సృష్టిలో తీయనిది స్నేహమేనోయి

సృష్టిలో తీయనిది స్నేహమేనోయి
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్

మన్మథరావ్, మన్మథరావ్ అంటూ నా వయస్సే సుమారు ఉన్న పసిమిఛాయతో, నిగనిగలాడే బట్టతలతో ఉన్న మనిషి కెనడా లో నా కొడుకు ప్రవీణ్ తో నాయగార జలపాతం దగ్గర పిలవగానే ఆశ్చర్యపోయాను. ఆయనే దగ్గరకు వచ్చి మరచిపోయావ, నేను పరమేశ్వరాన్ని అనకాపల్లి అన్నాడు. నాకు మతిపోయింది. అమాంతం వాడిని గట్టిగా వాటేసుకుని ఎలా పోల్చావురా నన్ను అన్నాను. వెంటనే నీ ప్రింట్ నీ కొడుకు వాడి పక్కన నువ్వు తప్పక మన్మథుడీవే అని పిలిచేను అన్నాడు. ఒక్కసారిగా ఏభై సంవత్సరాల గతంలోకి వెళ్ళాను. నేను, పార్వతీశం బాల్యంలో అనకాపల్లిలో ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కలసి చదువుకున్నాము.
మా నాన్నగారు ప్రాథమిక స్కూలు ఉపాధ్యాయులు. మేము ఆరుగురు సంతానం. నలుగురు ఆడపిల్లలు, నేను మరియు తమ్ముడు ప్రసాదం. పరమేశ్వరం ఒక్కడే సంతానం వాళ్ళది నాలుగిళ్ళ పెద్ద భవంతి. పనివారు, వంటవారు, వచ్చే పోయే జనం వాళ్ళ నాన్నగారు రాఘవయ్య కాంగ్రెస్ నేత రెండు సార్లు పార్లమెంటు సభ్యునిగా ప్రాతినిధ్యం వహించిన మనిషి. వాళ్ళ ఇంట్లో పెద్ద ఊయల ఎంచక్కా ఊగేవాళ్ళం. నన్ను పిల్లడిలా చూసాడు. శారదా నది దగ్గర తోటలో మామిడి, జామి, చెరుకు ఉండేవి అక్కడ మేము సెలవుల్లో, వేసవిలో ఆడుకునే వాళ్ళం. ఆ రోజులు గుప్తుల కాలపు స్వర్ణయుగమే అనుకుంటుండగా ఏరా ఆలోచనల్లో పడ్డావా అన్నాడు. తరువాత చెప్పడం ప్రారంభించాడు. నేను ఇంటర్ అయ్యాక మద్రాస్ లో ఇంజినీరింగ్ తరువాత ఎమ్ ఎస్ అమెరికాలో చేస్తుండగా అమ్మ నాన్న ఆక్సిడెంట్ లో పోయారు. చదువు పూర్తయ్యేక మామయ్య కూతురు లక్ష్మిని పెళ్ళి చేసుకుని కెనడా లో మంచి కంపెనీలో కెమికల్ ఇంజనీరు గా స్థిరపడ్డాను. ఇప్పుడు నేను ఇక్కడ సిటిజెన్. నాకు ఇద్దరు పిల్లలు ఆడ, మగ వారి పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఇక నీ సంగతి చెప్పు అన్నాడు.
వెంటనే నేను బి.ఎస్.సి.అయ్యాక బి.ఇ. డి చేసి ముప్ఫై ఐదు సంవత్సరాలు టీచర్ గా పనిచేసి తరువాత హెడ్ మాస్టర్ గా రిటైర్ అయ్యాను నాకు ప్రవీణ్ ఒక్కడే కొడుకు వాడు ఇంజినీరింగ్ చేస్తుండగా నా భార్య పార్వతి కాన్సర్ తో పోయింది. అన్నిట్లో మంచి మార్కులు సంపాదించి కెనడా లో ఉన్నత చదువుకొచ్చి ఇక్కడే స్థిరపడ్డాడు. వాడు ఇక్కడ అమ్మాయినే పెళ్ళి చేసుకుంటే భవిష్యత్ నీది అని ఇక్కడకు మూడు నెలల క్రిందటే వచ్చాను. ఎల్లుండి వెళ్ళి ఎయిర్ ఇండియా లో ఇండియా వెళుతున్నా మళ్ళీ వేసవికి వస్తాను అన్నాను. అంటే వాడు మా వాడితో చెప్పి మీకు ఇరవై నిమిషాలే డ్రైవ్ మా ఇల్లు అని నన్ను తీసుకు వెళ్ళి భార్యతో మా చిన్నప్పటి స్నేహితుడిని రాత్రంత మాస్టర్ లు, అలివేలు ని ఏడిపించడం, స్కూలు మాని తోటలోకి వెళ్ళడం, ఆచారి మాష్టారు మాచే గోడ కుర్చీ వేయించడం ఎన్నో ఎన్నెన్నో చిన్ననాటి ముచ్చట్లు చెప్పుకుని మర్నాడు మా ఇంటికి చేర్చడమే గాకుండా ఎయిర్ పోర్ట్ కి వచ్చి వేసవి కాలం తప్పకుండా కలుద్దాం అని చెప్పినప్పుడు నా కంటనీరు చూసి ” సృష్టిలో తీయనిది స్నేహమేనోయ్” అన్నది అక్షర సత్యం మళ్ళా వేసవిలో కలుద్దాం అన్న మిత్రుడు, హితుడు పరమేశ్వరం వేసవిలో నే వచ్చే సమయానికి పరమేశ్వరుని సన్నిధికి చేరుకున్నాడని తెలిసి విధి బలీయం. వాడన్నట్లు అన్ని బంధాలకన్న స్నేహ బంధం జీవితాన మరువలేని బంధం….!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!