గడసరి పెళ్ళాం

(అంశం: ” పెంకి పెళ్ళాం”)

గడసరి పెళ్ళాం

రచన :: సత్య కామఋషి ‘ రుద్ర ‘

తను చేసిందల్లా మెచ్చమంటది
నాకు నచ్చినదేదైనా మరి.,
తోసిబుచ్చి, తనకు నచ్చదంటది.!

నేనేమి చేసినా తప్పనంటది.!
చేతకాకున్నా, చేసింది సరి లేకున్నా,
తానేమి చేసినా అది ఒప్పనంటది.!
తప్పంటే, చీపురు తిరగేస్తనంటది.!

మూడు లేకున్నా, ముద్దు రాకున్నా,
నా గతి ఏదారి, ఏ తీరుగనున్నా,
ముద్దు మురిపాలాడమంటది.!
రవ్వంతైనా విసుగు చూపించానా,
మూతి ముడుచుకుంటది..తనపై
ప్రేమ తగ్గెనంటూ, ముప్పుతిప్పలెడ్తది.!

అది కావాలంటది..ఇది కొనమని
అంటది..అవసరమా అని అడిగినా,
తరువాత చూద్దామని అన్నానా.,
అమాంతంగ అలిగి కూసుంటది.!
పనీ పాడు చేయకుండా, పట్టపగలే
నా కళ్ళకు సుక్కలు సూపెడతది.!

నా మాటే వినకుంటది..తన మాటే
సాగాలంటది..అదేమిటని అడిగానా.,
‘నేనేమి చేసినా, అది మరి మీ మంచి
కోరేనంటది’, నా నోరును నొక్కేస్తది.!
చల్లగ మెల్లగ దువ్వి నన్ను ప్రేమతో
కట్టిపడేస్తది..ఎంతెంతటి గడుసైనది.!
ఈ మొరటోడికి సరైన పెంకి పెళ్ళామది.!

You May Also Like

2 thoughts on “గడసరి పెళ్ళాం

  1. బాగుంది సర్..మీ గడసరి పెళ్ళాం..👌😀😀😀

Leave a Reply to Lahari Cancel reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!