చెలి పిలుపు

💖చెలి పిలుపు💖

రచయిత :: Aarka

తేనెలూరే చెలి తడి ఆధారాలు
బెదురుగా అదురు వేళ

చెలి బిగి కౌగిలింతలో
మెత్తని అందాలు
దాడి చేయు వేళ

చెలి సన్నని నడుము
మడత చేతిని తాకువేళ

సిగ్గుల చెలి కన్నులు
రమ్మని పిలిచినవేళ

ఎరుపెక్కిన చెలి చెక్కిళ్ళు
కెంపులు పూయువేళ

తనువులో చెలరేగిన తాపము
గుండెలలో గుబులైనవేళ

గుండెల్లో అదురుతున్న
శబ్దము చెవిలో మంత్రమైనవేళ

చెలి మెత్తగా మునిపంటితో
చెవిని కొరికిన వేళ

చెవి దగ్గర మొదలైన
కనులలోకి చేరినవేళ

కన్నులలో కలిగిన భావము
తనువులో స్పందనైనవేళ

తనువులో స్పందన
చెలి సాంగత్యమును కోరువేళ

మదమెక్కిన మగతనము గల
సఖుడు తనని తాను
నిగ్రహించుకొనుట సాధ్యమగునా 💞

You May Also Like

One thought on “చెలి పిలుపు

Leave a Reply to Karthik Cancel reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!