వ్యాఖ్య వర్క్ షాప్

వ్యాఖ్య వర్క్ షాప్

కిరణ్ సత్యవోలు

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ మామిడి హరికృష్ణ గారి సహకారంతో EarHook నిర్వహించిన రైటర్స్ వర్క్ షాప్ ‘వ్యాఖ్య -2’ ఎంతో ఆలోచనాత్మకంగా, ఆహ్లాదంగా కొనసాగింది.
శ్రీమతి పి. జ్యోతి గారు మాట్లాడుతూ కొత్త రచయితలు ఎటువంటి పరిధి పెట్టుకోకుండా రచనలు చేయాలని చెప్పారు. చదవడం అంటే కాపీ కొట్టడం కాదని, ఏదైనా రచన చదివి కాపీ చేసి రాయడం వలన పాఠకుడికి మోసపోయిన భావన కలుగుతుందని, రచయితలు క్వాంటిటీ ఆఫ్ రీడర్స్ కంటే క్వాలిటీ ఆఫ్ రీడర్స్ ని గెలుచుకునేలా రచనలు చేయాలని తెలిపారు.
శ్రీ పి.దత్తశర్మ గారు మాట్లాడుతూ లాక్షణిక గ్రంధాలు చదవడం వలన ఐడియాలజీని ఫిక్షన్ గా మార్చిరాసే నైపుణ్యత అలవడుతుందని చెప్పారు.
శ్రీ కస్తూరి మురళీ కృష్ణ గారు మాట్లాడుతూ ఏ సందర్భం నుంచైనా కథను రాయచ్చని వివరించారు. కథా ప్రక్రియలో వివిధ అంశాలను స్పృశిస్తూ చెప్పిన తీరు విద్యార్థులను ఆకట్టుకుంది.
శ్రీ బెజ్జారపు వినోద్ కుమార్ గారు కథా రచనలో మెళకువలను చెప్తూ కథా వస్తువే రచయితను ఎంచుకుంటుంది. ఇది సహజ అభ్యాసం ద్వారా అలవడుతుంది అని, అందుకోసం రచయిత దేన్నీ ఆశించకుండా రచన చేస్తే అది గొప్ప రచన అవుతుందని ఉద్ఘాటించారు.
శ్రీ పి.చంద్రశేఖర అజాద్ గారు నవలా ప్రక్రియపై మాట్లాడుతూ జీవితానుభవాల నుంచి రాసే రచనలు పాఠకులను ఎంతో ప్రభావితం చేస్తాయి. కొత్తగా రాసే రచయితలు రాయడం, చదవడం సమపాళ్లలో చేయాలని సందేసమిచ్చారు.
వ్యాఖ్య -2 వర్క్ షాప్ ని విజయవంతం చేసిన రచయితలకు, విద్యార్థులకు EarHook బృందం ధన్యవాదాలు తెలిపింది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!