దిగజారుతున్న విలువలు

దిగజారుతున్న విలువలు

రచయిత ::శ్రీదేవి శ్రీనివాస్(శ్రీ 💜 శ్రీ)

పవన్ చదువు పూర్తి చేసుకుని ఇంటికి వచ్చాడు ఇంట్లో తల్లి ఝాన్సీ తండ్రి గిరీష్ కుమార్ ఉంటారు వాళ్లది కోటీశ్వరుల కుటుంబం కాకపోయినా పర్వాలేదు స్థితిమంతులే. పవన్ ఇంటికి వచ్చి రెండు రోజులైనా తల్లితో కానీ తండ్రితో కానీ సరిగా మాట్లాడకుండా ముభావంగా ఉంటున్నాడు విషయం అర్థం కాని తండ్రి ఏం జరిగిందని కొడుకుని అడిగాడు దానికి పవన్ ఏమీ సమాధానం చెప్పకుండా తండ్రి చేతిలో ఒక లెటర్ పెట్టి తలవంచుకుని మారు మాట్లాడకుండా బయటకు వెళ్లిపోయాడు.గిరీష్ కుమార్ ఆ లెటర్ ఏమిటా అని చింపబోయేటంతలో ఏమిటండీ అది అని ఝాన్సీ కూడా వచ్చి అక్కడ నిలబడింది అందులో ఏం రాసి ఉందా అని భార్యాభర్తలిద్దరూ చదవసాగారు.

మమ్మీ, డాడీ,

నేను రాసే లెటరు మీకే కాదు మీ లాగా ఆలోచించే అమ్మానాన్నలందరి కొరకు. పిల్లలు బాగా చదువుకుని మంచి ఉద్యోగం వచ్చి బాగా డబ్బు సంపాదించాలని రెసిడెన్సి స్కూల్ లో చేర్పిస్తే, మాకు మిమ్మల్ని చూడాలని పించినా వాళ్లు మమ్మల్ని పంపరు మిమ్మల్ని రానివ్వరు.రోజులో 18 గంటలు లేదా 20 గంటలు చదువు ,చదువు మార్కులు ,మార్కులు ఇదే గొడవ అంతేగాని ఒక పది నిమిషాలైనా విలువల గురించి గాని ,సమాజంలో ఎలా బ్రతకాలి అని గానీ ఎవరిని ఏవిధంగా గౌరవించాలని గానీ నేర్పలేక పోతున్నారు అందుకే కదా సంపాదనే తప్ప విలువలు తెలియని బ్రతుకులు అయిపోయాయి రోజురోజుకీ విలువలు దిగజారి పోతున్నాయి సమాజంలో జరుగుతున్న అనర్థాలకు,దారుణాలకు కారణం ఒక విధంగా ఇది కూడా కావచ్చు

పెద్దలను గౌరవించాలి అబద్ధం ఆడకూడదు దొంగతనం చేయకూడదు అని తెలియజేసే నీతి కథలు చెప్తూ, మంచి మాటలు నేర్పుతూ, మనవరాళ్ళని మనవళ్ళని చూసుకుంటూ ఆనందంగా బ్రతికే నానమ్మలను ,తాతయ్యలను వృద్ధాశ్రమానికి పంపుతున్నారు.ఇంక విలువల గురించి మాకు ఎలా తెలుస్తుంది మమ్మల్ని మా బాగు కోరి రెసిడెన్సియల్ హాస్టల్స్లో వేస్తున్నాము అంటున్నారు మరి నానమ్మ లను తాతయ్యలను ఏం బాగు కోరి వృద్ధాశ్రమంలో వేస్తున్నారు నన్ను చదువు కోసం హాస్టల్లో చేర్పించి తర్వాత నాన్నమ్మనీ కూడా వృద్ధాశ్రమంలో చేర్పించేశారు
నేను సెలవలకి ఇంటికి వచ్చినప్పుడల్లా నాకు నానమ్మ ని చూడాలనీ , నానమ్మతో కథలు చెప్పించు కోవాలని ఉండేది కానీ మిమ్మల్ని అడిగేందుకు భయంగా ఉండేది
ఈ మధ్యనే మా ఫ్రెండ్ వాళ్ళ నానమ్మ వృద్ధాశ్రమం లోనే చనిపోయింది ఇప్పుడు వాళ్ళ నానమ్మని చూడాలన్నా చూడలేని దుస్థితి వాడిది.ఇంకా ఆ గతి నాకు పట్టించనందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
అందుకే నేను ఈ రెండు రోజులనుండి బాగా ఆలోచించి ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను.నేను నానమ్మను తీసుకురావడానికి వృద్ధాశ్రమానికి వెళుతున్నాను మీలో మానవత్వమన్నది ఉంటే దీనికి అంగీకరిస్తారని ఆశిస్తున్నాను.
సిద్ధంగా ఉంటారా నానమ్మ ఇంట్లోకి ఆహ్వానించడానికి లేదా మీరు వృధ్ధా ఆశ్రమంలో చేరడానికి . మీరే నిర్ణయించుకోండి నా నోటితో అయితే నేను చెప్పలేను ఎందుకంటే నాన్నమ్మ దగ్గర నేర్చుకున్న విలువలు నాలో ఇంకా ఉన్నాయి కాబట్టి
ఇట్లు పవన్
ఆ లెటర్ చదివాక ఇద్దరూ ఇన్ని రోజులూ వాడి భవిష్యత్తు బాగుంటుంది అనుకున్నాము కానీ వాడు ఏమి కోరుకుంటున్నాడు ,వాడికి ఏమి దూరం చేస్తున్నామని ఆలోచంచలేకపోయాము అత్తయ్యా క్షమించండి అని ఝాన్సీ
అమ్మా క్షమించు అనే గిరీష్ కుమార్ మనసులోనే క్షమాపణ చెప్పుకున్నారు కళ్ళవెంట కారుతున్న నీటిని తుడుచుకుంటూ.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!