సిగ్గుపడుతున్న భరతమాత

అంశం: స్వేచ్చా స్వాతంత్ర్యం ఎక్కడ!?

సిగ్గుపడుతున్న భరతమాత
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: బాలపద్మం

సాలోచన చేస్తున్న భరతమాత
సిగ్గుతో రగులుతోంది
నిత్యావసరాలలో మందుల్లో
నిర్లజ్జగా జరిగే కల్తీలో
ప్రజలకు అన్నార్తిని తీర్చే
పుడమిపుత్రుని దోచే దళారులలో
ప్రతిభావంతులెందరినో
తెరవెనుక బొమ్మలు చేసే వ్యవస్థలో
సామాన్యుల నడ్డి విరిచేస్తూ
పబ్బం గడిపే రాజకీయ నాయకుల్లో
శ్రమ దోపిడీతో నైపుణ్యాన్ని
నిర్వీర్యం చేసే కార్పొరేటు వ్యక్తుల్లో
స్వేచ్ఛా స్వాతంత్ర్యం ప్రజ్వరిల్లుతోందని
ఇదేనా త్యాగజనులెందరో
వీరికిచ్చిన వాయువులకర్ధమని!

You May Also Like

7 thoughts on “సిగ్గుపడుతున్న భరతమాత

Leave a Reply to V V Padmanabharao Cancel reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!