శివా..

రచన – జ్యోతిరాణి

నీ ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదని

నమ్మిన భక్తుడను

నన్ను పలకరించి వెళ్లే ప్రతి విజ్ఞములో

నువ్వు ఉన్నావని తలుచుతూ

నన్ను నేను సరిదిద్దుకుంటూ

నా బాధలను

నీవు కంఠంలో గరళం దాచినట్లు

నేను నాలో ఇముడ్చుకొని

నవ్వులు చిందించి

నీ బాటలో నడిచే

బాటసారిని శివా…

నను ప్రేమగా చేరిన వారికి

వారి ప్రేమకు బోళాశంకరుడనై

నాకు ద్రోహం చేసినవారికి

మూడో కన్ను తెరిచి ఉగ్రరూపునిగా

నన్ను నమ్మి వచ్చిన ఆలిని

నాలో సగభాగం చేసుకొని

నీ శివనామ స్మరణలో

నిత్యం నన్ను నేను శివారాధనలో ..

నిన్ను చేరుకోవాలి శివా.

You May Also Like

2 thoughts on “శివా..

Leave a Reply to హసీనాఇల్లూరి Cancel reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!