నీకై నేను

నీకై నేను

నాలోకంలో నేనుంటానప్పుడు
నీ చూపు నన్ను తాకనప్పుడు..

వెన్నెల్లా నన్నల్లేయమంటే
మబ్బుల్లో చంద్రుడి మల్లే…
నువ్వుంటావెప్పుడు!

చలిగాలిలా చుట్టేయ్యమంటే
దూరం దూరం పోతావెప్పుడు!

నా మది నిన్ను చేరాలంటూ
తెగ గొడవే చేస్తే….
నీమదికి మాటే చెప్పేదెప్పుడు?

నా కనులకు నిన్ను చూపించాను
నిన్ను కన్నుల్లో నింపుకోకుండా..
కనుమరుగువుతావెప్పుడు!

అలలై ఎగిసే హృదయానికి
నీ కౌగిలిలో ఊరట కలిగించేదెప్పుడు?

నిన్ను చేరాలనుకునే
నన్ను నువ్వు ప్రేమగా అల్లెసేదెప్పుడు?

నీ ప్రేమ లేని ఈ జీవితం
మారెను అడవికాచిన వెన్నెలల్లే!!

రచయిత::సిరి

You May Also Like

14 thoughts on “నీకై నేను

  1. చాలా బాగుంది అక్క… ప్రేమ కోసం వెతుకులాట.. పడే ఆరాటం.. చాలా బాగా చెప్పావు

Leave a Reply to Mahitha Cancel reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!