ప్రకృతి మన హక్కు

ప్రకృతి మన హక్కు

(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: సుజాత కోకిల.

కనకాలు సూర్యోదయం రాకమునుపే ఇంటి ముందు పేడ నీళ్లతో కల్లాపు చల్లి పల్లెటూరు ముగ్గులతో వాకిలిని అందంగా ముస్తాబు చేసింది.
ఎంత పొద్దున లేచిన పొద్దు ఆగుతానేలేదాయే మళ్లీ కూడండి కూలికి పోవాలా? ఇంకా నూకయ్య పొద్దు గడిచిన ఇంకా మంచం దిగనేలేదు. రాత్రి ఆడు తాగిన కళ్లు ఇంకా దిగినట్టు లేదు పడుకున్నాడంటే జాంపొద్దేకేదాకా లేవనే లేవడు అనుకుంటూ! పగలల్ల రెక్కలు ముక్కలు చేసుకొని బండ చాకిరి చేస్తాడు.
నేను చెప్తేనేమో ఇనడు ఇంకా ఏమైనా అంటే నీకు తెలియదే కనకాలు ఊకో అంటాడు. వాడు  మొండోడు ఇనడు మొరటుగా కనిపిస్తాడే కానీ మనసు చాన మంచిది.
“ఏమయ్యా నూకయ్య మన బిడ్డను పట్నం చదువులు చదివిద్దామయ్య మనం బండ చాకిరి చేసుకొని బతుకుతున్నాము మన బిడ్డ కూడా మనలాగే మగ్గాల! మన బిడ్డను చదివిద్దామయ్య!” అంది ఏమంటాడో ఏమోనని భయపడుతూనే అడిగింది. “అట్టాగే లేవే” నూకయ్య అనడంతో తానెంతో సంబరపడింది.
తన బిడ్డను చదువులకని పట్నం పంపింది రాను రాను పల్లెటూర్లలో పని లేక వ్యవసాయం భూములు లేక ఎంతోమంది నిర్భాగ్యులు పల్లెల నుండి పట్నాలకు వలస వెళ్తున్నారు. ఎంతో నిర్భాగ్య పరిస్థితి ఏర్పడింది. మాలాంటోళ్లకు వ్యవసాయం లేక చదువులు లేక మాలాంటోళ్లు కూలి, నాలి చేసుకుంటూ బతుకును మోస్తున్నారు ఏదో చిన్నదో, పెద్దదో కొలువుంటే ఆల్లే బతుకుతారు అనుకుంది కనకాలు.
అడవుల నన్నిటిని నరుకుతూ వ్యవసాయ భూములలో ఫ్యాక్టరీలను కడుతూ మేడల మీద మేడలు కడుతూ భూములనన్ని ఆక్రమించుకొని మా లేనోళ్ల బతుకులలో మన్ను కొడుతున్నారు. ఉన్నోళ్లదే పై చేయి తాగుడుకు మందు పోయించి కళ్ళు ఆశలు చూపించి  మా బతుకులు గుగ్గీ పాలు చేస్తున్నారు. ఈ అడవులే మనకెంతో జీవనాధారమని తెలుసుకుంటలేరు. ఈ పట్నం వోళ్లు అధికారం చేతిలో ఉన్నాయి కదా! అని అడవులను పీకేస్తున్నారు. ముందు ముందు కాలం ఎట్ట గడుస్తుందో ఆ ఎల్లమ్మ దయ మంచి ఆఫీసర్ అస్తే కానీ వీళ్ళ ఆటలు ఆగవు. అనుకుంది కనకాలు “నూకయ్య అరుస్తూ వచ్చాడు ఏడున్నావే కనకాలు అంటూ కూడు అండుతున్నాను”.
“పొలం కాడికి ఎళ్ళాలి అట్టాగే ఎల్దువు గాని నిన్న పోస్ట్ సోమన్న కనిపించాడు.” “ఏమన్నాడేంటి మన బిడ్డ కానీ ఏమైనా చెప్పిందటన అదే చెప్తున్న మధ్యలో చెప్పనీయకుండా అడ్డుపడతావుంటివి. మన బిడ్డ పెద్ద ఆఫీసర్ అట ఈ ఊరికే వేసినారట”. జంగల్ ఆఫీసర్ ట వస్తాందట!” “నిజమేనటయ్య అంటూ సంబరపడి మురిసిపోయింది. రేపు తెల్లార గట్ట వస్తుంది అట. “ఎదురుచూపులో ఎంతో ఆనందం కనిపించింది మారుమూల గ్రామంలో పుట్టి ఉన్నత చదువులు చదువుకొని ఫారెస్ట్ ఆఫీసర్ గా వచ్చింది. నూకయ్య, “కనకాలు ఆనందం ఇంత అంత అని చెప్పలేం”. బిడ్డ రాగానే హక్కున చేర్చుకొని సంతోషపడ్డారు ఇద్దరు. “ఆర్డర్స్ తీసుకొని వచ్చింది. అడవులను కాపాడుకుంటూ మూగ జీవాలకు రక్షణగా ఉంటూ.. తల్లిదండ్రులతో తన వ్యవసాయం చేయిస్తూ వాళ్లకి అండదండగా ఉంటూ అక్కడే ఉండిపోయింది. ప్రకృతిని జలాశయాలను కాపాడుకుందాం రక్షతి రక్షితః.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!