సూదిమందు – వాక్సినేషన్
అంశం : నిన్ను దాటి పోగలనా
ఎందయ్యా అట్ఠా సూస్తా ఉన్నావు
మందు బిళ్ళకు భయపడే ముసల్ది
సూది ముందుకు సిద్ధమైంది అనా..
ఏం సేద్దునయ్యా…
నువ్వు తినగలిగిన యాల కడుపు నిండ తిండి వెట్టిన
నువ్వు మూడు సార్లు సావంచులకు బోయినా
యమునితో కొట్లాడి తిరిగి దెచ్చుకున్న
సముయానికి నీకు మందులియ్యనీకి, నీకు గట్క వొయ్యనీకి
ఒక్క పూట ముంతలో ముద్దెయ్యనీకి
నీకు ఇప్పుడు మనసైనా ఒక ముద్దీయనీకి
నేను ఉండాలి కదయ్యా.
యాభై ఏళ్ళ నాడు నీ వేలు బట్టుకొచ్చిన
అన్నింటా నీ తోడుగ నడిసిన
నాకు నా పానం అంటే కాదయ్యా తీపి
నా పెనిమిటి చివరికంటా నేనుండాలనే స్వార్ధం
మాయదారి కరోనా వస్తే నా దారిన నేను
నిన్ను దాటి పోగలనా
అత్తకు ఇచ్చిన మాట మరుతునా
భవ బంధ సంద్రాన నిన్ను ఒంటరిగా ఇడుస్తునా
ఆలి నైనా చివరికి ఆపదలో నీకు అమ్మనే కదా.
రచయిత :: అనురాధ కోవెల
మీ కవితలోని యాస, భావం చాలా బాగుంది అండి👏👏👏😊