రహస్య పేటిక

రహస్య పేటిక

రచన::చంద్రకళ. దీకొండ

ఆలోచనల అలలు
ఉవ్వెత్తున ఎగసిపడే…
లోతెంతో తెలియని
అంతరంగ సంద్రం…!

బయటకు వెలిగ్రక్కలేని
భావాలనెన్నిటినో దాచుకున్న
రహస్య పేటిక…!

వెల్లడి చేయకూడని చిలిపి,
మధురానుభూతుల గుప్తనిధి…!

మంచి చెడులకు మధ్య సాగే
రణ కురుక్షేత్రానికి సాక్షి…
మంచి జయిస్తే మానవుడు…
చెడు జయిస్తే దానవుడు…!

మనిషి వ్యక్తిత్వానికి పరీక్ష
పెట్టే గురువు…
ఉత్తీర్ణత సాధిస్తే పూలబాటలో
జీవన పయనం…
అనుత్తీర్ణుడైతే ప్రతి నిముషం
తొలిచే అపరాధ భావనతో…
జీవితం అశాంతి నిలయం…!!!

You May Also Like

One thought on “రహస్య పేటిక

Leave a Reply to సావిత్రి కోవూరు Cancel reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!