నవ వధువుకి వీడ్కోలు

నవ వధువుకి వీడ్కోలు
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన :వేల్పూరి లక్ష్మీ నాగేశ్వరరావు

“తల్లిదండ్రుల కన్యాదాన ఫలితం, కనుసన్నల మెలిగే కన్న కూతురికి, స్వయంగా అత్తారింటికి వీడ్కోలు పలకటమే!
తల్లిదండ్రుల దీవెనలే నీకు ‘దివిటీలై జీవితమంతా నీ సంసారం లో వెలుగు కావాలి!
తల్లి, నిన్ను బాల్యము నుండి ఒక ‘పూల తోటలో అరుదైన, సొగసైన ‘గులాబీ మొక్కలా పెంచాము, చిన్న ముల్లు కూడా, నీకు హాని చెయ్యకూడదని!
‘అమ్మానాన్నల అనురాగం పుణికిపుచ్చుకున్నవు, ఈనాడు అత్తమామలను దేవతలుగా కొలిచేవు, నీ భర్తతో నిండు నూరేళ్లు పండించుకో రా కన్నా!
నీ బంధు మిత్రుల అనన్య ప్రేమ నీకు అండగా , మా ఆయుష్షు కూడా పోసుకొని,నీ క్రొత్త సంసారం దినదినాభివృద్ధి చెందుతూ, కనిపెంచిన తల్లితండ్రుల, అత్తమామల, కనులవిందుగా ఉంటూ! సంసారం పండించుకో, నా ముద్దుల బంగారు కూతురా!
ఇదియే నీ పుట్టినింటి ‘వీడ్కోలు, మెట్టినింటి కి ‘ సుమాంజలులు.!!
‘తల్లిదండ్రుల మనసు.’

You May Also Like

One thought on “నవ వధువుకి వీడ్కోలు

Leave a Reply to V V Padmanabharao Cancel reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!