అమ్మమ్మ అమృత ఆవకాయ

అమ్మమ్మ అమృత ఆవకాయ
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: నారు మంచి వాణి ప్రభాకరి

సూర్యుడు కాల మార్పులు చేస్తూ తన కిరణాలతో మానవులకు మేలు చేస్తున్నారు. సౌర కుటుంబం వల్లే ఎన్నో మంచి మార్పులు గ్రహాలు ఆకాశంలో ఉండి మానవుల్ని దీవిస్తే మన ఆవకాయ పచ్చడి చంద్రుడు కి ఇష్టమైన వెండి కంచంలో ఉండి మనుష్యులకు ఆరోగ్యం ఇచ్చి వాతావరణ పరిస్తితులకు అనుగుణంగా ఆహారం ఏర్పాటు చెయ్య బడింది. ఉగాది వెళ్ళగానే శ్రీరామ నవమి మనకు ఇప్పుడు భద్రాచలం ఒంటి మిట్ట శ్రీరామ్ సీత కళ్యాణములు వసంత నవరాత్రి పూజలు ఇలా అన్ని అయ్యాయి పూజలు పూర్తి  అయ్యాక ఆరోగ్య పూజ. ప్రతి ఏడాది ఊరగాయలు అప్పడాలు వడియాలు పిండి వడియాలు వరుగులు చల్ల మిరప కాయలు అన్ని ఇంట్లో సమృద్దిగా డబ్బాలు నిండా ఉండాలి లేకపోతే తోచదు. కూరల ధరలు ఆకాశం లో ఉన్నాయి. ఇది ఊరగాయలు వరుగులు
అప్పడాలు, వడియాలు, చల్ల మిరపకాయలు జూస్ లు, జామ్లు వంటి నిల్వ పదార్ధము వర్ష కాలానికి
రెడీ చేసి అట్టేపెట్టునే కాలము, అరటికాయలు వరుగు కాకరకాయ వరుగు చేసి ఉంచితే పులుసు పెట్టీ పప్పు వండి వేయిస్తే ఆధరవు జాడీలో ఊరగాయ తీసి ఎర్రని నూనె తో పిండి పెచ్చు వడ్డిస్తే ఆ కంచం పున్నమి నాటి చంద్రుడిలా ఉంటుంది.
అందుకే ప్రతి వేసవి ఊరగాయ పండుగ అని చెప్పాలి. ప్రకృతి లో ఎంతో మార్పు ఉదయం చల్లదనం మధ్యాన్నం ఎండ బాగ వచ్చి సాయంత్రం చల్ల బడుతుంది. కాలువ మీద నుంచి పిల్ల గాలి బాగా వస్తుంది కూడా ఇంటికి చుట్టు కొబ్బరి మొక్కలు కాడ మల్లి పూల, సంపెంగ సువాసన ముందు ఏ సుగంధ ద్రవ్య సెంటు అవసరం లేదు,అంతా ప్రకృతి సౌరభ్ వింత అనుభవం ఆనందము
అది పల్లె గొప్పదనము. ఇప్పటికీ పల్లెలే కాదు పట్నం లో కూడా ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లు సిటీలో కూడా కాయలు ముక్కలు కొట్టి పొర తీసి ఇస్తారు కారాలు ఉప్పు అవపిండి అక్కడ గాని వేరే కొట్లో కానీ అమ్మినవి తెచ్చుకుని నూనె కలిపి ఊరగాయ పెట్టుకుంటారు. అసలు తినాలి అనే సంకల్పం ఉంటే ఆకాశం లో ఇల్లు కట్టుకున్న అవకాయను పెట్టుకుంటారు. ఇంకా అన్నపూర్ణమ్మ  ఇంటీ విషయం లోకి వస్తె అవిడ మనుమలతో  అమ్మమ్మ గారు ఇంత  పెద్ద పండుగ లా చేస్తుంది. ఇల్లంతా సందడే సందడి అమ్మమ్మ అవకాయ్ అమృతం అనాలి తిన్న వాళ్ళు అపూర్వం అమృతము అద్భుతము అనంతం అంటారు. అతిథులు వచ్చిన వాళ్ళు కంచంలో ఎన్ని వడ్డించిన ఆవకాయ అడిగి మరీ వేసుకుని  తింటారు. ఇంటి నిండా మామిడి పళ్ళ బుట్టలు సపోటా తట్టలు ఉంటాయి ఇంకా నక్క దోసకాయలు, అరటి గెలలు సరే సరి ఇంకా పుచ్చకాయలుపెద్దవో చిన్నని ఏవో ఒకటి అర్డ్ చంద్రాకారం ముక్కలు కోసి పెడతారు. ఈ మధ్యలో ఎవరో ఒకరు పనస తొనలు పంపుతారు
ఆ కాయలు పిల్లలకి పెద్దలకు భలే ఉంటాయి.వాళ్ళ పాలేరు వెంకన్న ఒక్కొక్కప్పుడు కాయ తెచ్చి చక్కగా కోసి తొనలు వలిచి దేనికి అధి విడదీసి పెట్టడం చూస్తే భగ వంతుడు పనస కాయను ఎంత కళాత్మక ముగా సృష్టించాడు అన్నది మనకు బాగా తెలుస్తుంది.”ఇవన్నీ ప్రకృతి వరాలు” “వేసవి మధురాలు” పనస గింజలు తోనాల్లో భలే అమరీ ఉంటాయి పీచు ఉంటుది. అన్నీ కలిపి రక రకాల వంటకాలు చేస్తారని పెద్ద వాళ్ళు చెపుతారు
పనస కాయ పై ఎన్నో చణుకు లు సామెతలు పొడుపు కధలు. కధలు ఇత్యాది ఎన్నో ఉన్నాయి .
పిల్లలు పెద్దలు ఆసక్తి కరంగా వినే అంశము మధ్యలో పాటలు పద్యాలు నేర్పుతూ కబుర్లు చెపుతూ పనులు చేసే అలవాటు అన్న పూర్ణ గారుకి అందుకే మనుమలు చూట్టూ చేరుతారు.
పొట్టుతో కూర పులుసు పెద్ద ముక్కలతో బిర్యాని, పలావు, వడలు హల్వా లు చేస్తారు. పనస  కాయ గింజలతో ఎన్నో వంటకాలు చేస్తారు. సరే ఇంకా మహారాజ ఫలం మామిడి కాయ గురించి మా అమ్మమ్మ ఎన్నో కధలు చెపుతుంది. అంతరాల తరాలు ఎంత మారినా ఆహారంలో ఎన్నో రకాల అధరవులు కావాలి దానికోసం ఒక్క నెల వేసవిలో కాస్త పడితే పదకొండు నెలల దర్జాగా బ్రతక వచ్చును.  అన్ని ఆ ధర వుల లోకి ఆవకాయ ఎంతో ఘనమైన ఏ టీ ఎమ్ ఫుడ్ అని చెప్పాలి ఆధునిక యుగం లో అన్ని రెడీ మెడ్ గా వస్తున్నాయి. బంధువులు వచ్చిన పండుగలు వచ్చిన వంటింటి పెద్ద దిక్కు అని చెప్పాలి. సృజనశ్రీ ఎది కావాలన్న అమ్మమ్మ పై ఆధార పడేది. ఆవిడ చేసినట్లు ఎవరూ చెయ్యలేరు. అన్నపూర్ణ కూతురు కూతురిని తన అన్న కూతురి కొడుకు కు చేసింది వయసు ఇద్దరిది ఒకటే అయినా సరే వారు వయసు చాలకపోయినా  చిన్న కాక  పోయిన దగ్గర సంబంధం కంచంలో కంచం అంటూ కలుపుకున్నారు. ఇలాంటి వారు తక్కువ ఉంటారు. ఆ పిల్లాడు అధి కలిసి అమ్మమ్మ దగ్గర ఉండి ఇంటర్ వరకు చగువుకున్నారు కనుక పెద్ద వాళ్ళు సరే అంటూ పెళ్లి చేసేసారు ఒక విధంగా ముఖ్య సలహా దారిణి అన్నపూర్ణ భర్త వేంకటేశ్వర రావు హెడ్ మాస్టారు అందుకని అందరి పిల్లలు ఇంటర్ వరకు అక్కడే చదివేవారు. హడావిడిగా వచ్చి అన్నం అంటే అన్నంపెట్టి అవక్కాయ వేస్తే చాలు అమృత అహరము అద్భుతః అంటారు.
పూర్వీకుల నుంచి మన తాత ముత్తాతలు పట్టు పంచే కట్టి నెయ్యి చేతిలో అరచేతికి సరపడ వేసుకుని మరికొందరు మంచి నూనెను వెసుకుని అవకాయ ముద్దలు కలిపి తింటే ఆహ్ పిల్లలు చూట్టూ చేరి నాకొక టీ నా కొకటి పెట్టావా అని అడిగి మరీ తింటారు అదే మహా మజా అమృత రుచి ఆహా! అంటారు. అవకాయ లేని భోజనం, ఆత్మీయత లేని కుటుంబం, ఏకాగ్రత లేని చదువు, ఆనందం లేని జీవితము, అనురాగం లేని భార్య భర్తలు, అర్థం లేని జీవితము ఇవన్నీ వ్యర్థాలే
ఈ అరు సూత్రాలు జీవితానికి ఎంతో అవసరం కదా వీటిని పరమార్థంగా మార్చే శక్తి కావాలి అదే వేసవి వరాలు, కొబ్బరి బొండాలు ముంజెలు ఇవన్నీ తప్పక తినాలి సిటీలో ఎంత ఖరీదు అయిన గాజు బీరువా  తలుపుల్లో సిల్వర్ పేపర్లో  చుట్టి అముతున్న సరుకులు ఎంత ఖరీదు అయిన సరే మనం తినాలి పిల్లలకి తినడం నేర్పాలి అలవాటు చేయాలి అధి వద్దు ఎది వద్దు ఇది వద్దు అల వద్దు అనకూడదు
ఇవన్నీ ఇప్పుడు అపురూప స్వర్గ రుచులు అని చెయ్యాలి. ఆ తరం లో అవకాయ యజ్ఞంలా ఆడ మగ కష్ట పడేవారు. మడి కట్టుకుని మిరప కాయలు వేయించి కొట్టుకునే వారు దానితో గుత్తి మెంతికాయ పెట్టేవారు మాగాయ పెట్టేవారు. ప్రత్యేకం ఈ కాలంలో కారాలు కొట్టి డబ్బు సంపాదించే వారు
బాగా నెల తిరిగే టప్పటికి ఐదు వేలు అల సంపాదించుకుని బంగారం వెండి పట్టిలు కొనుక్కునే వారు, ఇప్పుడు అంతా మిషన్ రోకళ్ళ్ వచ్చాయి రుచి కూడా అనంత మాత్రం గానే ఉన్నది. గ్రామాల నుంచి పట్టణాలకు విదేశాలకి వెళ్లిపోతున్నాయి
పెద్ద పెద్ద ఊరగాయ కంపెనీలు వచ్చాయి. కనుక చక్కగా  కొనుక్కుంటున్నారు. పూర్వ కాలం ఒక గది ప్రత్యేకంగా ఉంచే వారు అది మడి కట్టుకుని ఊరగాయ పట్టుకుని తేవడానికి వెళ్ళేవారు
ఆసక్తిగా అంతా ఎదురు చూసే వారు ఆకులో ఎన్ని కూరలు ఉన్నా అవకాయ కోసం ఎదురు చూపులు ఉండేవి.  సృజనశ్రీ వేసవి సెలవలు పిల్లల పరీక్షలు కాగానే పుట్టింటికి వచ్చేది అక్కడ అమ్మమ్మ చేతి వంట తినాలి అమృతము అనేది. సృజన శ్రీ సుమన శ్రీ అన్నపూర్ణ కూతురు వెంకట లక్ష్మి కి కవల పిల్లలు అల్లుడు ఆయుర్వేదం డాక్టర్ తమ్ముడు వరుస అందుకు ఎలా చెపితే అల వింటాడు లేకపోతే అన్న పూర్ణమ్మ వినదు. పెద్ద మనుమరాలు కి పెళ్లి చేశారు దూరపు బంధువు. అతగాడికి నలుగురు అక్కలు పెళ్లికి ఉన్నారు అయిన సరే మంచి సంబంధం వచ్చి నప్పుడు వదులు కోకూడదు అంటూ ఇద్దరు పెళ్లి కానీ పిల్లలు అధ్యాపక ఉద్యోగాలు చేస్తున్నారు  అని పెళ్లి చేశారు. కానీ అత్తగారు అతగాడికి విదేశీ అవకాశం వచ్చింది వాడిని పంపుతాం ఇంకా ఇద్దరి పెళ్ళిళ్ళు వెయ్యాలి  మీ పిల్ల మా దగ్గర ఉండి డాన్స్ స్కూల్ నడుపుతుంది అన్నది. చేసేది ఏముంది సరే కొడుకు విదేశము లో కోడలు డాన్స్ స్కూల్ నడుపుతోంది చివరికి ఏమి తేల్చింది నా కూతుళ్ళకు పిల్లలు లేరు కనుక మీ పిల్ల అప్పుడే పిల్లలని కనకుడదు అని చెప్పింది. అసలు సంగతి తెలిసిన తల్లి తండ్రి మా పిల్ల మాకు బరువు కాదు అనుకుని తెచ్చేసరికి, ఆవిడకి వాళ్ళు పిల్లకి ఇంకో పెళ్లి చేస్తారని భయ పడి కోడల్ని విదేశాలకు పంపింది.
ఈ తరహా అనుభవంతో రెండో పిల్ల సృజన శ్రీ నీ దగ్గర సంబంధం కార్తీక్ కి చేశారు. వెళ్ళ లండన్ వెళ్లి వస్తూ ఉంటారు. అయితే సృజన శ్రీ పిల్లలు సుమన శ్రీ పిల్లల కంటే  ముందు పుట్టారు. వేసవి అనగానే ఊరగాయలు పెళ్ళిళ్ళు పిల్లల సెలవలు బంధువుల రాక పోకలు అంతేనా మామిడి పళ్ళు మల్లె పూవుల సందడి అందులో మరువం కనకాంబరం చేర్చిన కదంబ మాల మరింత ఘనము. పెళ్ళిళ్ళు అయిన సుమనశ్రీ సృజన శ్రీ డాన్స్ మాన లేదు పిల్లలకి నేర్పిస్తూ ఉంటారు. ఇంకేమి వేసవి వచ్చింది అంటే మనుమలు సందడి, పాత ఇల్లు అంతా మార్చి కొత్తరకం పద్దతిలో అలంకరించారు అంటే నేటి తరానికి అనువుగా అంతా ఏర్పాటు చేశారు.
అమ్మమ్మ పిల్లలకి పెందరాళే వంట చేసి మామిడి కాయ పప్పు మామిడి పండు ముక్కలు వేసి,నెయ్యి వేసి కలిపి అందరికీ పళ్లా లలో పెట్టీ ఇచ్చే ముద్దలు తినిపించేది. వంట మనిషి వచ్చి పెద్ద వాళ్ళకి వంట చేసేది. ఈ లోగా అమ్మమ్మ మడి కట్టుకుని  పొలం లో ఏక చెట్టు కాయ తెప్పించి కదిగించి ముక్కలు కొట్టించి తెల్ల పొర మనుమలు చేత చెంచాతో చక్కగా  తీయించి  ముక్కలు పెద్ద స్టీలు బిందెలో పెట్టేది. అప్పటికి మనుమలు రాకుండానే ఖారం గాటు లేకుండా ఖారాలు కొట్టించి మెత్తగా జల్లించి జాడిల్లో అవపిండీ ఉప్పు కలిపి మెంతులు చేర్చి మూత పెట్టీ వాసన కట్టేది ఇది ఒక మహా యజ్ఞం పిల్ల లు ఉంటే ఖారామ్ గాటు పట్టలేరని అవిడ ప్రేమ. పింగాణీ జాడిలు గాజు సీసాలలోనే ఎక్కువ మంచిది మట్టి బా నలు మాత్రం మాగాయకు  ఏర్పాటు, వేరే డబ్బాలు ఇప్పుడు వచ్చాయి అప్పుడు లేవు కదా! చక్కగా పాత ఊరగాయ పని వాళ్ళకి పాలెళ్లకి పస్తెంగా వాడు కోమని ఇచ్చేది కొత్త ఊరగాయ పెట్టాక అధి కూడా రుచి చూపించేది.
చెట్టు మీద మామిడి కాయ సముద్రంలోని ఉప్పు కారం కలిసి ఊరగాయ కొత్త వియ్యల వారికి కూడా పంపే ఆనవాయితీ కొందరికి ఉంటుంది. అన్నపూర్ణమ్మ గారు చేతిలో ఊరగాయ అమృతం అంటారు. ఇందులో గుత్తి మేంతికాయ మాగాయ పులిహోర అవకాయ ఉల్లి అవకాయ బెల్లం, నువ్వు, మునగ, శెనగ పెసర, తేలక పిండి అవకాయ పచ్చ అవకాయ ఇలా ఎన్నో రకాలు పెడుతుంది. సమంగా పళ్ళు వెయ్యాలి అప్పుడే నిల్వ ఉంటుంది. ఎర్రటి అవకాయ తెల్లటి అన్నంలో నెయ్యి వేసి కలిపి ఒక ప్రక్క వెన్న పుస లేక మీగడ మరో ప్రక్క మామిడి ముక్కలు పెట్టుకుని తింటే ఆహా స్వర్గం కనిపిస్తోంది. అని అంటుంది అన్నపూర్ణ ఆటలాడి అలసి వచ్చిన పిల్లలకి బ్రెడ్ జామ్ కాక కాస్త అవకా య అన్నం పెట్టండి ఆరోగ్యం అజీర్ణం ఉండదు. ఈ సీజన్ వస్తె చాలు పట్నం వారికి అమ్మమ్మ బామ్మ జ్ఞాపకం వస్తారు. వరుసలు కలిపి మరీ మాట్లాడి కప్పులతో ఊరగాయ పుచ్చుకుంటారు. ఏమిటి మీ ఊరు వెళ్ళారా ఊరగాయ తెచ్చారా మాకు కొంచెం ఇవ్వండి అని మోఖమాటము లేకుండా అడుగుతారు. నలుగురికీ నాలుగు కప్పులు ఇచ్చేట ప్పటికి తెచ్చుకున్న డబ్బా ఖాళీ అవుతుంది. మా కారం ముక్కలు నూనె కలిపిన దాంట్లో ముక్కలు వేసి కలిపి జాడీలో పోసేది అమ్మమ్మ దగ్గర ఉండి నూనె కలిపేది. అలా ఉదయం మొదలు పెట్టిన భోజనాలు సమయం వరకు చేసి జాడిల్ కి మూత పెట్టీ అందరం భోజనాలు చేసేవారు. వంట మనిషి భోజనాలు అయ్యాక తిని కొన్ని కాయలు పట్టుకెళ్ళి తోక్కడు పచ్చడి పెట్టుకునేది  ఇలా ఊరగాయలు పెళ్లి వారం చక్కగా నవ్వుకుంటూ ఉంటే తాత గారు మధ్యలో పద్యాలు చెప్పేవారు. కారం ఎరుపులో మనకు సూర్యుడు, ఉప్పు నూనె శని, మెంతులు పసుపు గురుడు,మామిడి కాయ బుధుడు ఆవాలు రాహువు కేతువు అవ ఘాటు కారం రుచి వేడిలో కుజుడు, తెల్లని ఉప్పు అన్నంలో చంద్రుడు ఇలా
ఎంతో అందంగా కలిపిన ఆవకాయ శుక్రుడు అని  నవ గ్రహాలతో పోల్చుతారు. మరి అంతే కదా ఆవకాయ కలిపిన కంచం ఎంతో అందంగా ఉంటుంది. గ్రహ స్తితి అవ కాయ తింటే మంచిది అంటారు. మరి ఎంత నిజమో అందరూ ఆలోచించండి. సెలవలకి వచ్చిన వాళ్ళకి కొత్త బట్టల కంటే కూడా ఊరగాయ  సీసా ముఖ్యము. అన్నపూర్ణ చెల్లెళ్ళు కొంత మంది అయితే అప్పా నువ్వు మాకు బట్టలు పెట్ట వద్దు నాకు ఊరగాయ డబ్బాలో పెట్టీ ఇయ్యి అనేవారు అన్నపూర్ణ నవ్వుకుని అధి అదే ఇది ఇదే నాకు స్తోమత ఉన్నది అధి ఇది పట్టుకెళ్ళి వే మామిడి పళ్ళు కూడా చిన్న బుట్టలో పెట్టే ఇచ్చేది. ఆంధ్రలో తయారీ విదేశీ అమ్మకము ఎక్కడ ఉన్నా జిహ్వ రుచి మార దు కదా! ఎంత ఫైవ్ స్టార్ హోటల్ కి వెళ్ళిన ఆవకాయ బౌల్ కోసం వెతకడం సర్వ సహజమే కదా!
అన్నపూర్ణ మనవల్ని కుర్చు బెట్టి మల్లె పూల జడలు వేసి ఆనంద పడుతుంది పిల్లలు వాళ్ళ అమ్మల్ని చూసి అమ్మమ్మ ఎంత గారం చేస్తుందో అంటారు మీరు మగ పిల్లలు ఆడపిల్ల లు అయితే మీకు పూల జడ వేసే దాన్ని అని నవ్వుతుంది. వేసవి కి వచ్చిన మనుమలు కి తాత గారు తెలుగు పద్యాలు, కధలు చెప్పేవారు అమ్మమ్మ మాత్రం శ్రీ అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తనలు నేర్పేది. ముని మనుమ ల్ని ముద్దు గాదె యశోద అంటూ పాట పాడుతూ అన్నం తినిపించడం అలవాటు. కుటుంబాల్లో పెద్ద వాళ్ళు పిల్లల కి నచ్చేలా చెప్పాలి అప్పుడు  మనసుకి బాగా హత్తుకునీ వస్తుంది. అవకాయ పై దండకములు, కథలు కావ్యాలు వ్యాసాలు కవితలు అన్ని రాస్తారు మన సాహిత్య కారులు భాష సంస్కృతి సంప్రదాయాలు పెద్దల నుంచి నేర్పాలి అప్పుడే శాంతి శుభము కలుగును.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!