జీవించడమంటే

జీవించడమంటే

రచన : వాడపర్తి వెంకటరమణ

జీవించడమంటే…
ఎలాగోలా ఈదుకుంటూ
ఆవలి ఒడ్డుకు చేరుకోవడం కాదు

జీవించడమంటే…
నీకై కొన్ని పరిమళాల పుప్పొడులను
ఈ నేలపై కాస్తయినా గుమ్మరించి
ఆనందంగా జీవితాన్ని ముగించడం

జీవించడమంటే…
అహోరాత్రులు అలుపెరగక
కడదాకా కూడబెట్టడం కాదు

జీవించడమంటే…
నీకై కొన్ని పేజీలు చరిత్రలో లిఖించుకుని
జీవితానంతరం జనం గుండెల్లో
చిరస్థాయిగా మనీషివై నిలిచిపోవడం

కాటివరకు వచ్చే
కూడబెట్టిన ధనం కన్నా…
కలకాలం నిలచి ఉండే
కీర్తి కిరీటం ధరించడం గొప్ప కదా!

***

You May Also Like

One thought on “జీవించడమంటే

Leave a Reply to Lakshmanarao panchireddi Cancel reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!