జగతి కాంతి తేజం

(అంశం:”బానిససంకెళ్లు”)

జగతి కాంతి తేజం

రచన: దొడ్డపనేని శ్రీ విద్య

కడుపు కాలే కష్ట జీవుడా
భూస్వామి కబంధ హస్తాల్లో
దోపిడికి గురవుతున్న
జగతి కాంతి తేజమా !

లే! పిడికిలి బిగించు
ఊపిరి బిగపట్టు
జలగల్లా నీ రక్తం పీల్చే
రక్త పిపాసుల చెరను
విదిలించుకొని రా

కష్ట జీవుల శ్రమ ఫలితం కోసం
మంచి రోజుల ఆనందం కొరకు
శంఖారావం పూరించు

గొంతు సవరించు
ధైర్యం కూడగట్టు
కణ కణ మండే అగ్గిరవ్వ లా గర్జించు

తెగి పడే దాస్య సంకెళ్ళ కొరకు
దోపిడి దండును ఎదిరించే
సత్తా కూడ గట్టుకొని లేచిరా !

బానిస సంకెళ్ళ పీడ నుంచి
నీ రెక్కల బలం తో విముక్తుడివి కా !
జాతికి జీవం పోసి
స్వేచ్చా విహంగమై ఎగిరిపో
*జగతి కాంతి తేజమా!*

You May Also Like

One thought on “జగతి కాంతి తేజం

Leave a Reply to దొడ్డపనేని శ్రీ విద్య Cancel reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!