తెగువ

తెగువ

రచన:: పావని చిలువేరు

సుబ్బారావు ఒక సైకిల్ షాప్ లో పనిచేసేవాడు. అతనికి ఇద్దరు  ఆడపిల్లలు వాళ్ళని గవర్నమెంట్ స్కూల్లో చదువించేవాడు .

రోజూ పొద్దున పిల్లలిద్దరిని సైకిల్ మీద స్కూల్లో  దించడం అంటే సుబ్బారావు కి చాలా ఇష్టం , గవర్నమెంట్ స్కూల్ కి సైకిల్ మీద వెళ్లడం కూడా గొప్ప విషయమే .

రోజు పొద్దున షాప్ లో ఉన్న యేదో ఒక సైకిల్ మీద పిల్లలని బడికి తీసుకువెళ్లి , తరువాత భార్యని పని దగ్గరదించి అక్కడ నుంచి డైరెక్ట్ గా షాప్ కి వచ్చేవాడు సుబ్బారావు.
చాలీచాలని సంపాదన అయినప్పటికీ  కుటుంబంతో చాలా ఆనందంగా గడిపేవాడు .

షాప్ లో యెప్పుడూ బిజీ గా ఉండేవాడు, కాలేజీ పిల్లల సైకిల్ రిపేర్లతో , ఆటో మరియు లారీలకి  గాలి కొట్టడం, పంచర్ చేయడం తోనే  మధ్యాహ్నం అయ్యేది.

పనికి  వెళ్లిన సుబ్బారావు భార్య సాయంకాలం అయ్యాకే ఇంటికి వచ్చేది. పిల్లల మాత్రం స్కూల్ మధ్యాహ్నం వరకే ,అందుకే పిల్లలను మధ్యాహ్నం స్కూల్ నుంచి షాప్కే తీసుకొని వచ్చేవాడు.  ఇంటి నుంచి తెచ్చుకున్న అన్నం తినిపించి  కాసేపు విశ్రాంతి తీసుకునేవాడు.
ఇది సుబ్బారావు దినచర్య ,
కాని మధ్యాహ్నం విశ్రాంతి తీసుకున్న సమయంలో పిల్లలు సుబ్బారావుని  మాత్రం అసలు డిస్టర్బ్ చేసేవారు కాదు.

యెవరైనా సైకిల్ కి గాలి కోసం వస్తే ఆడ పిల్లలు అయినా కూడా సైకిల్లో గాలి కొట్టి పంపించే వాళ్లు, పెద్దవి వాహనాలు రిపేర్ కి వస్తే గంట ఆగి రమ్మనే వాళ్లు  కాని తండ్రిని మాత్రం నిద్ర లేపే వారు మాత్రం కాదు. పిల్లలకి నాన్న అంటే అంత ఇష్టం.
అక్కడే ఆడుకుంటూ, చదువుకుంటూ సాయంకాలం వరకి షాప్ లోనే ఉండే వారు పిల్లలు.

సుబ్బారావు మాత్రం షాప్ మూసి వేసే సమయం వరకు ఉండి తరువాత ఇంటికి చేరుకొని పిల్లలతో కాసేపు సరదాగా గడిపేవాడు.

కాని అనుకోకుండా ఒకరోజు సుబ్బారావు సైకిల్ మీది నుంచి కిందపడి ఒక కాలు, చెయ్యి విరగడంతో 3 నెలలు విశ్రాంతి తీసుకోవలసి వచ్చింది.
షాప్ మూత పడడం వల్ల ఒకరి సంపాదన సరిపోక ,ఆనందంగా ఉన్న కుటుంబం  చిన్నగా అప్పులు చేయడం మొదలైంది.

తండ్రి బాధని చూడలేని పిల్లలు సైకిల్ షాప్  తియ్యడానికి నిర్ణయించుకొని తండ్రికి చెప్పారు .

చిన్న వయసులోనే పిల్లలకి ఉన్న భాద్యత , అలాగే తన మీద ఇంత ప్రేమ పెంచుకున్న  బిడ్డలని చూసి  ఎంతో మురిసిపోయాడు .

కాని పిల్లలు షాప్ తీస్తాము అంటే మాత్రం ఒప్పు కాలేదు.
ఆడపిల్లలు పైగా చిన్న పిల్లలు మీరు పని చేయడం ఏమిటి అని బిడ్డలని  బుజ్జగించాడు .

ఆడ పిల్లలం , చిన్న పిల్లలమయితె మాత్రం కష్టకాలంలో తల్లిదండ్రులకి తోడుగా ఉండకూడదు అని యెవరు చెప్పారు నాన్న,  మీకు యిప్పుడు విశ్రాంతితో పాటు మీ మందులకు పైసలు  కూడా అవసరం,

నాన్న మీరు మంచి ఆహారం తీసుకోవాలి, కాని యేదో ఆలోచిస్తు సరిగా తినడం కూడా లేదు. మనకి  షాప్ ఉంది  ,కాని చూసుకునే  వారు లేకనే  ఈ సమస్య వచ్చింది. మేము ఉన్నాము  నాన్న ,నిన్ను చూసి రోజు కొన్ని నేర్చుకున్నాo,
మేమే చూసుకుంటామ్  షాప్ అని గట్టిగా వాదించి తల్లిని తండ్రిని ఒప్పించి షాప్ తీయించారు .

చిన్నగా సైకిల్లో గాలి కొట్టడంతో  పాటు పంచర్ చేయడం కూడా నేర్చుకున్నారు పిల్లలు.
అలా మళ్లీ వారి కుటుంబం లో ఆనందం తిరిగి వచ్చింది.

ఆడపిల్లలు అయినా కూడా  తండ్రి మీద ప్రేమతో కుటుంబానికి తోడుగా ఉండడం చూసి అందరూ సుబ్బారావు ని చాలా గొప్పగా చూసేవారు .

పిల్లలకి  గారాబం తో పాటు భాద్యత కూడా వచ్చేలా  పెంచాలి.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!