అంశం : మనస్సాక్షి
నా మనసు
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన : మాధవి కాళ్ల
మనసా ఓ మనసా ఎందుకే
అతనిని చూస్తే ఎన్నో జన్మల బంధంలా అనిపిస్తుంది
అతని మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది
అతను ఎదురు అయితే మాటలు రావడంలేదు
నీ శ్వాస అతనిది
అతనికి ఇష్టమైనవి నీకు బాగా తెలుసు
నీ ఆలోచనలు అన్నీ అతను చుట్టే తిరుగుతుంటాయి
అతనితో గడిపే ప్రతిక్షణం మర్చిపోలేని అనుభూతి కలుగుతుంది
అతని కలిసే ప్రతిక్షణం కోసం ఎదురు చూస్తున్న
నీ మనసాక్షి ఎప్పుడు అతనిని కోరుకుంటుంది
నీ మనసు లో ఉన్న మాట అతనికి చెప్పేయి
నీ మనసు లో ఉన్న మాట కోసం అతను ఎదురు చూస్తున్నాడు
నీ చిరునవ్వు కి కారణం అతనే
అతనితో నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.
Hoo great😍😍
😊😊😊super