సాగే ప్రయాణం

సాగే ప్రయాణం

రచయిత :: పి. వి. యన్. కృష్ణవేణి

రామయ్య ఉదయాన్నే లేచి పొలానికి బయలుదేరాడు. పొలం పని రోజుల్లో,  నిమిషం ఖాళీ లేకుండా పని చేస్తే కానీ పంట అనుకున్న టైం కి చేతికి రాదు.  ఏమాత్రం బద్దకం అనిపించిన,  ఆ సంవత్సరం పంట మొత్తం నేలపాలు కావాల్సిందే.

రాత్రికి రాత్రి చిరుజల్లు తో మొదలైన వాన పెద్ద గాలివానగా మారింది.  రాత్రి 11 గంటల వరకు కష్టపడి పంటను ఇంటికి చేర్చుకున్నాడు.  వరి పంట అవ్వడం వల్ల వడ్లను మాత్రం వాన నుంచి కాపాడుకో గలిగాడు.  మిగిలిన గడ్డి మొత్తం అలాగే వదిలేశాడు.

ఆ గడ్డి ఏమైందో చూడకపోతే,  ఈ సంవత్సరం మొత్తం పశువులకు మేత కొనుగోలు చేసి అందించాల్సి వస్తోంది.  అందుకే , ఆదరాబాదరా తెల్లవారగానే పొలానికి బయలుదేరాడు.

జీవితంలో బతుకు బండి నడపడానికి,  ఈ వ్యవసాయం ఒకటే తనకు తెలిసిన విద్య. తాత ముత్తాతల నుండి అలవాటైన వృత్తి . కాబట్టి లాభనష్టాలు బేరీజు వేయకుండా అలాగే బతుకు బండి సాగిస్తున్నాడు.

కొద్దిగా చదువు అబ్బి ఉంటే,  వేరే వృత్తి చేసుకుంటూ పట్నం లో స్థిరపడే వాడిని కదా!!!! ఈ గొడ్డు చాకిరీ తప్పేది అనుకుంటూ ఉంటాడు అప్పుడప్పుడు విసుగ్గా.

***

రాధా లంచ్ బాక్స్ రెడీ అయిందా,  టైం అయిపోతుంది అంటూ రాదని హడావిడి పెట్టాడు కృష్ణ.

అయిపోయింది.  రెండు నిమిషాలు, టీ పెట్టాను. తాగి వెళ్ళగానే తిట్టు అంది రాధ.

అమ్మో అంత టైం లేదు ఇవాళ  ఆఫీస్లో మీటింగ్ ఉంది.  అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి,  వెళ్తున్నా అని చెప్పి లంచ్ బాక్స్ మాత్రం తీసుకొని వెళ్ళిపోయాడు.

ఏం  ఉద్యోగాలో ఏంటో,  తినడానికి టైం ఉండదు.  కంటినిండా నిద్ర ఉండదు. అసలు మనశ్శాంతి లేకుండా పోతోంది. తనలో తాను అనుకుంటూ తనకి మాత్రం టీ తెచ్చుకుని తాగుతోంది రాధ.

ఇంత సంపాదించుకొని కడుపు నిండా తిండి లేకపోతే ఎలా అండి. ఈ హడావిడి  పక్కనపెట్టి,  సొంతంగా ఏదైనా వ్యాపారం చేసుకుందాం అంటే వినడు కృష్ణ అనుకుంది.

***

విజయ్ ఒకసారి ఆ చంటాడ్ని ఎత్తుకోవా,  బయట ఒక కస్టమర్ వెయిట్ చేస్తుంది.  ఆ బేరం చూసుకుని వస్తాను ప్లీజ్ అంటూ బతిమాలుతోంది శాంతి.

అబ్బ అబ్బ ఏంటి శాంతి,  నాకు టైం అయిపోతుంది కదా!!!  ఇప్పుడు వాడిని ఎత్తుకోమంటే నాకు ఎలా కుదురుతుంది ? అని విసుక్కుంటూనే బాబుని తీసుకున్నాడు విజయ్.  ఒక చేత్తో గబగబా టిఫిన చేస్తున్నాడు.

ఒక 10 నిమిషాలు అయ్యాక,  శాంతి లోపలికి వస్తూ చిన్న పని చెప్తే ఎందుకు అలా విసుక్కుంటారు?  మనం ఖాళీగా ఉన్నప్పుడు రారు కదా కస్టమర్స్.  మనం వీలు ప్రకారం బావుంటుందని,  ఉద్యోగం మానేసి ఈ చీరల వ్యాపారం పెట్టినా,  ఇలా విసుకుంటే,  నేనేం చేయను అంటూ బాబుని ఎత్తుకుంది.

బాబు ని వదిలేసి బయటకు వెళ్లి ఉద్యోగం చెయ్యడానికి వీలు పడదని ఈ వ్యాపారం మొదలుపెట్టాను. కస్టమర్లు బాగా పెరిగారు.  అంతా బావుంది,  అన్న టైం లో టిఫిన్ తినే టైం లేకుండా హడావిడి సరిపోతుంది. ఒక హెల్పర్ ని తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది.

ఏం చేస్తుంది మరి విజయ్,  శాంతి ఇద్దరు సంపాదిస్తే గానీ, వారి జీవనం సాగించడానికి సరిపడా పైకం రాదు. అందుకే ఎలాగోలా నెట్టుకొస్తున్నారు.

ఫోన్ రింగ్ అవడంలో ఫోన్ ఎత్తింది శాంతి.

హలో అక్క ఎలా ఉన్నావు అంటూ రాధా అవతల నుంచి.

చిన్నగా నవ్వి నేను బాగానే ఉన్నాను నువ్వు ఎలా ఉన్నావు అని అడిగింది శాంతి.

ఆ బానే ఉన్నాను అక్క.  ఒకటే హడావిడి అందుకే ఉద్యోగం మానేసి వ్యాపారం చేయమన్నాను కృష్ణ ని అని చెప్పింది .

నువ్వేమంటావ్ అక్క మీ సలహా చెప్పు అంది.

శాంతి నెమ్మదిగా నోరు విప్పింది రాధా దూరపు కొండలు ఎప్పుడు నునుపు గానే ఉంటాయి.  వ్యాపారం చేస్తే అందులో  బాధలు ఉండవు అనుకుంటున్నావా?  ఎందులో ఉండే కష్టాలు అందులో ఉంటాయి.

మనమల్లా, మనకు నచ్చిన, మన మనసుకు నచ్చింది చేసుకుంటూ పోవడమే అన్నాను.

అదేంటి అక్క వ్యాపారంలో ఏం కష్టాలు ఉంటాయి?  మన ఇష్టమైనప్పుడు చేస్తాము లేదా మానేస్తాము అంది చాలా సింపుల్ గా.

దానికి శాంతి నవ్వుతూ మధ్యలో మానేయడానికి ఇదేం బొమ్మలాట కాదు రాధా ముందుగా మనం పెట్టుబడి పెట్టాలి.  ఆ పెట్టుబడి అంతా మళ్ళీ వ్యాపారంలో వసూలు చేసుకోవాలి . లాభం మాట అటుంచి నష్టం లేకుండా చేసుకోవాలి.  ఎంత ఖర్చవుతుంది,  ఎంత సంపాదిస్తున్నారు!!! అన్నది చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది.  ఇందులో లాభాలు అంటే,  ఏ వ్యాపారమైనా మెళకువలు తెలిసి ఉండాలి. కస్టమర్లకు మనపై నమ్మకం కలగాలి.

ఏదిఏమైనా …….మనం చేసే పని ఏది అయినా ఊరికే ఏదీ రాదు అని చెప్పాను. ఏమనుకుందో ఏమో సరే అక్క ఉంటాను అని ఫోన్ పెట్టేసింది..

రాధ ఫోన్ మాట్లాడుతూ ఉండగానే కృష్ణ ఫోన్ మాట్లాడుతూ వస్తున్నాడు. ఊరు (పల్లెటూరు) నుంచి వాళ్ళ అన్నయ్య రామయ్య నుంచి ఫోను.  వ్యవసాయం బాగా లేదని ఒకటే వేదన. చాలా ఇబ్బందులు పడుతున్నాడని కృష్ణ మాటలు బట్టి అర్థం అవుతోంది.

రాధకి చివరగా అర్థమైంది ఒక్కటే బతుకు బండి నడవాలంటే ఎంతో వ్యయ ప్రయాసలతో కూడుకున్న పనే జీవనం సాగించడం అనేది అరటి పండు వలసినంత సులభతరం ఏమి కాదు అనుకుంది.

ఉన్నంతలో తనే సంతోషంగా ఉన్నట్టు అర్థమైంది రాధకి.  అందుకే  తనకు చేతనైనంతలో అటు రామయ్య బావ గారికి,  ఇటు శాంతీ  అక్కకి కూడా తగిన సహాయం అంద చేయాలనుకుంది.

అదే కదా మన జీవన యాత్రలో  ప్రేమ,  ఆప్యాయతలకు ఉన్న ప్రత్యేకత. ఇది ఒక ఒక నిరంతర ప్రయాణం.  సాగే ప్రయాణం

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!