేచి ఆత్రంగా కౌగిలించుకొని.
ఏంటి నీ సంగతి అన్ని రోజులు ఫోన్ లేకుండా ఎలా.

ఈ లోపు అమ్మ వచ్చి ఎందుకు రా నా కోడలి నే డైరెక్ట్ గా నీకు ఇచ్చేసాను అన్న అమ్మ మాటలు విని ఇద్దరు దూరం జరిగి.

అమ్మ అవును రా, మీ పెళ్లికి అందరూ ఒప్పుకున్నారు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!