ప్రియమైన ప్రేయసి
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: తొర్లపాటి రాజు
ప్రియమైన..ప్రేయసి!
నేను రాస్తున్న ఈ లేఖ లో నా మనసు నీ మదిని చేరాలి అంటే, నేను రాసిన ప్రతి అక్షరం వెనుకున్న ఆర్ద్రత చూడాలి. ప్రతి పదానికి వెనుకున్న పరితాపం చూడాలి. ప్రతి వాక్యానికి వెనుకున్న నా వెర్రి వేదన చూడాలి.
ప్రియా అలా చూడగలను అని నీ హృదయం చెప్తేనే లేక లేక రాసిన ఈ లేఖ నీకు నా ప్రేమ లేఖ అని తెలుస్తూంది. అలా కాకుంటే అసలు ఈ పిచ్చి రాతను చదవనే వద్దు.
నా ప్రియా.. ప్రేమని ఎంతో మంది చెప్పగా విన్న. పుస్తకాలలో ఉన్నది చదివా! సినిమాలలో చూసా.. కానీ! నాకు నీపై ప్రేమ కలిగినపుడు పొందిన ఆనందం యే పుస్తకాల్లోనూ చదవలేదు యే సినిమాలోనూ చూడలేదు అదేనేమో ప్రేమంటే
ఓ నా..ప్రియా..
నువ్వు నాకు తారస పడ్డాక తెలిసింది. చుక్కలెన్ని ఉన్నా ఆకాశాన జాబిల్లి ఒక్కటే, చరణాలు ఎన్ని ఉన్నా.. నా పాటకి పల్లవి ఒక్కటే, వర్ణములెన్ని ఉన్నా వర్ణించే మనసు ఒక్కటే, నా కంటిలో కాంతులెన్ని ఉన్నా నా కంటి వెలుగు ఒక్కటే. అది నువ్వే అని నా మది చెబుతోంది! ఓ చెలి.. ఏవరైనా ఇలాంటి మాటలు చెబుతుంటే.. పొగుడతున్నారు అనిపిస్తుంది.. అంతెందుకు ఈ మాటలు నేను ఇంకెవరికైనా చెప్తే అవి కూడా పొగడ్తలే..అనిపిస్తుంది
కానీ.. నీకు మాత్రం చెప్తే అది.. నిజమే అనిపిస్తుంది.
ప్రియ సఖి! ప్రపంచ చరిత్ర మొత్తం చూసుకుంటే యే యుద్ధమైనా.. పోరాటమైనా ఆరాటమైనా, యే ప్రార్ధన అయినా, పూజలైనా, త్యగమైనా,యే అరాచకామైనా, యే దోపిడీ అయినా ఒక్క స్వేచ్ఛ కోసమే ఆత్మాభిమానం కోసమే జరిగాయి అందుకే.. నేను మాట ఇస్తున్న ప్రియ
నా సహచర్యంలో.. నీకు ప్రేమ పూర్వకమైన స్వేచ్ఛను ఇస్తాను.. నీవు నాకు ఎప్పుడూ ఎక్కువే అయిన, అది నా మనసున ఉంటుంది. నీకు మాత్రం సమానత్వాన్ని ఇస్తాను. నా మనసును గెలుచుకున్న ఓ మనోహరి ఇక నుండి.. నీ వైపే..నా దారి
ముహూర్తం చెప్పవే మరి!
నిర్ణయం నీకే వదిలేస్తున్న ఓ పోరీ!
నువ్వు కాదన్నావో నా పని హరి!
…..రాజ్…..
బాగుందండి… ప్రేమని చెబుతూనే, దక్కక పోతే హరి అని ఓ తీయని అనుభూతి ని పంపారు మీ ప్రేయసి కి. ఇక కాదని ఎలా అనగల దు