ప్రకృతి రూపాన పడతి
రచయిత:క్రాంతి కుమార్ ( ఇత్నార్క్ )
జీవనదుల జలపాతాలను
నల్లని కురులలో ఉంచిన నీలవేణి
మేఘాల మెరుపుల్ని
కాటుక కన్నుల్లో నింపుకున్న కమలాక్షి
వేల సిరి కాంతులను
స్వచ్ఛమైన చిరునవ్వులో తెలిపిన కాంత
హరివిల్లుల రంగవల్లులను
ప్రసన్న వదనంలో చూపిన పుత్తడిబొమ్మ
తరువుల పచ్చని సోయగాలను
అమృత హస్తాలతో చేసిన తరుణి
వెన్నెల తుషార చల్లదనాన్ని
నీహార ఒడిలో ఉంచుకున్న చెలువ
సెలయేటి గలగలలను
సుకుమార పాదాలలో నిలిపిన కోమలి
సమస్త ప్రకృతి అందాలను
తనువులో దాచుకున్న భామిని
***
సూపర్ తమ్ముడూ👏👏
థ్యాంక్స్ 🤗 అక్క
👏👏👏👏👏👏👏
థ్యాంక్స్ 🤗 బుజ్జమ్మ