వెన్నెల దారుల్లో

వెన్నెల దారుల్లో…

రచన:: వాడపర్తి వెంకటరమణ

కొన్ని ప్రేమ భావాల్ని గుండెల్లో నింపుకుని
నా ప్రణయదేవత కోసం
ఆ నడిరేయిలో పయనిస్తున్నాను

వెన్నెల పుష్పం విచ్చుకుందేమో
పిండారబోసినట్లుంది త్రోవంతా
మబ్బుల చాటున చందురుడు
అటూ ఇటూ తారాట్లాడుతున్నాడు
నావైపు కొంటెగా చూస్తూ
నింగిలో తళుకు తళుక్కున
మెరుస్తున్న తారకలు
తొందరపెడుతూనేవున్నాయి
త్వరగా ప్రేయసి కౌగిట్లో వాలిపొమ్మని

అలా అలా ఇంకాస్త ముందుకు వెళ్ళాను
దారమ్మట పరుచుకున్న గడ్డిపూలు
తుషార స్నానం చేసినట్లున్నాయి
తాజాగా మెరుస్తూ తలలూపుతూ
దారిపొడుగునా ఆహ్లాదపరుస్తున్నాయి
అక్కడెక్కడో పాటల చెట్టుపైనుండి
ఏ గంధర్వ పిట్టో వీనులవిందుగా
ప్రణయగీతాలు ఆలపిస్తూ
నాలో ఏవో ప్రకంపనలు రేకెత్తిస్తోంది

మరికాస్త ముందుకు అడుగేయబోయా…
అదాటున మెలకువ వచ్చింది
భుజంపై శ్రీమతి చేయి కనిపించింది
రసాత్మకమైన కల చెదిరింది!

***

You May Also Like

One thought on “వెన్నెల దారుల్లో

  1. వెన్నెలతో సావాసం మల్లెల వసంతమే గంధర్వ గానంలో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!