గురు దేవో భవ…

 గురు దేవో భవ…

రచయిత :: రమాకాంత్ మడిపెద్ది

కన్నవారి కలల సౌధానికి పునాదులం మేము
భావి భారత పౌరుల భవిష్యత్తు భవనానికి మూల స్తభాలం మేము
మీ కలలకు కళ్ళు మేము
మీ పయనానికి కాళ్ళు మేము
పడిపోతే పట్టుకునే చేతులం మేము
తప్పు చేసే దండించే బెత్తలు మావి
ఒప్పు చేస్తే మెచ్చుకొని భుజం తట్టే చేతులు మావి
విజయం అనే శిఖరం అంచుకు మిమ్మల్ని చేర్చి
మేము మాత్రం నేలపై మొదటి మెట్టునా గర్వంగా నించుటం
జీతం పెరిగిన రోజు కన్న మీ జీవితం బాగుపడిన రోజే ఎంతో సంతోషిస్తాం
గురుకులం దేవాలయం
గురువులం మేము దేవుళ్ళం కాము
చదువు అనే దేవుడిని మీకు పక్కనే ఉండి దర్శింప చేసే గుడి పూజరులం
వచ్చే దక్షిణ కంటే
ఇచ్చే గౌరవానికి బద్దులం
ఏ పని లేని వాడు
ఇంకే పని చేత కాని వాడు
బతక లేక బడిపంతులు అవుతాడు అని
బంధువులు స్నేహితులు ఇరుగు పొరుగు ఊరూరూ అవహేళన చేసిన
లక్షలు తెచ్చే సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు
కోట్ల పెట్టుబడులతో వ్యాపారాలు
సుఖం తప్ప మర్యాద లేని పదవులు
లెక్కలేనన్ని ఉన్న లెక్క చేయక
ఇష్టంగా, స్వయంగా అనుకోని కోరుకోని
ఓ ఉద్యోగంలా కాకుండా ఓ బాధ్యతలా భావించి
నిరంతరం శ్రమించే మామూలు ప్రైవేట్ టీచర్లం
ఒకప్పుడు గురు దేవో భవ అని ప్రతిరోజూ పొద్దున్నే ప్రార్థనా చేసిన రోజుల నుండి
ఇప్పుడు ఒక్కపూట తిండి లేక కుటుంబం తో సహా “అన్నమో రామచంద్రా” అని రోడ్లపై పడిన వైనం..
ఒక వైపు సాంకేతికత పెరుగుతుంది
మరోవైపు మందులేని మహమ్మారి రోగం
ప్రాణాలను తీస్తుంది
పరీక్షల్లో ఫలితాన్ని చూసి భయపడోద్దని ధైర్యం చెప్పిన వాళ్ళమే
నిజ జీవితమే ఓ పరిక్షలా
క్షణమో గండంలా
సమస్యల సుడిగుండంలో
బతుకు బండిని లాగలేక
బరువు అనిపించిన బంధాల్ని దించలేక
గడ్డు కాలంలో గడప దాటే ధైర్యం చెయ్యలేక
సగం జీతంతో ఇల్లు ఎలా గడపాలో పాలుపోక
భర్తగా తండ్రిగా కొడుకుగా నా భాద్యతలను
మరవలేక
కూటి కోసం కూలి పని కైనా పోవడానికి మనసురాక
ఆకలి తీర్చలేని ఆత్మాభిమానం తో
గతంలో నా పాఠలతో విద్యార్థుల భవిష్యత్తుకు
బాటలు వేసిన మార్గ దర్శకుడు
ప్రస్తుతానికి చేతులు చాచి బిచ్చం అడగాల్సిన పరిస్థితి క్షమించాలి దు:స్థితి  కి
ఎవరిని నిందించాలి ఉపాధ్యాయులను ఉద్యోగుల్లా మాత్రమే చూసే  ప్రభుత్వాన్నా?
అవసరం తీరాక కళాశాల గేటు దాటాక మర్చిపోయే విద్యార్థులనా?
అందరినీ ఆదరించి అందరి నుండి కృతఙ్ఞత ఆశించే నన్ను నేనా?
మీరే చెప్పండి ??? ఈ పోరాటపు పొడుపు కథ ను విప్పండి??
సమయం ఉంటే నా విన్నపాన్ని మన్నించి అలకించండి ఆలోచించండి
ఉపాధ్యాయుడు కూడా ఓ మనిషేనని గుర్తించండి.
వీలైతే మీ సాయాన్ని అందించండి

You May Also Like

One thought on “గురు దేవో భవ…

Leave a Reply to Chenna keshava Cancel reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!