అమాయకత్వంలో ఔన్నత్యం

అమాయకత్వంలో ఔన్నత్యం

(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన : కె.కె.తాయారు

“ఒరేయ్ ఒరేయ్ శీనుగా యాడ సచ్చినావురా! పిలుత్తావుంటే, ఇనిపించ నేదా! ఓరి గొల్లిగా! ఏటిరా అంత కొవ్వు తిడుతూనే ఉంది తల్లీ”
“ఇంతట్లోకి శీను వచ్చీసినాడు, ఎందుకేటే వల్లా గోలెట్టెత్తున్నావు, ఏటైపోనాదీ, ఊరికే, ఏటమ్మా నీ గోల,” తల్లీని అన్నాడు శీను.
“అదెరా! మీ అయ్య ఈ.. పొద్దు పొలంకి పోనేడట” అయితే నానేటి  సేసేదే!” అన్నాడు “నువ్వె‌ళ్ళెహే, ఇంటిలో ఇద్దరు సస్తే ఒకడు సెయ్యకుంటే, ఇంకోడు సెయ్యాల్సిందే. గదేంటి” ! అంది.
“అంతా నీదే నేటీ పెద్ద మగారాణీ నాగ ” అన్నాడు.
“ఆ..మగారాణీనైతే ఇక్కడెందుకుంటాను రా!
“నా కరమ..సరే గానీ, నే మగారాణి నైతే పేడ పిసుక్కుంతూ సస్తానేటి అంది.
“ఏందే మాటాడుతూ..మాటాడుతూ మధ్యలో అట్టా లటక్కున ఆవు పేయి మూతి తన్నినట్టు గెంట్టిస్తావేటి, గెంట్టిస్తావేటి. “నీకియ్యన్నీ బాగా తెలుసే తల్లీ”! ఆ..అందుకే కదేటి అమ్మనయ్యాను.
“సరి..సరి బేగి నేచి తగలడు పొద్దుక్కేస్తోంది.”
“కంచు గిన్నెలో నిండా అంబలి, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పెట్టాను కానీచ్చి లగెత్తు” సరేనా! అంది. పాపం అమాయకురాలు తిట్టడం తెలుసు, కడుపునిండా పెట్టడం తెలుసు అమాయకపు ప్రాణి.
నిశాని గుర్తు, అంతకంటే విద్య లేదు ఏదైనా మాట్లాడిందంటే తను పెద్దల నుంచి తెలుసుకున్నది.
హృదయం నవనీతం అంత మంచిది ఈ లోపున రాజు “అమ్మో ఓలమ్మో నాను అంబలి తాగేసి గిన్ని కడిగి ఇట్టీశాను సూడు తిట్టొద్దు వెళ్లొస్తానమ్మ” అన్నాడు, “సరేలే నాయన జాగరత్తగా చూచుకో బాబు అని పంపింది.”
“ఇంతటిలోకి రాజయ్య ఏంది సుబ్బు కొడుకుని పంపేసినావేంటి అన్నాడు అవునయ్యా అంది అదేనే నోటిలో మాట నోటిలో ఉండగానే చేసేస్తావేటే ఎంత గొప్ప మనసే నీది పొగిడాడు”. రాజయ్య సుబ్బులు వంతు బెలూన్ లో గాలి కొట్టినట్టు ఉబ్బిపోవడం ఉబ్బిపోవడం ఏంటి? ఆ మొహం ఉబ్బడమే కాదు వెలిగిపోయింది నవ్వుతూ, ఇందయ్యా అంబలి అని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పెట్టింది. అదే వాళ్ళకి అమృతం మంచి బలవర్థకమైన  టానిక్. ఇంతటిలోకి కామందు గారి అబ్బాయి పరిగెత్తుకొచ్చాడు. “రాజయ్యా సుబ్బులుని అమ్మ అర్జెంటుగా పిలుచుకు రమ్మంది కారణం తెలీదు అన్నాడు.” “ఏంది బాబు ఏం అర్జెంట్ అయినాది అదే తెలియటం లేదు రాజయ్య.
“సరేలే నేను ఇప్పుడే దాన్ని ఎళ్ళదీస్తాలే నువ్వు పద” అన్నాడు రాజయ్య. “కాదు రాజయ్య నా బండి మీద తీసుకెళ్తాను రమ్మను అన్నాడు.” ఆ మాట అంటూనే నేనొచ్చేసినానండి. “చిన్న బాబు గారు పదండి అంది.”
“రాజయ్య ఆశ్చర్యపోయాడు అర్జెంట్ అంటే దీనికి భయం కానీ ఏది ఉండదు ఆ భయానికే భయాన్ని కల్పించేట్టు అంత అర్జెంటుగా బయలుదేరిన సుబ్బుల్ని చూస్తే రాజయ్య కళ్ళల్లో నీళ్లు వచ్చాయి”. చిన్న బాబు కళ్ళల్లోనూ నీళ్లు వచ్చాయి, కానీ ఎందుకో ఇద్దరికి తెలియదు.
ఇంటికాడ దిగి లోనికి పరిగెత్తింది “ఏంటమ్మా గోరు ఏటైనాది చెప్పండి అంటూ.” యజమానురాలు శ్రీ లక్ష్మీ గారు నిజంగా లక్ష్మీదేవి లాగే ఉంటుంది. “రా! సుబ్బులు సమయానికి వచ్చావు. అమ్మాయికి నొప్పులు కానీ మంత్రసాని ఇక్కడ కాన్పుఅవదు పట్టణానికి తీసుకెళ్లండి అంది అందుకు తోడుగా నిన్ను తీసుకెళ్లాలని రమ్మన్నాను.” “దానికేంది తల్లి ఇంత చెప్పాలా నెగండి బయలుదేరుదాం అని గబగబా అన్ని కావాల్సిన సామాన్లు సద్ది పెట్టేసి కార్లో పెట్టించేసి, అమ్మాయిగారిని పట్టుకొని నడిపించుకుని కారులో కూర్చోబెట్టి, అమ్మగోరు అంది అమ్మాయి గోరిని కార్లో కూకుండ బెట్టేసిన మీరే ఆలిసం రండి బేగి అంది. వెంటనే శ్రీ లక్ష్మీ గారు కారు దగ్గరికి వచ్చి ముందు సీట్లో కూర్చున్నారు. కారులో అమ్మాయిగోరు వెనక సీట్లో పడుకుంటే కాళ్ల దగ్గర కిందన ఇరుక్కొని కూర్చుంది. అనుకున్న దానికంటే ముందే హాస్పిటల్ చేరారు. అన్ని టెస్టులు చేసి బిడ్డ అడ్డం తిరిగింది ఆపరేషన్ చెయ్యాలి అన్నారు.
సుబ్బులు ఊరుకోకుండా “అందుకే కదేంటి  ఇంత దూరం ఏసుకొచ్చాం, అది వేరే చెప్పాలా! ఆలీసం కాకుండా బేగి ఏం చేయాలో అది చేయండి బాబు.” పాపం పాప నీరు అయిపోతాది అంది డాక్టర్ విసుక్కోపోయాడు శ్రీలక్ష్మి గారు ఆమెను ఏమీ అనకండి ఆమెకి ప్రాణం మా అమ్మాయి అంటే అంది. కానీ రక్తం అవసరం కదండీ మేడమ్ అనే లోపే సుబ్బులు నానిస్తానండి ఎంత కావాలంటే అంత తీసుకోండి అంది ఏదో బావిలో నీరు తోడినట్టు నవ్వాడు. డాక్టర్ మనస్ఫూర్తిగా హాయిగా ఎందుకంటే హాస్పిటల్ కి వచ్చేవాళ్ళు గర్వం మదం చూపెట్టేవాళ్ళు, జాలి దయ కోరేవాళ్లే. ఇలాంటి కొత్త తరహా స్పందన ఈ సుబ్బుల్లో చూసి నవ్వి అలాగే లేమ్మా! నీ రకతం టెస్టు చేసి సరిపోతుందో లేదో చూస్తాను అని నవ్వాడు. “ఏంది డాక్టర్ ఇన్ని పితలాటకాలు రకతం రకతమే కదా! మళ్లీ దానికి ఏంటి పరీచ్చలు చాలా బాగుంది. మామెక్కడ సూడనెనేదు ఇదేదో మహా కొత్తగా ఉంది సామి.” అయినా నవ్వాడు డాక్టరు ఆ..అమాయకత్వానికి.
శ్రీలక్ష్మి గారు వెంటనే “సుబ్బులు ఇక్కడ పద్ధతులు ఇక్కడ ఉంటాయి కాసేపు నువ్వు మాట్లాడకు మంచిది కాదమ్మా!” అన్నారు. అలాగేనండి అంది.
తర్వాత డాక్టర్ గారు సుబ్బులు రక్తం టెస్ట్ చేయించి ఇద్దరికీ సూట్ అవుతుందో లేదో చూడమన్నారు. అంతా చాలా త్వరితగతిని చేసి అమ్మాయి బ్లడ్ గ్రూప్ కి సరిపోతుందని నిశ్చయించారు. వెంటనే ఆపరేషన్ కి సిద్ధం చేసి ఈ లోపున సుబ్బులు దగ్గర రక్తం తీసి పెట్టారు. ఆపరేషన్ చాలా గణనీయంగా విజయాన్ని సాధించింది తల్లి బిడ్డ సౌఖ్యం అన్నారు. సుబ్బులు “మాము లోపలికి వెళ్ళొచ్చా! బాబులు అంది” అక్కడ వాళ్ళని. “కొంచెం సేపు ఉండమ్మా! మళ్లీ చెప్తాం అన్నారు”. అరగంట అయిన తర్వాత డాక్టర్ గారు వచ్చి సుబ్బులు దగ్గరికి వచ్చి “నీ రకతం భలే సరిపోనాది కదమ్మా సుబ్బులమ్మ అన్నారు”. ఆ భాషకి సుబ్బులతో సహా అందరూ నవ్వారు. “నాకేంటండి నాను ఇంత అప్పటినుంచి ఇనాగే మాటాడేది అండి ఎలా మారుతది భాస మీరే చెప్పండి డాకటర్ బాబు.” “అంతే అంతే అన్నారు” అందరూ నవ్వారు. అందరూ సంతోషంగా పుట్టిన బిడ్డని చూస్తూ ఆనందాలు పంచుకున్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!